Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు… ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు…

June 21, 2024 by M S R

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ ఎంతవరకీ బంధము , తలకు కొరివి పెట్టేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు !!! 1973 లో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా గుర్తుకొచ్చే పాట ఇదే . 12 కేంద్రాలలో వంద రోజులు అడిన గొప్ప సెంటిమెంటల్ సినిమా . అప్పటికే ఎంతో పాపులర్ అయిన యద్దనపూడి సులోచనారాణి నవలను తెరకు ఎక్కించి , ఓ కమర్షియల్ కళాఖండాన్ని సృష్టించారు రామానాయుడు .

మూడు ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకుంది . ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ నటి అవార్డులు . తమిళం లోకి తిరు మాంగళ్యంగా , హిందీలోకి దిల్ ఓర్ దీవార్ గా , కన్నడంలోకి మాంగల్యగా రీమేక్ అయింది . బిర్రయిన స్క్రీన్ ప్లేలను తయారు చేసుకోవటంలో విజయా వారు అగ్రశ్రేణులు . ఆ స్కూల్ విద్యార్ధే రామానాయుడు . ఆయన సినిమాలు సక్సెస్ కావటానికి కారణం అదే . ఈ సినిమా కూడా అంతే .

అన్ని పాత్రలకు సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది . చివరకు వాణిశ్రీ తల్లి , మేనమామల పాత్రలతో సహా . ఆ పాత్రలకు తగ్గట్లుగా నటీనటులు అందరూ తమ తమ పాత్రల్లో జీవించే విధంగా దర్శకత్వం . దర్శకుడు తాతినేని రామారావుని , అంత బిర్రయిన స్క్రీన్ ప్లేను అందించిన ఆత్రేయను ఎంతయినా మెచ్చుకోవచ్చు . ముఖ్యంగా ఓ చక్కటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు . వాణిశ్రీ , శోభన్ బాబు , లక్ష్మి , చంద్రమోహన్ , కృష్ణంరాజు , గుమ్మడి , శాంతకుమారి , శ్రీరంజని , రావి కొండలరావు ప్రభృతులు నటించారు .

Ads

yaddanapudi

మొదటి స్థానం వాణిశ్రీదే . ఆత్మాభిమానం , సంసార బాధ్యత , తమ్ముడు మీద ప్రేమ , వాడు బాగుపడాలనే ఆరాటం , అన్నింటినీ సమ పాళ్ళల్లో మిళితం చేసి బ్రహ్మాండంగా నటించింది . ఆమె తర్వాత శోభన్ బాబు . ఆమెతో పోటీపడి , కష్టపడి నటించారు . సావిత్రితో నటించటం ఎలా సవాలో , వాణిశ్రీతో నటించటం కూడా అంతే సవాలు . ఆ సవాల్లో శోభన్ బాబు ఈ సినిమాలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు
.

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో , సి నారాయణరెడ్డి వ్రాసిన పాటలన్నీ గొప్పగా హిట్టయ్యాయి . ఈ అందానికి బంధం వేసుకున్నాడు , పుట్టిన రోజు పండగ అందరికి , ఉడుతా ఉడుతా ఉచ్ ఎక్కడికెళతావు , నందామయా గురుడ నందామయా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

ఈ సినిమా నాకు బాగా నచ్చటానికి మరో పర్సనల్ కారణం కూడా ఉంది . నాపేరు అనంత రామ సుబ్రమణ్యం . సాధారణంగా సినిమాల్లో పాత్రలకు అనంత్ అనే పేరు పెట్టరు . ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్ర పేరు అనంత్ . పైగా ఈ సినిమాలో ఆ పాత్ర కూడా నాకు బాగా ఇష్టం .

కాలేజి రోజుల్లోనే మా నరసరావుపేటలోనే మూడు నాలుగు సార్లు చూసి ఉంటా . టివిలో కూడా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . An unmissable , lovely , family oriented sentimental , feel good movie .

ఇప్పుడొస్తున్న నిర్మాతలను , దర్శకులను , స్క్రీన్ ప్లే రైటర్లను కట్టేసి చూపించాలి . ఆనాటి సినిమాలను యాభై అరవై ఏళ్ల తర్వాత కూడా ఎందుకు జనం ఆదరిస్తున్నారో , అవి కళాఖండాలుగా మిగిలిపోతున్నాయో తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలను చూడాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …………. (By డోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
  • వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…
  • నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
  • గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
  • రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions