Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రపంచం అబ్బురపడేలా ప్రివెడ్డింగ్… కానీ ప్చ్… మ్యాచ్ మిస్ మ్యాచ్…

February 22, 2024 by M S R

పెళ్లికి కాదు మహాప్రభో… 3 రోజులపాటు జరిపే ప్రివెడ్డింగ్ ఫంక్షన్‌కే అతిరథ మహారథులు వస్తున్నారట… అదేనండీ, కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ప్రోగ్రామ్… ఇక పెళ్లి ఏ రేంజులో ఉండబోతోందో ఊహించుకోవాల్సిందే… అన్నట్టు, ప్రపంచ ముఖ్యులు ఎవరొస్తున్నారంటే..? కొందరు గ్లోబల్ రిచ్ పర్సనాలిటీల జాబితా ఇది…

  1. Meta CEO Mark Zuckerberg
  2. Morgan Stanley CEO Ted Pick
  3. Microsoft founder Bill Gates
  4. Disney CEO Bob Iger
  5. BlackRock CEO Larry Fink
  6. Adnoc CEO Sultan Ahmed Al Jaber
  7. EL Rothschild chair Lynn Forester de Rothschild
  8. Bank of America chairman Brian Thomas Moynihan
  9. Blackstone chairman Stephen Schwarzman
  10. Qatar Premier Mohammed bin Abdulrahman bin Jassim Al Thani
  11. Adobe CEO Shantanu Narayen
  12. Lupa Systems CEO James Murdoch
  13. Hillhouse Capital founder Zhang Lei
  14. BP chief executive Murray Auchincloss
  15. Exor CEO John Elkann
  16. Brookfield Asset Management CEO Bruce Flatt

జుకర్ బర్గ్, బిల్ గేట్స్, మిలిందా గేట్స్, ఇవాంకా ట్రంప్ ఎట్సెట్రా… వాళ్లూ కుబేరులే… అంబానీ సమస్థాయి… కానీ ఒక్కటి గుర్తుంచుకొండి, ప్రపంచ నాయకులు ఎవరూ రారు, వీళ్లు పిలవరు, పిలిచినా రారు… వ్యాపారులు మాత్రమే వస్తున్నారు… వాళ్లే వస్తారు… ఇక్కడ మళ్లీ రెండంశాలు…

merchant

Ads

మన సమాజంలో ఆనవాయితీ ఏమిటంటే..? పెళ్లిని తమ సామాజిక, ఆర్థిక హోదాను చాటడానికి వేదికగా ఉపయోగిస్తాం… ఇదీ అంతే… రెండు ముఖ్యులతో ‘మర్యాదపూర్వక సంబంధాల’ కోసం వాడతాం… ప్రపంచ కుబేరులకు ఆతిథ్యం, ఆహ్వానం అంటే దానర్థం అదే… ఏమో, రేప్పొద్దున ప్రపంచాన్ని శాసించే రంగాల్లోకి కూడా అంబానీ డైవర్సిఫై కాబోతున్నాడేమో…

anant

డబ్బున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది… కానీ ఆ పటాటోపాన్ని, అట్టహాసాన్ని, ఆడంబరాన్ని ఎంతోకొంత పూసుకోవాలనుకునే మధ్యతరగతి వాడేమో అప్పులపాలవుతాడు… లోకం కోసం..! అందుకని నిరాడంబర వివాహాల్నే ఆహ్వానిద్దాం… అలాగని అంబానీ ఇంట్లో ఫంక్షన్‌ను వ్యతిరేకించడం కాదు సుమా… వాళ్లింట్లో శుభకార్యం, ఎలా చేయాలో వాళ్లిష్టం… వాళ్ల ఖర్చు…

ambani

ఇక్కడ చెప్పుకోవాల్సింది నిజానికి ఇది కాదు… మామూలుగా నిశ్చితార్థం అయ్యాక ఏ రెండు మూడు నెలలకో పెళ్లి కూడా జరిపించేయడం మన తెలుగిళ్లలో ఉన్న సంప్రదాయం… కానీ ఈ అనంత్ అంబానీ -రాధిక మర్చెంట్‌ల నిశ్చితార్థం జరిగి 13 నెలలు… ఇంతకాలం ఎందుకు ఆగిందో తెలియదు…

jio

నిశ్చితార్థం నాటి ఆ ఫోటోలన్నీ చూస్తుంటే… ఇప్పటికీ మీడియాలో కనిపిస్తున్న  ఫోటోలు చూస్తుంటే… ఒక జీవితసత్యం మాత్రం బోధపడుతుంది… శుభకార్యంవేళ ఈ ప్రస్తావన క్షమార్హం  కాదేమో కానీ చెప్పుకోవచ్చు… రాధిక మర్చెంట్ సన్నగా తీగెలా కనిపిస్తుంటే పక్కన అనంతుడు ఆడ్‌గా కనిపిస్తున్నాడు… మ్యాచ్ మిస్ మ్యాచ్… నిజానికి 208 కిలోలున్న అనంతుడు 18 నెలల్లో 108 కిలోలు తగ్గిన వైనం అప్పట్లో వైరల్…

ambani

రోజూ ఏడెనిమిది కిలోమీటర్ల నడక, కీటో డైట్, ప్రత్యేకంగా శిక్షకులు, పళ్లరసాలు, ప్రొటీన్ ఫుడ్, నో కార్బ్స్, లెక్క ప్రకారం రోజూ 1000 కిలోకాలరీలు దాటని ఆహారం… కానీ ఏమైంది..? మళ్లీ మొదటికి వచ్చింది… మునుపటి అనంతుడే కనిపిస్తున్నాడు… ఏవో పద్ధతుల్లో కష్టపడి, బరువు తగ్గడం కాదు, దాన్నలాగే మెయింటెయిన్ చేయడమే ఇంకా కష్టమనే నిజాన్ని అనంతుడి రూపం మనకు చెబుతుంది…

anant

నా కొడుక్కి ఆస్త్మా, హైడోస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రభావం ఉంది, అవి మావాడికి పడటం లేదు అని చెబుతుంది నీతూ… సరే, అది కాకపోతే మరో అనారోగ్యం కావచ్చుగాక… ప్రపంచంలో ఏ మూల ఎన్ని కోట్ల ఫీజు ఇచ్చయినా సరే, తీసుకొచ్చి చికిత్స చేయించగల కుబేరుడు అంబానీకి,  వరల్డ్ టాప్ టెన్ ధనికుల్లో ఒకడైన అంబానీకి, నిలబెట్టి ప్రభుత్వాలను కొనేయగలిగిన అంబానీకి… కొడుకు రూపం ఓ సవాల్… ఏమీ చేయలేడు, చేయలేకపోయాడు… దాన్నే విధి అంటారు…! డబ్బుతో, పలుకుబడితో, హోదాతోనే ఈలోకంలో అన్నీ సాధ్యం కావు… కావు…!! డెస్టినీ డిసైడ్స్ ఎవరీ థింగ్..!!

రాధిక మర్చెంట్

ఇంతకీ ఈ రాధిక మర్చెంట్ ఎవరనేదే కదా మీ ప్రశ్న… గుజరాతీయే… ముంబైలో పెరిగింది, న్యూయార్క్ యూనివర్శిటీలో చదువుకుంది… తండ్రి పెద్ద వ్యాపారే… కాబోయే అత్త నీతూ అంబానీలాగే రాధిక కూడా ట్రెయిన్డ్ డాన్సర్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions