Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనసూయను ఆంటీ అని పిలవాలంటే అది పడిపోవాల్సిందేనట…

March 16, 2025 by M S R

.

అనసమ్మతో ఇదే తంటా… నా ఇష్టమొచ్చినట్టు బట్టలేసుకుంటా, బికినీలో ఫోటో షూట్ చేసుకుని పబ్లిక్ డొమెయిన్‌లో పెడతా, నా మొగనికే ఏ బాధ లేదు, మీకేం నొప్పి, నన్నేమన్నా అంటే ఒక్కొక్కడినీ కేసుల్లో బుక్ చేస్తా…

ఇలా విరుచుకుపడుతుంది కదా… చాలా ఉదాహరణలు చూశాం కదా… అసలు ఆమెను ఎప్పుడూ లైవ్‌లో ఉంచేవే ఈ వివాదాలు, ఈ బెదిరింపులు, ఈ ఝలక్కులు… సరే, ప్రచారం కోసం ఆమె బాధ ఆమెది… అదొక పంథా అనుకుందాం…

Ads

కొన్నాళ్లుగా ఏమీ లేనట్టు అనిపించింది,… అలా సైలెంటుగా ఉంటే అన్సమ్మ ఎందుకు అవుతుంది…?  ఓ రీసెంట్ వీడియో మళ్లీ వైరల్ అయిపోతోంది… వయస్సు పెరిగినా సరే తనను ఎవరూ ఆంటీ అనొద్దు అట… గతంలో కూడా ఇలాగే అందరినీ తిట్టిపోసింది తెలుసు కదా…

తాజాగా ఎక్కడో ఏదో కార్యక్రమంలో పాల్గొంది… ఎవరో చిలిపివాడు ఆంటీ అని పిలిచాడు… ఈసారి తిట్లకు పూనుకోలేదు ఆమె… ఆ వ్యక్తిని వేలు పెట్టి చూపిస్తూ, దమ్ముంటే పైకి రా అని పిలిచింది… ఏం రాలేవా..? ఉ– పడుతుందా అనీ సైగలు చేసింది… వామ్మో, అనసమ్మ తీరే వేరు…

అన్నట్టు… అనసమ్మ అంటే, ఆంటీ అంటే అంత కోపం దేనికి..? అవేమైనా తిట్లా..? ప్రేమతో పిలిచేవే కదా… ఎస్, ఆడవాళ్లు వయస్సు దాచుకుంటారు, చెప్పుకోరు, సహజం… కానీ మగాళ్లను 30, 35 దాటగానే అంకుల్ అని పిలుస్తుంటారు అదే ఏజ్ ఆడవాళ్లు కూడా… ఏం, ఉడుక్కుంటున్నారా..? లేదు కదా… ఇరవై, పాతిక ఏళ్ల అమ్మాయికి పెళ్లయి పిల్లాడో పిల్లో పుడితే అందరూ ఆంటీ అంటుంటారు… అది బూతు కాదు, అవమానించడం అసలే కాదు…

ఒక వ్యక్తి ఎలా కనిపిస్తే అలా పిలుస్తారు, తప్పేముంది..? నువ్వే కదా రంగమ్మత్త అనీ, ఆమధ్య ఏదో వేశ్య వేషం కూడా వేశావు కదా… రంగమ్మత్త అంటే రంగమ్మాంటీ అనే కదా… పోనీ, పాపం, దమ్ముంటే పైకిరా అన్నావు కదా… వాడెవడో తిక్కతో నిజంగానే వస్తే ఏం చేసేదానివి..? ఏం చేయించేదానివి..? పైగా ఉ– పడుతుందా అన్నట్టు సైగలు…

లుక్కును బట్టి రేప్పొద్దున ఎవరైనా పిల్లాడు బామ్మా అని పిలుస్తాడేమో, మరి అప్పుడెలా..? బికినీ ఫోజులు సోషల్ మీడియాలో పెడుతున్నా సరే, అందరూ ఇంకా ఆంటీగా చూస్తున్నారు తప్ప అమ్మాయిగా చూడటం లేదనే భావనా..?

భలేదానివే అనసమ్మా… నువ్వేమైనా టీన్స్‌లో ఉన్నావా..? యవ్వనంలో ఉన్నావా..? ఏదో ఆంటీ అని ప్రేమగా పిలిచాడు… దానికే ఉ– పడేట్టు బెదిరించాలా..?! (జస్ట్, ఇదీ ఓ సరదా కథనమే డియర్ శ్రీమతి అనసూయా భరద్వాజ్ మేడమ్ గారూ…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions