అనసూయ… ఏమైనా అంటే కస్సుమని లేస్తుంది… తన తప్పున్నా సరే అంగీకరించదు… తన ధోరణేదో తనది… విమర్శను పాజిటివ్‌గా తీసుకునే గుణం ఏమాత్రం లేదు, వయస్సు 40 ఏళ్లకొచ్చినా సరే…
పొట్టిబట్టలు, దురుసు మాటలు, దూకుడు కౌంటర్లు… అదేమంటే నువ్వెవడివోయ్ అంటుంది… దాడి చేస్తుంది… అదొక మెంటాలిటీ… సరే, పలు సినిమాల్లో చేసింది… యాంకరిణిగా చేయడం వేరు, సినిమాలో ఓ పాత్రలోకి దూరి మెప్పించడం వేరు… ఏదో రంగమ్మత్త, దాక్షాయణి వంటి చిన్న చిన్న పాత్రలకు వోకే తను… ఆ పాత్రల పోషణలోనూ మైనసులున్నయ్, కాకపోతే అలాంటివి వచ్చీపోయే పాత్రలు కాబట్టి పెద్ద ఫరక్ పడదు…
కానీ తను ప్రధానంగా సినిమాను మోయగలదా..? లేదు… ఆ మాటంటే మళ్లీ కయ్ మని లేస్తుందేమో గానీ… అదే నిజం… తన మొహం ఉద్వేగ ప్రదర్శనకు అనుకూలం కాదు, అనగా ఫ్లెక్సిబుల్ కాదు… పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయడం కాదు, ఓ ప్రధాన పాత్రలో రాణించడం, మెప్పించడం అంటే..? ఐనా సరే, ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి… దర్శకులు చాన్సులు ఇస్తూనే ఉన్నారు…
Ads
సింబా అని ఓ తాజా సినిమా… ఆ సినిమాకు ప్రధాన స్టార్ కేస్ట్ జగపతిబాబు, అనసూయ… ప్చ్, స్టోరీ లైన్ మొదట్లో బాగానే ఉన్నట్టనిపించినా… తరువాత దర్శకుడు దారుణంగా నట్టడవిలో… దిశాతెన్నూ లేని హరితహారం ప్రాజెక్టులో తప్పిపోయాడు… ఫాఫం, బీఆర్ఎస్ సంతోష్ స్పూర్తేమో బహుశా..!
కథ మొదట్లో ఓ థ్రిల్లింగ్ హత్యలతో మొదలవుతుంది… అనసూయ ఓ స్కూల్ టీచర్… ఆ పాత్ర కేరక్టరైజేషన్ లోపమో, అనసూయ నటనారాహిత్యమో గానీ అంతగా మెప్పించలేదు… చివరకు జగపతిబాబు పాత్ర ఇంటెన్సిటీ కూడా లేదు… ఏదో సందేశం అంటాడు… కానీ దాన్ని బలంగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్యూర్…
సినిమాలో సందేశాలు సూటిగా ఉండకూడదు… కథ సందేశం ఇవ్వాలి… అంతర్లీనంగా… అంతేతప్ప, స్ట్రయిట్ సందేశాలు వినే కాలం కాదిది… ఏవో హత్యలు, ఇన్వెస్టిగేషన్లతో ముడిపెట్టి కథ చెప్పకూడదు… ప్రేక్షకుడు కనెక్ట్ కావడం లేదీ మధ్య అలాంటి కథలకు… టేకాఫ్ దగ్గర నుంచి సినిమా కథను క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడిని ఏదైనా కొత్తదనంతో ఎంగేజ్ చేయాలి… ప్చ్, సింబాలో అదే లోపించింది…
చిన్న బడ్జెట్… ఏదో అనసూయ, జగపతిబాబులతో నెట్టుకొస్తే సరి అనుకున్నారేమో… కానీ ఇద్దరూ ఇద్దరే… సరైన పాత్రలు పడకపోతే దేభ్యం మార్కు మొహాలే… ఫాఫం దర్శకుడు అది మరిచిపోయాడు… దెబ్బతిన్నాడు… పోనీలే, లెసన్ నేర్చుకుని ఉంటాడు కదా…!!
Share this Article