నాలుగైదు రోజులుగా అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది… జెమిని టీవీలో వచ్చే మాస్టర్ చెఫ్ హోస్ట్‌గా ఉన్న తమన్నాను వెళ్లగొట్టేసి, ఆ ప్లేసులో యాంకర్ అనసూయను తీసుకుంటున్నారు అని…! మొన్నటి ఒకటీ రెండు తేదీల్లో కూడా తమన్నాయే కనిపించింది,… కానీ రాబోయే సెషన్స్‌లో అనసూయ కనిపిస్తుందనీ, ఆల్‌రెడీ బెంగుళూరులోని స్టూడియోలో కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ కూడా అయిపోయిందనీ అంటున్నారు… చూద్దాం… కానీ ఓ పాపులర్ స్టార్ హీరోయిన్‌ను తీసేసి, ఓ టీవీ యాంకర్‌ను పెట్టడం అంటే ఖచ్చితంగా అది తమన్నా ఇజ్జత్ పోయే వ్యవహారమే… అఫ్ కోర్స్, ఇప్పుడామెకు చేతిలో అవకాశాలు లేకపోవచ్చు, కానీ తమన్నా అంటే తమన్నాయే… ఎటొచ్చీ ఆమెకు భాష రాదు, యాంకరింగు అసలే రాదు, నేర్పించేవాడు లేడు… జెమిని టీవీ క్రియేటివ్ టీం ఎంత పూరో అందరికీ తెలిసిందే కదా… దాంతో కృతకంగా సాగే ఆమె హోస్టింగు ఆ షోకు కొంచెం మైనస్ అయిపోయింది.,. కానీ అదే కొంపలు మించిన పెద్ద మైనస్ ఏమీ కాదు… అనేక మైనసుల్లో అదొక్క చిన్న మైనస్ అంతే…
తమన్నాను తీసేసి, ఆ ప్లేసులో పెట్టడం ఖచ్చితంగా అనసూయకు కెరీర్ పరంగా, డబ్బు పరంగా ఓ ప్లస్ పాయింటే… కానీ బేసిక్‌గా ఆమె కూడా తమన్నాలాగే ఇజ్జత్ పోగొట్టుకోబోతోంది… అదే మనం చెప్పుకోవాలని అనుకుంటున్నది… ఎందుకంటే..? ఒక రియాలిటీ షో, ప్రత్యేకించి కాంపిటీషన్ బేస్ షో అయితే దాని ఫార్మాట్ జనానికి ఈజీగా కనెక్టయ్యేలా ఉండాలి… ఒకవేళ అది విదేశీ ప్రోగ్రాం అయితే నేటివైజ్ చేసుకోవాలి, స్పాంటేనియస్‌గా షో రక్తికట్టించగల జడ్జిలు కావాలి… మాస్టర్ చెఫ్ ప్రధానమైన లోపం దాని ఫార్మాటే… మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం… యూట్యూబులో చిన్నాచితకా వీడియోలు, చివరకు చింతపండు పచ్చిపులుసు, జామకాయ బజ్జీల వీడియోలు కూడా లక్షల వ్యూస్ సంపాదిస్తున్నయ్ కానీ… ఈ మాస్టర్ చెఫ్‌కు కోట్ల ఖర్చు పెడుతున్నా ‘దేకేవాడు’ లేడు… ప్రతివారం రేటింగుల్లో దారుణంగా పడిపోయింది… (ఐనా జూనియర్ ఎన్టీయారే రేటింగుల్లో తల్లడిల్లిపోతున్నాడు, ఇక తమన్నా గురించి చెప్పేదేముంది… జెమిని రేంజ్ అదీ ఇప్పుడు…)
Ads
నిజానికి తమన్నా బదులు ఎవరు హోస్టుగా ఉన్నా ఈ రిజల్టే వచ్చేది… ఆ డిష్‌లు, ఆ ఇంగ్రెడియెంట్స్ మనవాళ్లకు ఎక్కవు… ఎవరో కొందరికి మాత్రమే ఆ అభిరుచి, ఆ ఆసక్తి ఉంటయ్… జనం కనెక్ట్ కావాలంటే ఓ లోకల్ ఐటం మీద కాంపిటీషన్ పెట్టాలి… ఉదాహరణకు సాంబారు… అందులో వాడే చింతపండు రసం దగ్గర నుంచి పోపు సామగ్రి, మసాలా దాకా ఓ పెద్ద టాస్క్… ఎవరు ఏ మోతాదులో ఇంగ్రెడియెంట్స్ వాడుతున్నారు, ఎప్పుడు ఏరకంగా యాడ్ చేస్తున్నారు, చివరకు ఎలా తయారైంది..? నిజానికి జడ్జ్ చేయడం జడ్జిలకు కూడా కష్టమే… కానీ అదేకదా అసలు పోటీ అంటే… ఇలాంటివే బోలెడు వంటలు… ఏవో మనకు నోరు తిరగని ఫారిన్ డిష్‌ల మీద మనకు ఆసక్తి ఎందుకు ఉంటుంది… (పొంగల్ మీద ఓ యూట్యూబ్ వీడియోకు 20 లక్షల వ్యూస్ ఉన్నాయి.., జస్ట్, పొంగల్… అదీ జనానికి కనెక్ట్ కావడం అంటే…) తాజా బార్క్ రేటింగ్స్ ఏమిటో తెలుసా..? 25 సెప్టెంబరున కేవలం 1.32 (Hyd +15)… అక్టోబరు ఒకటిన 1.20……. తక్షణం వైండప్ చేయాల్సిన షో… లేదంటే మార్పులు చేసుకోవాల్సిన షో… ఐనా జెమిని వాడికి సోయి లేదు…
తుమ్మ సంజయ్, మహేష్ పడాల, చలపతిరావు జడ్జిలుగా బాగానే సూటయ్యారు… అన్నట్టు… ఓ చిన్నమాట… 2010 నుంచీ ఈ షో హిందీలో వస్తోంది… ఈరోజుకూ దానికి హోస్ట్ ఎవరూ లేరు… సో, చివరకు తేలేదేమిటయ్యా అంటే… అక్కడ హోస్ట్ చేసేదేమీ ఉండదు, ఆ ప్రభావమూ ఉండదు… ఆ తమన్నాను మార్చినా, అనసూయను పెట్టినా… ఇప్పటికిప్పుడు దీపిక పడుకోన్‌ను తీసుకొచ్చినా, బేసిక్‌గా ఆ షో తీరు మారనిదే రేటింగ్స్ కథ మారదు అని…!! తమన్నా ఇచ్చిన డేట్స్ ను సదరు షో నిర్మాతలు సద్వినియోగం చేసుకోలేదు, ఆమె మరింత డబ్బు అడిగింది, వాళ్ళు ససేమిరా అన్నారు, అందుకే ఆమె వదిలేసింది అని మరో వెర్షన్… అదే నిజమైతే, అనసూయకు ఇచ్చే డబ్బు ఆమెకు అదనంగా ఇచ్చేవాళ్ళు కదా… సో, అసలు ప్రాబ్లం రేటింగ్స్ మాత్రమే..!!
Share this Article