ఒరేయ్ నాన్నా, మాస్టర్ చెఫ్ టీవీ ప్రోగ్రాం ఫార్ములాయే సరిగ్గా లేదు, నువ్వు ఏ వంట వండినా ఇక అది టేస్టుండదు, జనం వాంతులు చేసుకుంటున్నారు, సర్వ చేసేవాళ్లు ఎవరుంటేనేం, ముందు ఆ వండే తీరు మార్చరా బాబూ, లేకపోతే ఇంకా భ్రష్టుపట్టిపోతది ప్రోగ్రాం….. అని ‘ముచ్చట’ ముందే చెప్పింది… అనసూయ తన పరువు కోల్పోబోతుందని కూడా చెప్పింది… నిజానికి ఓ పాపులర్ హీరోయిన్ తమన్నాను తీసేసి, అనసూయను పెట్టుకున్నప్పుడే తెలుగు ప్రేక్షకగణం పకపకా నవ్వింది… ఈ జెమిని టీవీ వాడికి ఇక జన్మలో బుద్ధి రాదు అని ఫిక్సయిపోయింది… ఏమైంది..? అనసూయ ఇజ్జత్ నిజంగానే పోయింది, జనం ఇప్పుడు ఆ షో చూసి మరింత పగలబడి నవ్వుతున్నారు… పైగా తమన్నా చెప్పినన్ని రోజులు షూటింగుకు రాలేదు అంటూ జెమిని వాడు నోటీసులిచ్చాడు ఆమెకు, డబ్బు వసూలు చేస్తాడట ఆమె దగ్గర… అనసూయకేమో అడిగినంత డబ్బు ఇచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడట… అరె, సర్వర్ ఎవరైతేనేం..? డిష్ బాగుండాలి కదా…! అర్థమైందా..? డిష్ అనగా ఆ టీవీ ప్రోగ్రామే సరిగ్గా లేదు, అక్కడ తమన్నా ఉంటే ఏమిటి..? అనసూయ ఉంటే ఏమిటి..? వాడు దీపిక పడుకోన్‌ను తీసుకొచ్చి పెట్టినా డిష్‌కు రంగురుచివాసన రావు కదా…!
మొన్నటి 23వ తేదీ అనసూయే హోస్ట్… తమన్నాను వెళ్లగొట్టాక వచ్చింది… జడ్జి తుమ్మ సంజయ్ ‘నువ్వు రావడం మస్తు సంతోషంగా ఉంది’ అన్నాడు, అంటే తమన్నా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉండేదా సంజయ్..? తాజా బార్క్ రేటింగుల్లో ఈ ప్రోగ్రాం రేటింగ్ ఎంతో తెలుసా..? 0.99 మాత్రమే… (హైదరాబాద్ బార్క్)… అంటే అత్యంత దయనీయమైన రేటింగ్ అది… జెమిని టీవీ క్రియేటివ్ టీం మొత్తం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వెళ్లిపోవాల్సినంత సిగ్గుచేటు… సరే, ఆ పిచ్చి ప్రోగ్రాం గురించి ఇంత రాసుకోవడమే దండుగ… ఇక జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేసే ఎవరు మీలో కోటీశ్వరులు తన పతనాన్ని మరింత వేగంగా కొనసాగిస్తోంది… అది అర్జెంటుగా ఎత్తేయడం బెటర్… చెబితే వినరు… మొన్నటి బార్క్ రేటింగుల్లో మరీ 1.96, 1.94 ఇలా సాధించింది… మరీ ఓ నాసిరకం తెలుగు టీవీ సీరియల్ రేటింగ్స్ దీనికన్నా బెటర్… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం… ఇదిలాగే కొనసాగితే మాత్రం జూనియర్ మరింతగా తన ఇజ్జత్ పోగొట్టుకోవడం ఖాయం… డబ్బు పోతే పోయింది, అసలు నీ లెవల్ ఏంది..? నీ రేంజ్ ఏంది..? ఆ దిక్కుమాలిన ప్రోగ్రాం ఏంది తమ్మీ..? ఛట్, వదిలెయ్…
Ads
మరో తలకుమాసిన ప్రోగ్రాం గురించీ చెప్పుకోవాలి… దాని పేరు బిగ్‌బాస్… అత్యంత ఖరీదైన ప్రోగ్రాం… ఇజ్జత్ పోగొట్టుకుంటున్న ఇంకో హోస్ట్ నాగార్జున… ఇంతకుముందు ఏ రేటింగ్స్ వచ్చాయనేది పక్కనపెడితే ఈ సీజన్ పరమ దరిద్రంగా ఉన్నయ్ రేటింగ్స్… అసలు ఎంపికైన ఆ కంటెస్టెంట్లే శుద్ధ దండుగ… దానికితోడు రొటీన్, ఊకదంపుడు టాస్కులు, ఓ క్రియేటివిటీ లేదు… పోయినసారి ఉన్నట్టుగా లవ్ ట్రాకుల్లేవు… పైగా షణ్ముఖ్ వంటి మజ్జు కేరక్టర్లకు బిగ్‌బాస్, నాగార్జున సపోర్ట్… ఆడ లేడీస్ తగ్గిపోయారు, మగ జెంట్లలో హుషారు లేదు… వెరసి అదెప్పుడో ట్రాక్ తప్పిపోయింది… ఎప్పుడు అయిపోతుందిరా బాబూ అని ఎదురుచూడటమే… మరీ నాగార్జున ఇంతగా ఇజ్జత్ పోగొట్టుకున్నది ఎప్పుడూ లేదేమో… అప్పట్లో వర్మ అనబడే మరో తలతిక్క కేరక్టర్ తీసిపెట్టిన ఆఫీసర్ అనే సినిమా, ఆ తరువాత బిగ్‌బాస్-5… తాజా బార్క్ రేటింగుల్లో బిగ్‌బాస్‌కు 24 సండే వీకెండ్ షోకు వచ్చిన రేటింగ్స్ 4.23 మాత్రమే… శనివారం కాస్త నయం… 5.19… వీక్ డేస్ గురించి చెప్పుకునే పనే లేదు… ఇంకా…
- రోజా ఓవరాక్షన్ దెబ్బతిని, జబర్దస్త్ రేటింగ్స్ పడిపోతున్నయ్… కొంత వైవిధ్యం, క్రియేటివిటీ, హ్యూమన్ యాంగిల్ చూపిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ బాగా పికప్ అయ్యింది…
- పరమ బేకార్ స్క్రిప్టు, మార్పులతో తెగ విసిగించేస్తున్న జీవాడి త్రినయని, ప్రేమ ఎంత మధురం రేటింగ్స్ బాగా దెబ్బతిన్నయ్…
- ఈరోజుకూ ఈటీవీ రేటింగ్స్‌కు బలం వినోద కార్యక్రమాలు కావు… ఈటీవీ న్యూస్…
Share this Article