Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ ప్రదీప్ ఐటమ్ డాన్స్..! బాగానే కష్టపడ్డాడు డాన్సడానికి..!!

December 27, 2024 by M S R

.

ప్రదీప్ మాచిరాజు… పరిచయం అక్కర్లేని పేరు… తెలుగు టీవీల్లో నంబర్ వన్ మేల్ యాంకర్… స్పాంటేనిటీ, చెణుకులు, ఎనర్జీ… పెద్దగా అసభ్య సీన్ల జోలికి కూడా పోడు… కానీ ఈమధ్య టీవీల్లో కనిపించడం లేదు…

ఏ షో చేయడం లేదు… కాకపోతే అనంతపురం జిల్లా రాజకీయవేత్త ఎవరితోనో లవ్వులో ఉన్నాడనీ, త్వరలో పెళ్లి అనీ చాన్నాళ్లుగా వినిపిస్తున్నదే, మళ్లీ ఈమధ్య కనిపిస్తున్నాయి ఆ వార్తలు… మరి ఏమైంది తనకు..?

Ads

ఏమీ లేదు… అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా చేస్తున్నాడు, అందుకే టీవీ షోలకు విరామం ప్రకటించి కష్టపడుతున్నాడు… ఏదో ఐటమ్ సాంగ్ రిలీజు చేశారు మొన్న… చంద్రిక రవి కావచ్చు, ఆమె బాగానే డాన్సింది… సాంగ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చే ప్రదీప్ రెగ్యులర్ హీరోల్లాగే డాన్సుతూ కనిపించాడు… ఈజ్, స్పీడ్ బాగానే ఉన్నాయి…

కాకపోతే ప్రదీప్ డాన్స్ చూడగానే… అప్పుడెప్పుడో తను కెరీర్ మొదట్లో ఓ డాన్స్ షోలో కంపిటీటర్‌… డాన్సడానికి బాగా ప్రయాసపడేవాడు… (అదే షోలో లేదా అలాంటి షోలో సాయిపల్లవి కూడా పార్టిసిపేట్ చేసినట్టు గుర్తు..) ప్రదీప్ డాన్స్‌ను జడ్జిలుగా ఉన్న బాబా భాస్కర్, సంగీత, మరో కొరియోగ్రాఫర్ బాగా నిరుత్సాహపరచడం కూడా గుర్తొచ్చింది…

ఆ డాన్స్ షో తరువాత ఈటీవీ ఢీ వంటి డాన్స్ షోలను హోస్ట్ చేశాడు తప్ప ఇంకెక్కడా డాన్సినట్టు కనిపించలేదు… వైరాగ్యం వచ్చి ఉంటుంది…  ఇదిగో నాటి పాత వీడియో లింక్…

గతంలో తను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని ఓ సినిమా చేశాడు… ఒక్క నీలి నీలి ఆకాశం అనే పాట బాగా పాపులర్ అయ్యింది, బాగుంది, అది తప్ప సినిమా పెద్ద ఆడలేదు… ఇదేదో అచ్చిరాదని మళ్లీ టీవీ షోలకు వాపస్… ఇదుగో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా…

ఈటీవీలో రియాలిటీ షోలతో ప్రసిద్ధులైన నితిన్, భరత్ దీనికి దర్శకులు… పుష్పలో ఓ పాట పాడి పాపులరైంది కదా లక్ష్మి దాస… ఆమే ఈ సాంగ్ పాడింది… శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, గీత రచయిత చంద్రబోస్… ఏ షోకు వెళ్లినా తనతోపాటు ఆస్కార్ అవార్డు తీసుకువెళ్తుంటాడు కదా… ఈ పాటలో అకాడమీ అవార్డు విజేత చంద్రబోస్ అని వేసుకున్నాడు టైటిల్…

pradeep

ఉత్త సాదాసీదా రచన… ఏమాత్రం లిటరరీ వాల్యూ లేదు… ఐనా ఐటమ్ సాంగ్‌కూ వాల్యూ ఏమిటంటారా..? అంతేలెండి… టచ్‌లో ఉండు అని సాగుతుంది సాంగు… సినిమాలో హీరోయిన్ దీపిక పిల్లి… ఆమె ఈటీవీ ఢీ, ఆహా కామెడీ ఎక్స్‌చేంజ్‌కు యాంకర్‌గా చేసింది… నితిన్, భరత్ అనగానే ఇక ఈటీవీ బ్యాచ్ ఉండాల్సిందే కదా… గెటప్ శ్రీను, రోహిణి కూడా ఉన్నారు…

సినిమా లాటరీ వంటిది… అస్థిరం, ఫలితం చెప్పలేం… కానీ టీవీ షోలు పాడి బర్రెల్లాంటివి… రెగ్యులర్ ఆదాయం, ఎప్పుడూ స్థిరంగా తెర మీద కనిపించవచ్చు… అందుకే రష్మి, సుధీర్, శ్రీముఖి వంటి పాపులర్ టీవీ ఆర్టిస్టులు కూడా టీవీ షోలను వదిలేయరు… వాటిని కంటిన్యూ చేస్తూనే సినిమాలు వస్తే చేస్తుంటారు… ప్రదీప్ కూడా ఏదో ఒక టీవీ షో అయినా కంటిన్యూ చేయాల్సింది…

అఫ్ కోర్స్, తనకున్న యాంకర్ ఇమేజ్‌కు ఎప్పుడు రీఎంట్రీ ఇచ్చినా తన స్థానం తనకు పదిలమే అనుకొండి..! తనకు బాగా పేరు తెచ్చిన సొంత టీవీ షో పేరు… కాస్త టచ్‌లో ఉంటే చెబుతా… ఈ సాంగ్ పేరు టచ్‌లో ఉండు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions