సుమ..! తెలుగు జగమెరిగిన గజ వ్యాఖ్యాత… ప్రస్తుత వెబ్ భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే… టాప్ యాంకరిణి..! ఆమె పరిచయం చెప్పడం అంటే అదొక ఫూలిష్ ప్రయత్నమే… కానీ మరీ టాప్, టాపర్, టాపెస్ట్ ఏమీ కాదు… బోలెడు ఫెయిల్యూర్స్… తాజాగా జీటీవీ కోసం చేస్తున్న బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే టీవీ షో..! సుమ ఏం చేసినా సక్సెసే అనేది పెద్ద అబద్ధం… ఆమె కొన్నింటికే పరిమితం… తన స్పాంటేనిటీ, తన ఎనర్జీ, తన ఫ్లూయెన్సీ, తన కామెడీ పంచులు… అన్నీ సోలోగా చేస్తేనే క్లిక్క… ఆమె ఎవరితోనైనా కలిసి యాంకరింగ్ చేస్తే, అది ఢమాల్… అంతేకాదు… ఇంకా ఉంది… తను ఈటీవీకి చేసే షోలు మాత్రమే ఆమెకూ, ఆ టీవీకి డబ్బులు తెచ్చిపెడుతున్నయ్… మిగతా టీవీలకు సుమకూ లక్కీ లంకె కుదరదు… కుదరలేదు… చివరకు ఆహా అనబడే ఓటీటీతోసహా అంతే… కాస్త వివరాల్లోకి వెళ్దాం…
జీటీవీ వాడికీ, మాటీవీ వాడికీ ఓ పోరాటం నడుస్తోంది… అది సీరియల్స్ రేటింగుల గురించి… అంతేకాదు, రియాలిటీ షోలు, అనగా నాన్-ఫిక్షన్ షోల కోసం కూడా పోటీ నడుస్తోంది… ఆ షోలలో ఈటీవీ టాప్… ప్రేక్షకుల్ని ఈటీవీ నుంచి డైవర్ట్ చేసుకోవాలనేది జీటీవీ వాడి మహా ప్రయత్నం… ఎలాగూ బార్క్ వాడి చుట్టూ ముంబై పోలీసులు నట్లు, బోల్టులు బిగిస్తున్నారు కాబట్టి, ఈ రేటింగుల దందా ఆగిపోతుందనీ, మాటీవీని కొట్టేసి తెలుగు టీవీల్లో నంబర్ వన్ అయిపోతామనీ జీవాడి ఆశ, ధ్యాస, ప్రయత్నం… అందుకని రియాలిటీ షోల మీద పడ్డాడు… అందులో భాగంగానే సుమకు యాంకర్ రవిని కూడా కలిపి, బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అని స్టార్ట్ చేశాడు… కానీ ఓ విషయం విస్మరించాడు జీవాడు… ఏమిటంటే..?
Ads
చూశారుగా, తాజా రేటింగుల చార్ట్… జీవాడు అడ్డగోలు ఆశలు పెట్టుకున్న బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ కాస్తా కనీసం మూడు రేటింగ్స్ కూడా సంపాదించలేక చతికిలపడింది… మరోవైపు ఓహోంకార్ యాంకరింగు చేసే డాన్స్ ప్లస్ 6.65 దాకా రేటింగ్స్ సాధించి పర్లేదు అనిపించుకుంది… మరి భారీ తారాగణాన్ని దింపారు కదా రంగంలోకి… ఆమాత్రం రేటింగులు రాకపోతే ఎలా అంటారా..? అది సరే గానీ సుమ దగ్గరకొద్దాం… జీవాడు మరిచిపోయిన లేదా తెలుసుకోలేని విషయం ఏమిటంటే..? సుమ ఆడియో లాంచులు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు గట్రా… కేవలం తనొక్కతే వేదిక మీద నిలబడి, ఒంటి చేత్తో ఆర్గనైజ్ చేయగలదు… ఇంకెవరు తనతో కలిసి కో-యాంకరింగు చేసినా సరే అది క్లిక్ కాదు… అవి టీవీ షోలయినా అంతే… పేరెన్నికగన్న ప్రదీప్‌తో పెళ్లిచూపులు చేస్తే ఫట్… మనోతో కలిసి కెవ్వుకేక చేస్తే ఫట్… కానీ తను సోలోగా చేసిన షోలు మాత్రం క్లిక్కు… అదీ ఈటీవీ షోలయితేనే ఆమెకు బెటర్… క్యాష్, స్టార్ మహిళ, జీన్స్… ఇలాంటివి…
మొదట్లో మాటీవీలో అవాక్కయ్యారా, తేజ TVలో పట్టుకుంటే పట్టుచీర వంటివి క్లిక్కయినా… తరువాత ఇక ఈటీవీలో చేసిన షోలు తప్ప ఇంకెవరికి చేసినా పెద్దగా క్లిక్ కాలేదు… టీవీ9లో పంచావతారం, మాటీవీలో భలే చాన్సులే, జీటీవీలో లక్కు కిక్కు (తనే నిర్మాత), యూట్యూబ్‌లో జుజుబీ టీవీ, మాటీవీలో ఎఫ్3, వైఫ్ చేతిలో లైఫ్, సాక్షిలో సుమదీపం… సో, సుమ అంటే టీవీలకు సంబంధించి ఈటీవీ, సోలో షో… అంతే… నిజానికి ఇప్పుడు జీటీవీలో వచ్చే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ కొత్త ప్రోగ్రామేమీ కాదు… గతంలో ప్రదీప్ ఒక్కడే నడిపించాడు దీన్ని అదే టీవీలో… మరో రెండు వారాలూ ఈ షో ఇలాగే పూర్ రేటింగ్స్‌తో గనుక సాగితే… అదిరింది షోను రద్దు చేసినట్టు జీవాడు దీన్ని కూడా అర్థంతరంగా రద్దు చేయాల్సిందే… సుమ సంగతేమిటోలే గానీ… ఫాఫం రవి…!!
Share this Article