కొన్ని నవ్వొస్తయ్… రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు అర్థమవుతుంది… మనకిప్పుడు టీవీ షోలు మినహా వేరే వినోదం ఏముంది..? లేదంటే ఆ ఆదర్శప్రాయుడైన హీరో పుష్పలు, ఆ సూపర్ ధర్మపరిరక్షకుడు అఖండలు, ఆ పునర్జన్మవాది సింగరాయ్‌లు… అంతే కదా… సరదాగా యాంకర్ సుమ హోస్ట్ చేసే క్యాష్ చూశారా ఎప్పుడైనా..? తోచిన సెలబ్రిటీలను పిలిచి, తోచిన ఆటల్లా ఆడించి, తోచిన హౌలా వేషాలు వేయించి, ఇది ఏదీ తోచక నవ్వడం కోసమే, తోచినట్టు నవ్వండిర భయ్ అని చెబుతుంది ఆమె…
నిజానికి ఆమె నోరు పెద్దదే కానీ అదుపులో ఉంటుంది… ఒక్క మాట కూడా తూలదు… అసభ్యంగానో, అశ్లీలంగానో పలకదు… చాలా సంయమనం పాటిస్తుంది… కానీ కొన్నిసార్లు ఈమధ్య శృతి తప్పుతూ ఉంది… దానికి ఉదాహరణ రీసెంటుగా ఈటీవీ వాళ్లు రిలీజ్ చేసిన ఓ ప్రోమో… ఆమె తోటి ఆర్టిస్టుల పట్ల హీనంగా వ్యవహరించదు, హర్ట్ చేయదు, కానీ అనుకోకుండా యాంకర్ అనసూయను కించపరిచింది… అది చూసుకోలేదో, లేక ఈటీవీ డిజిటల్ ప్రమోషన్ టీంకు అనసూయ పట్ల ఏమైనా అసూయ ఉందేమో తెలియదు… ఆ టీజర్ యథాతథంగా యూట్యూబ్‌లో ఎడిట్ లేకుండా పెట్టిపారేసింది…
Ads
విషయం ఏమిటంటే..? ఫిబ్రవరి 5న రాబోయే క్యాష్ ఎపిసోడ్ ప్రోమో అది… ఈమధ్య సినిమా వాళ్లకు బహిరంగ ప్రమోషన్ యాక్టివిటీకన్నా టీవీ ప్రోగ్రాముల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవడం అలవాటైంది కదా… ఈ టీవీ షోల నిర్మాతలకూ నాలుగు డబ్బులు వస్తున్నయ్ కదా… దాంతో సుమ కూడా లూజర్ వెబ్ సీరిస్ వాళ్లను పిలిచింది… వాళ్లతో ఆటాపాటా… ప్రియదర్శితోపాటు కల్పిక, అన్నీ, శశాంక్ తదితరులు వచ్చారు… సుమ చెప్పిన వేషాలన్నీ వేస్తున్నారు…
ప్రియదర్శినికి తన బొమ్మ గీయమని చెప్పింది సుమ… అసలే ప్రియదర్శి కదా, నాలుగు పిచ్చి గీతలు గీశాడు… అది చూసి జడుసుకున్న సుమ… హమ్మో, ఏమిటిది పుష్పలో దాక్షాయణిలాగా అనేసింది… అంటే ఆ పిచ్చిగీతల్లాగే ఆ సినిమాలో దాక్షాయణి గెటప్ ఉందనే అర్థం వచ్చింది… ఆ పాత్ర వేసింది తోటి యాంకర్ అనసూయ, ఆమె కూడా సీనియరే… అదే ఈటీవీ మీద బతికే యాంకరే… తన వ్యాఖ్య ఎటో తప్పుగా వెళ్లిపోయిందనే సోయి సుమలో లోపించింది… అందరూ పడీపడీ నవ్వారు…
నిజమే, పుష్పలో దాక్షాయణి పాత్ర గెటప్ బాగాలేదు… అసలు ఆమె పాత్రకు సినిమాలో పెద్ద ప్రాధాన్యమే లేదు… దాక్షాయణి గెటప్ మీద నెట్‌లో బోలెడు జోకులు, మీమ్స్ గట్రా నడస్తూనే ఉన్నయ్… అంతెందుకు, అదే ఈటీవీలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా పుష్ప స్పూఫు చేసినప్పుడు దాక్షాయణి పాత్రతో ఆడుకున్నాడు… హైపర్ ఆది మరీ శాంతి అనే లేడీ గెటప్‌తో పోల్చాడు… అనసూయ ఉడుక్కుంది తప్ప ఏమీ అనలేకపోయింది… ఇప్పుడు సుమ… రీసెంటుగా ఓ మరాఠీ టీవీ స్పూఫ్ ఓ టీవీలో కనిపించింది, అందులో దాక్షాయణి గెటప్ మరీ ఘోరం… ఫాఫం, అనసూయ…!! నెటిజన్లయితే ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చేసి చెడామడా తిట్టేస్తుంది… కానీ వీటిని ఏమనగలదు..? ప్రత్యేకించి సుమను ఏమనగలదు..?!
Share this Article