Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Prabhas… ప్రస్తుత భారతీయ సినిమాకు ప్రభాసే ‘రాజు’… ఇదుగో ఇలా…

June 29, 2024 by M S R

ఉప్పలపాటి ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్… నిజంగా ఇప్పుడు ఇండియన్ సినిమాకు రాజు… అతిశయోక్తి అనిపించినా ఇది వర్తమానానికి నిజం… ఒక మిత్రుడి మాటలో చెప్పాలంటే… తను ఒంటి కాలి మీద ఇండియన్ సినిమాను మోస్తున్నాడు… ఇదీ అతిశయోక్తి కాదు, నిజం… ఎందుకంటే..?

చాన్నాళ్లుగా తన ఆరోగ్యం స్టడీగా లేదు… ఆయుర్వేద చికిత్సలు, కాలికి సర్జరీలు… బాహుబలి తరువాత తన హెల్త్ ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్నిసార్లు నెలల కొద్దీ విదేశాల్లో చికిత్స తీసుకుంటూ ఉండిపోయాడు… ఆదిపురుష్ ప్రిరిలీజ్ సమయంలో వేదిక ఎక్కడానికి నిర్వాహకులు లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది…

ఆ స్థితిలోనూ తను అంగీకరించిన ఏ ప్రాజెక్టునూ వదిలేయలేదు… కష్టమైనా సరే ఒంటి కాలి మీద కష్టపడుతున్నాడు… పైగా అన్నీ భారీ సినిమాలు… సాలార్, కల్కి కలిసి దాదాపు 2 వేల కోట్ల మార్కెట్… బహుశా ఒక్క షారూక్ ఖాన్‌కు తప్ప మరే ఇతర ఇండియన్ స్టార్‌కు చేతకాలేదు ఈ ఫీట్…

Ads

అంతెందుకు..? ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపయినా సరే… వాటినీ కలిపి లెక్కేస్తే 3 వేల కోట్లను ఒక్కడు పుల్ చేయడం నమ్మశక్యం కాని ఫీట్… అప్పుడే అయిపోలేదు… తను అంగీకరించిన ఇతర ప్రాజెక్టులన్నీ వేయి కోట్ల సినిమాలే… మారుతి తీసే రాజాసాబ్ తప్ప…

ప్రభాస్ వ్యక్తిగా మంచివాడు… ఈ విషయంలో తనను వంకపెట్టేవాడు లేడు… తనను నమ్మి సాహో, రాధేశ్యామ్, అదిపురుష్ సినిమాలలో డబ్బులు పోగొట్టుకున్న తన ఫ్రెండ్స్ కోసం రాజా సాబ్ ఫ్రీగా చేస్తున్నాడు… ఈ రేంజ్ పర్‌ఫామెన్స్ కనబరుస్తున్నా సరే, ఎప్పుడూ ఫేక్ ప్రచారాలు, డాంబికాలు, అట్టహాసాలు, హైఫై క్యాంపెయిన్స్, పిచ్చి ప్రాపగాండాల, ఫేక్ ఇమేజీ బిల్డప్పుల జోలికి పోడు… తన సినిమాలే తన గురించి చెప్పాలి, అంతే…

వస్తాడు, సినిమా చేస్తాడు, రిలీజుకు ముందు ఏవో రెండుమూడు ఇంటర్వ్యూలు, ఫంక్షన్లు… అంతే, మళ్లీ సైలెంట్… ఇప్పుడు వంగా సందీప్ రెడ్డి తీసే స్పిరిట్ సినిమా సిన్సియర్ పోలీస్ కాప్ రోల్… మారుతి తీసే రాజా సాబ్‌ హారర్ కామెడీ… సాలార్-2 చేయాల్సి ఉంది… (శౌర్యంగపర్వం)… కల్కి-2 రావాలి… సరే, మంచు కన్నప్పలో గెస్ట్ రోల్… తరువాత..? ప్రస్తుతానికి ఇవే…

ప్రభాస్‌లో నచ్చేదేమిటీ అంటే… యాటిట్యూడ్ చూపించకపోవడం..! ఏదైనా ఒక్క చిన్న సినిమా హిట్టయితేనే ఫుల్లు యాటిట్యూడ్ చూపించే రోజులు ఇవి… మన కళ్ల ముందే దానికి బోలెడు మంది ఉదాహరణలు… అలాంటిది ప్రభాస్‌లో ఆ విపరీత మనస్తత్వం కనిపించదు… నిజానికి బాహుబలికి ముందు బహుశా ఏడాదికి ఒకటీఒకటిన్నర సినిమాలు సగటున చేసి ఉంటాడు…

వాటిల్లో ఫ్లాపులున్నయ్, హిట్లు ఉన్నయ్… తన కెరీర్‌లో ఒక నంది అవార్డు తప్ప పెద్దగా వేరే అవార్డులూ కనిపించవు… ఐతేనేం, అవార్డులు వేరు, సూపర్ కమర్షియల్ హిట్ హీరో వేరు… బాహుబలితో తన రేంజ్ ఎగిసిపోయింది… కానీ ఆ సినిమా చేశాకే తన ఆరోగ్యం దెబ్బతిన్నది… అది లక్కీ, అదే అన్‌లక్కీ…

ఇదే కల్కి సినిమా ప్రిరిలీజ్ అమరావతిలో ప్లాన్ చేస్తే ఖండితంగా నో చెప్పాడు ప్రభాస్… ఎక్కడ ఎస్ చెప్పేవాడో కాదు, ఎక్కడ నో చెప్పాలో తెలిసినవాడు ప్రభాస్… అక్కడ ప్రిరిలీజ్ గనుక నిర్వహించి ఉంటే కల్కి మీద మరింత నెగెటివ్ క్యాంపెయిన్ జరిగి ఉండేది… పొలిటికల్ వాసనలు చుట్టుముట్టి ఉండేవి…

స్టార్‌డమ్ రావడం వేరు, దాన్ని నిలుపుకోవడం వేరు… ప్రభాస్ ఆ విషయంలో మిస్టర్ పర్‌ఫెక్ట్, అందరికీ అందుకే డార్లింగ్… అయితే ఇది కొనసాగుతుందా..? ఇది మరో చిక్కు ప్రశ్న… ఏమో, అదీ కాలమే చెబుతుంది… ఈలోపు మరో 2, 3 వేల కోట్ల మార్కెట్ తన పేరిట క్రియేటవుతుంది… బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్… ఏదో వుడ్, ప్రభాసే ఒక స్టార్‌వుడ్..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions