ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది… ఇద్దరూ చంద్రబాబు అభిమానులు కావడం వల్ల కావచ్చు, ఇద్దరికీ శృతి కలవడం వల్ల కావచ్చు, రేవంత్‌కు తన మీడియాలో బాగా ప్రయారిటీ లభించింది… ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రేవంత్‌ను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ సీఎం అయ్యాక నెల రోజుల తరువాత మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశాడు… ఇతర మీడియా ఇంటర్వ్యూయర్లకు రాధాకృష్ణకు పోలికే లేదు… చాలా అంశాల్ని తెలివిగా, చొరవగా చెప్పిస్తాడు… అలా రేవంత్ చెప్పిన అంశాల్లో ఒకటి బాగా కనెక్టయింది…
‘‘జగన్‌తో సఖ్యత లేదు, కానీ ప్రత్యర్థి కాదు… కనీసం నాకు అభినందన కాల్ కూడా చేయలేదు… నన్ను ఢిల్లీలో కలిసిన ఎంపీలను కూడా తిట్టాడు… ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనతో డీల్ చేయాల్సిన అంశాలుంటయ్, కర్నాటక ముఖ్యమంత్రి ఎలాగో జగన్ అలాగే, అంతే… కేసీయార్ నన్ను జైల్లో వేయించాడు, వేధించాడు, ఐతేనేం, నేనే వెళ్లి పరామర్శించాను, అంబులెన్స్‌కు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయమన్నాను… సభలో నన్ను చూడటం ఇష్టం లేక లోకసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడంటున్నారు… ఒకవేళ ఎమ్మెల్యేలను లాగాలని తను మొదలుపెడితే అదెక్కడి దాకా వెళ్తుందో చెప్పలేను, నేను జానారెడ్డిని మాత్రం కాను…’’
ఈ వాక్యాలు రేవంత్‌రెడ్డి తత్వాన్ని స్పష్టంగా బహిర్గతం చేశాయి… వోటుకునోటు కేసు తరువాత తనను ఓ రౌడీ ఎలిమెంట్‌గా చిత్రించడానికి బీఆర్ఎస్ క్యాంప్ విశ్వప్రయత్నం చేసింది… ఇదే కాంగ్రెస్‌లోని సీనియర్లు కూడా అదే బాట… కానీ రేవంత్‌రెడ్డి పైకి కనిపించే, ఇట్టే అంచనా వేసే కేరక్టర్ కాదు… స్ట్రెయిట్‌గా చెప్పాడు, జగన్ తనకు కనీసం గ్రీటింగ్ కాల్ చేయకపోవడాన్ని ఎత్తిచూపాడు… జగన్‌లోని రాజకీయ మర్యాదలేమి, పాలన పద్ధతుల రాహిత్యాన్ని ఎక్స్‌పోజ్ చేశాడు, అదేసమయంలో విభజిత రాష్ట్రంగా ఆ సీఎంతో సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూస్ ఉంటాయి, ఇతర సీఎంల్లాగే తననూ చూస్తాను అంటూ సింపుల్‌గా తేల్చేశాడు…
Ads
నిజమే, కేసీయార్‌ను పరామర్శించడానికి స్వయంగా వచ్చిన జగన్ కొత్త సీఎం రేవంత్‌ను ఎందుకు అభినందించలేదు అనే ప్రశ్నను తెలంగాణ, ఏపీ సమాజాల్లో రేవంత్ లేవనెత్తగలిగాడు… జగన్ దగ్గర సమాధానం లేదు… ఈరోజుకూ మొన్నటి ఎన్నికల తీర్పు మీద కేసీయార్ స్పందించలేదు, ప్రజల పట్ల అణకువ లేదు, వ్యక్తిగత-రాజకీయ ధోరణుల్లో అదే అహం… రేవంత్‌ను అభినందించలేదు సరే, కనీసం తనను ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు, ఆ తీర్పును శిరసావహిస్తాననే మాట కూడా కేసీయార్ నోటి నుంచి రాలేదు…
ఐనాసరే, రేవంత్ తన పరిణతిని చూపాడు, హాస్పిటల్ వెళ్లి పరామర్శించాడు… ఇప్పుడు స్థూలంగా చూస్తే… అంటే వ్యక్తిగా… ఆ ఇద్దరి మీద తన సంస్కారాన్ని ప్రదర్శించాడు… అందుకే, రేవంత్‌ను రౌడీ ఎలిమెంట్‌గా వైసీపీ, బీఆర్ఎస్ పదే పదే బలంగా చిత్రీకరించిన తీరు తెలుసు కదా, పగ ప్రదర్శించడం లేదు, పద్ధతిగా వెళ్తున్నాడు…
ఐతే రేవంత్‌ను తేలికగా తీసేయవచ్చా..? నో… అక్కడ మళ్లీ కాఠిన్యమే… నువ్వు ఒక ఎమ్మెల్యేతో మొదలుపెడితే అప్పుడు చూసుకుందాం, ఆ పోటీకి కూడా రెడీ అనేశాడు… అంతేకాదు, నేను జానారెడ్డిని కాను అని చెప్పడం చాలా విలువైన వ్యాఖ్య… అప్పట్లో కేసీయార్ ఎలాపడితే అలా కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తుంటే, ఎమ్మెల్యేలను లాగేస్తుంటే జానారెడ్డి ఏమీ చేయలేకపోయాడనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే… పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ కుమారుడూ ఏమీ చేయలేకపోయాడు… ఆ పాత రోజులు కావు అని చెబుతున్నాడు రేవంత్… సో, మొదటిసారి అటు జగన్‌కు, ఇటు కేసీయార్‌కు సూటిగా, దీటుగా తలెత్తుకుని.. ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా…? ఫైర్’’ అనే రీతిలో సమాధానాలు చెబుతున్న కాంగ్రెస్ నాయకుడిని చూస్తున్నాం… అదే తేడా… అదే మార్పు…!!
Share this Article