Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన బలమే నాలుక… దాన్ని కోసుకుంటానని ఓ ఛాలెంజ్ విసిరాడు… తర్వాత..?

May 18, 2023 by M S R

Murali Buddha………    నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్, జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు… ఓ జ్ఞాపకం

ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక … ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్ను నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ అంటావా ? అని కోపం రావచ్చు . ఒకసారి ఊహించండి నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్ ఎలా ఉంటారో ? ఊహించలేం కదా ? బహుశా కొమ్మినేని శ్రీనివాస రావు పరిస్థితి కూడా ఇలానే అయిందేమో గోనెకు నాలుక ప్రసాదించారు .

అదేదో సినిమాలో బ్రహ్మానందం డ్రాయర్ గురించి డైలాగులు చెబుతూ స్త్రీ ప్రసాదించిన జీవితం మగాడిది అని అంటాడు .. అలానే గొనె అభిమానులకు కోపం వచ్చినా సరే కొమ్మినేని ప్రసాదించిన వరం గొనె ప్రకాష్ నాలుక …

Ads

*****

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీట్ రిపోర్టర్లు అందరూ శాసనసభలో టిడియల్ పి – సియల్ పి ( టీడీపీ, కాంగ్రెస్ ) ల మధ్య పిచ్చాపాటి చర్చల్లో గొనె ప్రకాష్ వచ్చారు . రాజకీయ సంఘటనలు, నాయకుల పేర్లు , తేదీలు ఆయన నాలుక మీద నాట్యం చేస్తుంటాయి అని చాలా మంది నమ్మకం . ఆ చర్చలో nda ప్రభుత్వం. మంత్రివర్గంలో టీడీపీ చేరింది అని గొనె వాదన … ఎర్రం నాయుడు Nda లో మంత్రి అని గొనె వాదన . చేరలేదు బయటి నుంచి మద్దతు అని రాజకీయాల్లో ఓ కొత్త పదం కనిపెట్టి టీడీపీ మద్దతు ఇచ్చింది .

స్పీకర్ పదవి ( బాలయోగి ) తీసుకోవడం తప్ప మంత్రి వర్గంలో చేరలేదు అని కొమ్మినేనితో సహా టీడీపీ రిపోర్టర్ల వాదన … గొనెలో ఆవేశం రగులుకుంది . నేను చెప్పింది తప్పు అయితే నాలుక కోసుకుంటాను అని కొమ్మినేనితో పందెం . నాలుక కోసుకోవడంతో పాటు కొంత నగదు – పందెం . ఎర్రంనాయుడుకు ఫోన్ చేసి మంత్రివర్గంలో చేరారా లేదా అడగమని గొనె నాకు చెబితే … నేను ఫోన్ చేయను, నీకు ఆ మాత్రం తెలియదా అని ఎర్రం నాయుడు అంటారు అని నేను .. గోనెలో ఆవేశం మరింత పెరిగింది . రికార్డులు చూపించి మీరంతా తప్పు అని నిరూపిస్తాను అని అసెంబ్లీలో ఉన్న లైబ్రరీకి గొనె వెళ్లారు . విషయం తెలుసు కాబట్టి నేను రికార్డ్స్ చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు .

****

రికార్డ్స్ చూసి బయటకు వచ్చిన గొనె కొంత ఆశ్చర్యంగా ఈ రికార్డ్స్ చూసేంతవరకు నేను టీడీపీ మంత్రివర్గంలో చేరింది అనే అనుకుంటున్నాను . అనుకోవడమే కాదు ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనిపై తీవ్రంగా విమర్శించాను … ఒక్క రిపోర్టర్ కూడా మీరు చెబుతున్నది తప్పు మంత్రివర్గంలో చేరలేదు అని చెప్పలేదు ఎందుకో అని విస్తు పోయారు . నగదు సంగతి తెలియదు కానీ నాలుక వద్దు అని కొమ్మినేని వదిలేశారు ..

***

గొనె మాటల ప్రకారం ఆయన ఒక తప్పును కొన్ని డజన్ల సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెబితే ఒక్కసారి కూడా, ఒక్క రిపోర్టర్ కూడా అది తప్పు అనలేదు అంటే యాంత్రికంగా పనిచేయడం అన్నమాట . క్లర్క్ లా చెప్పింది రాసుకోవడం కాదు ఆలోచించగలగాలి . మనం రాసిన వార్త మనం చదువుకుంటే చాలు అని కాదు . పత్రిక మొత్తం చదివినప్పుడు ఇలా నాయకులు తప్పు చెబితే ప్రశ్నించవచ్చు . ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక విలేఖరికి ఎక్కువ గౌరవం , తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రిక వారికి తక్కువ గౌరవం అనే అభిప్రాయం ఎలా ఉన్నా – విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్ట్ కు విలువ ఉంటుంది . జర్నలిజంలోనాలుగు కాలాలు ఉండాలి అనుకుంటే విషయ పరిజ్ఞానానికి నిరంతరం మెరుగులు దిద్దుకోవడం అవసరం …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions