Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… అందుకే అతను పుతిన్… ఎవడినీ వదలడు… ప్రజెంట్ బడా నియంత…

August 26, 2023 by M S R

పుతిన్ మరోసారి తాను గొప్ప నియంత అని రుజువు చేసుకున్నాడు!


“నిన్ను ఎదిరించిన, వ్యతిరేకించిన వాళ్ళని చంపుతూ వెళ్ళు. చివరికి ఒక్కడివే నీ రాజభవనం మీద నుండి ఎర్రటి శ్మశానాన్ని చూస్తూ ఆనందంగా రోజులు గడపవచ్చు”
ఇది ఒకప్పటి రష్యన్ నానుడి!


జోసెఫ్ స్టాలిన్ నిరంకుశ అణిచివేతని నిరసిస్తూ ఒక రష్యన్ పౌరుడు తన చివరి క్షణాలలో తన రక్తంతో గోడ మీద వ్రాసిన వాక్యాలు! సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయి అతనన్న మాట నిజం అయ్యింది!

Ads


************************
వాఁజ్ఞర్ గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ హత్య చేయబడ్డాడు!
వాగ్నర్ గ్రూపు సృష్టి కర్త వ్లాదిమిర్ పుతిన్!
తన సృష్టి కర్త చేతిలోనే ప్రిగోజిన్ హత్యచేయబడ్డాడు!
***********************


ఈ విషయం గురుంచి మూడునెలల క్రితమే మనం చెప్పుకున్నాము.
ఎప్పుడయితే ప్రిగోజిన్ తిరుగుబాటు చేసి మాస్కోకి కేవలం 80 km దూరం వరకు తన సైన్యంతో వచ్చాడో అదే రోజు తన మరణానికి తేదీ నిర్ణయించే అవకాశం పుతిన్ కి ఇచ్చాడు!
పుతిన్ ని చక్రబంధనంలో ఇరికించాడు ప్రిగోజిన్!


అసలు మాస్కో దాకా ప్రిగోజిన్ ని పుతిన్ ఎందుకు రానిచ్చాడు?
ఉక్రేయిన్ రష్యా సరిహద్దుల నుండి ప్రిగోజిన్ తన సైన్యంతో బయలుదేరగానే పుతిన్ తన రక్షణ మంత్రికి ఆదేశాలు ఇచ్చాడు అక్కడే ప్రిగోజిన్ ని అడ్డుకోమని.


కానీ రష్యన్ దళాలు ప్రిగోజిన్ ప్రయివేట్ సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. ఒక టాంకర్ విమానాన్ని, రెండు ఎటాక్ హెలికాఫ్టర్లని కూల్చేసింది ప్రిగోజిన్ సైన్యం!
దాంతో రష్యన్ దళాలని విత్ డ్రా చేసాడు పుతిన్!
ప్రిగోజిన్ సైన్యం మాస్కో దగ్గరికి రాగానే పుతిన్ మాస్కో నుండి సెయింట్ పీటర్స్ బర్గ్ కి వెళ్ళిపోయి అక్కడ సురక్షితమయిన అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కోవాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయాడు
*****************


సెయింట్ పీటర్స్ బర్గ్ నుండి పుతిన్ బేలారస్ అధ్యక్షుడు లుకుచెంకో (Lukuchenko) కి ఫోన్ చేసి ప్రిగొజిన్ తో మాట్లాడి సంధి చేయమని కోరాడు.
లుకుచెంకో బేలారస్ లో ప్రిగోజిన్ కి ఆశ్రయం ఇస్తానని, పుతిన్ ఎలాంటి ప్రతీకార చర్యకి పాల్పడకుండా నేను హామీ ఇస్తానని వాగ్దానం చేసిన తరువాత ప్రిగోజిన్ వెనక్కి వెళ్ళిపోయాడు!
******************


తరువాత కాలంలో వెస్ట్ మీడియా పలు ఊహాగానాలు చేశాయి. ప్రిగోజిన్ తిరుగుబాటు అంతా నాటకం అని, బేలారస్ నుండి ప్రివోజిన్ తన సైన్యంతో ఉక్రేయిన్ మీద దాడి చేస్తాడని తోడుగా బేలారస్ సైన్యం కూడా కదులుతుంది అని.
కానీ ఇవేవీ జరగలేదు. సరికదా ప్రిగోజిన్ రష్యాలోనే ఉండిపోయాడు. కానీ పుతిన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కానీ వాగ్నర్ గ్రూపుని రద్దు చేసి 30 వేల మంది ప్రయివేట్ సైన్యాన్ని రష్యన్ రెగ్యులర్ ఆర్మీలో కలిపేశాడు పుతిన్. ఇది మొదటి చర్య. ఇక ప్రిగోజిన్ తో ఉన్నది అతని నమ్మకమయిన బాడీ గార్డులు, కమాండర్లు కలిపి మొత్తం 9 మంది.
**********************


ప్రిగోజిన్ హత్య ఎలా జరిగింది? Well..! గత నెల రోజులుగా ఉక్రేయిన్ దళాలు డ్రోన్లతో రష్యా మీద దాడులు చేస్తున్నాయి. అయితే గత రెండు వారాలుగా డ్రోన్లు సెయింట్ పీటర్స్ బర్గ్ తో పాటు మాస్కో నగరం మీద కూడా దాడులు చేస్తున్నాయి.
ఉక్రేయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు కామికాజ్ (ఆత్మాహుతి) డ్రోన్లు కావడంతో రష్యన్ దళాలు వాటిని గాలిలో ఉండగానే కూల్చివేసే పనిలో ఉన్నాయి!
ఉక్రేయిన్ డ్రోన్లని రష్యన్ దళాలు కూల్చేసే పనిని రష్యన్ పౌరులు తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు!
*********************


గ్రౌండ్ రిపోర్ట్… ప్రదేశం- మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ మధ్యలో ఉన్న చిన్న గ్రామం.
రిపోర్ట్ చేసింది పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రష్యన్ మహిళ మరియు ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్!
బుధవారం సాయంత్రం 6.15 నిముషాలకి ఉక్రేయిన్ డ్రోన్లు దాడిచేయడానికి వచ్చాయి. రష్యన్ దళాలు వాటిని కూల్చడానికి చేస్తున్న హడావిడి విని పౌరులు తమ మొబైల్ ఫోన్లతో ఇళ్లపైకి వచ్చి వీడియోలు తీయడం మొదలు పెట్టారు.


సదరు జర్నలిస్టు తన డిజిటల్ కెమెరాతో ఇంటి పైకి వచ్చి వీడియో తీయడం మొదలుపెట్టింది.
డ్రోన్లు ఎత్తులో ఎగురుతున్నప్పడు చాలా చిన్నవిగా కనపడతాయి కాబట్టి వాటిని రష్యన్ ఎయిర్ డిఫెన్స్ కూల్చినప్పుడు మాత్రమే అవి ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలుస్తుంది.
ఆకాశంలో డ్రోన్లు ఎక్కడ ఉన్నాయో కెమెరాతో వెతుకుతున్న సమయంలో హఠాత్తుగా ఒక ఎక్జిక్యూటివ్ జెట్ కనిపించింది.
అఫ్కోర్స్ ఒకటి కాదు, రెండు ఎక్జిక్యూటివ్ జెట్స్ ఆ రూటులో వెళ్లడం పరిపాటి రెండు రోజులకొకసారి.
చూస్తుండగానే ఆ ఎక్జిక్యూటివ్ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోయి రెండు భాగాలుగా విడిపోయి కిందపడిపోయింది. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది.


ఆ ఎక్జిక్యూటివ్ జెట్ ఎంబ్రార్ ERJ 135 బిజినెస్ జెట్ (Embraer ERJ 135 business jet with tail number RA-02795 flew from Moscow to St. Petersburg).
ఆ బిజినెస్ జెట్ లో ప్రిగోజిన్ తో పాటు అతని ముఖ్య కమాండర్లు, బాడీ గార్డులు, సిబ్బంది ముగ్గురితో కలిసి మొత్తం 10 మంది చనిపోయారు.


ప్రిగోజిన్ విమానం కూల్చివేతకు గురియైన ప్రదేశంకి 40 km దూరంలో వాలదై (Valdai) అనే ప్రదేశంలో పుతిన్ నివాసం ఉంది.
పుతిన్ నివాసంకి రక్షణగా S-300 PMU1 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ 4 డివిజన్స్ మోహరించి ఉన్నాయి.
S-300 మిస్సైళ్ళు రెండు ఒకదాని తరువాత ఒకటి ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న జెట్ ని కూల్చేశాయి!
ఒక మిసైల్ మిస్ అయినా రెండోది మిస్ అవకూడదని ప్లాన్ అన్నమాట!


Embraer ERJ 135 business jet లు రెండు స్వంతవి ఉన్నాయి ప్రిగోజిన్ కి. మొదటి దానిని కూల్చివేయగానే దానికి వెనుకనే వస్తున్న రెండో జెట్ వెనక్కి వెళ్లిపోయింది.
ప్రిగోజిన్ జెట్ నేల మీద పడిపోగానే వాటిని వీడియో తీస్తున్న వాళ్ళు దగ్గరికి వెళ్లి మరీ ఫోటోలు, వీడియోలు తీశారు.
ఎంబ్రార్ జెట్ టైల్ (తోక) మీద చిన్న చిన్న రంధ్రాలు ఫోటోలలో స్పష్టంగా కనపడ్డాయి.
సర్ఫేస్ to ఎయిర్ (SAM) మిస్సైళ్ళు ప్రయోగించినపుడు అవి టార్గెట్ విమానానికి దగ్గరగా రాగానే ముందు షార్ప్ నెల్స్ ని టార్గెట్ మీదకి వేగంగా వదులుతాయి. దాంతో ముందు వెళుతున్న జెట్ TAIL లేదా స్టెబిలైజర్ ని దెబ్బతీస్తాయి. దాంతో జెట్ నియంత్రణ కోల్పోయి వేగం తగ్గిపోతుంది. అప్పుడు మిస్సైల్ వెనకనుండి వేగంగా ఢీ కొడుతుంది.
ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న జెట్ టెయిల్ లేదా స్టెబిలైజర్ మీద రంధ్రాలు మిసైల్ ఎటాక్ ని సూచిస్తున్నది!
ప్రిగోజిన్ అతని ముఖ్య అనుచరుల శవాలని పోలీసులు తీసుకెళ్లారు! ***************** by… పొట్లూరి పార్థసారథి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాళేశ్వరం కత్తి ఇక మోడీ చేతిలో..! రేవంత్‌రెడ్డి వదిలేశాడు దేనికి..?!
  • పిచ్చి కూతలు, తిక్క చేష్టలు… మ్యూజిక్ అంటూనే ఇవేం పైత్యాలురా సామీ…
  • మూయించిన ఒక వీరుని కంఠం…. చక్రవర్తి టాప్ నంబర్ వన్ సాంగ్…
  • గోదాట్లో పడిపోయిన భానుప్రియ… ఆ నీళ్ల కింద ఊబి… హాహాకారాలు…
  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?
  • మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!
  • మోకాలిలో బుర్ర కాదు గానీ…. మోకాలి కింద మాత్రం గుండె ఉంటుంది..!!
  • అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
  • మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
  • జూదం, మద్యం… వీటికన్నా రీల్స్, షార్ట్స్ డేంజరస్… ఇక మీ ఇష్టం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions