అసలు ఆస్కార్ అవార్డుకున్న పవిత్రత ఏమిటి..? గొప్పదనం ఏమిటి..? అమెరికాలో ఏది కావాలన్నా కొనుక్కోవడమే కదా… స్కోచ్ అవార్డులు ఎలాగో, ఇవీ అలాగే… కాకపోతే దీనికి కోట్ల ఖర్చు, పెద్ద ఎఫర్ట్ కావాలి… మన జాతీయ అవార్డులు, మన పద్మ పురస్కారాలు కూడా లాబీయింగుకు పూచేవే కదా… అసలు రాజమౌళి ఏం సాధించినట్టు..? నాలుగు రోజులు పోతే అందరూ మరిచిపోతారు… కొన్ని వేల మంది ఆ అవార్డులు పొంది ఉంటారు ఇప్పటికి… సో వాట్… ఆ ఆస్కార్‌ను ఏమైనా అంటే దేవుడిని తిట్టునట్టు ఫీలవుతున్నారు కొందరు… ఇదేం మాయో… అని చెబుతూ పోయాడు ఓ మిత్రుడు…
స్థూలంగా పైపైన చూస్తే అలా అనిపించడంలో తప్పులేదు… కానీ డిఫరెంటుగా ఆలోచించాలి… రాజమౌళి పిచ్చోడేమీ కాదు… మనకన్నా పదేళ్లు ముందుకు చూడగలడు… పదిమంది మనుషుల ఆలోచనల పెట్టు తను… సీన్లకు సీన్లు కాపీ కొట్టినా, చరిత్రను వక్రీకరించినా, మన జనంతోనే చప్పట్లు కొట్టించుకుని కోట్లు కొట్టేయగలిగినవాడు… ఆస్కార్ ప్రయత్నం అల్లాటప్పాగా చేసిందేమీ కాదు… రాజమౌళి మదిలో పుట్టిన పెద్ద ఎత్తుగడ అది…
సరే, 80 కోట్లో, 100 కోట్లో పెట్టాడు అనుకుందాం… కానీ ఆ ఖర్చుకు సరిపడా రిజల్ట్ పొందడం గ్రేటే కదా… ఆ ఖర్చు పెట్టలేక కాదు, ఈసారి కాంతార సహ దాదాపు పది ఇండియన్ సినిమాలు, ఇండియా అధికారిక నామినేషన్‌కు అతీతంగా… డబ్బు పెట్టి మరీ ఆస్కార్ నామినేషన్లకు దరఖాస్తు చేసుకున్నాయి కానీ, ఏ ప్రయత్నం చేస్తే ఆ వేదిక మీది దాకా వెళ్తామో రాజమౌళి కనిపెట్టాడు… అది గ్రేటే కదా…
Ads
1) 80 కోట్లు ఖర్చు కావచ్చుగాక… ఎన్ని వందల కోట్ల, వేల కోట్ల పబ్లిసిటీ వచ్చిందో చూడండి… చానెళ్లు, సైట్లు, పత్రికలు, టీవీలు ఎలా డప్పులు వాయిస్తున్నాయో చూడండి… ఇండియాకు రాగానే సన్మానాలు, శాలువాలు గట్రా ముంచెత్తబోతున్నాయి… ఏం చేస్తే ఈ పాపులారిటీ వస్తుంది..? ఇది గ్రేటే కదా…
2) ఏ మహాభారతమో 2 వేలో, 3 వేల కోట్లతో స్టార్ట్ చేయడానికి… ఏ రేంజ్ రెమ్యునరేషనైనా సరే అనే ఓపెన్ ఆఫర్ పరుగుపరుగున వచ్చి రాజమౌళి మెడలో పడబోతోంది… పైగా కుటుంబ ప్యాకేజీ… వందల కోట్లు కాబోతోంది… ఏం చేస్తే వస్తుందీ క్రేజ్… ఇది గ్రేటే కదా…
3) ఇతర ఇండియన్ సినిమా ప్రొడ్యూసర్లకు చేతకాని రీతిలో అంతర్జాతీయ మార్కెటింగ్ మార్గాలు పట్టుకుంటున్నాడు… ఇది గ్రేటే కదా…
4) ఇతర దర్శకులు హీరోల కాళ్ల దగ్గర కీర్తనలు ఆలపిస్తున్న దుష్కాలంలో… ఏళ్ల తరబడీ కాల్‌షీట్స్ తీసుకుని, చెప్పినట్టు నడిచేలా చేసుకుంటూ… ఇప్పుడు ఆ గ్రిప్‌ను వంద రెట్లు పెంచుకున్నాడు… ఇది గ్రేటే కదా…
5) అసలు నిర్మాత పేరు కూడా ఎవరికీ తెలియనంత ప్రచారధూళిని సృష్టించాడు… సర్వం నేనే అనే మాయలో ప్రపంచాన్ని పడేయడం గ్రేటే కదా…
6) నిజానికి తను ఉత్తమ దర్శకుడు లేదా ఉత్తమ నటుడు కేటగిరీలో అవార్డుల కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు… నెలల తరబడీ తిష్ట వేసి, అనేక మార్గాల్లో లాబీయింగ్ చేయించాడు ‘దత్త కొడుకు’కు ద్వారా… పది బాణాల్లో ఇదీ ఒకటి అనుకుని వదిలాడు… ఈ బాణం తగిలింది… ఖర్చు పోతే పోయింది, జనం సొమ్మే కదా… దానికి వందల రెట్ల ప్రతిఫలాన్ని పొందాడు… ఇది గ్రేటే కదా…
ఖచ్చితంగా… ఆ పాట ఉత్త సోది పాట… నాటుదనం తప్ప దానికి ఏ విలువా లేదు… బాలయ్య మాస్ మూవీస్‌లో కూడా ఇంతకన్నా మంచి పాటలుంటాయి… మదనా సుందరీ పాటకు ట్యూన్ కాపీ అయినా ‘కొమురం భీముడో’ పాట కాస్త బెటర్… ఏదైతేనేం, రాజమౌళి అనుకున్న లక్ష్యం చాలా పెద్దది, బహుముఖీనం… ఇదంతా గ్రేటే కదా…!!
Share this Article