Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోహ్లి బ్యాట్‌కు పదును తగ్గలేదు… ప్రపంచ రికార్డు గెలుపు తెచ్చిపెట్టింది…

January 15, 2023 by M S R

అదేదో తెలుగు సినిమాలో హీరో ప్రభాస్ డైలాగ్ ఒకటి ఉంది… ‘‘కత్తి వాడటం మొదలుపెడితే నాకన్నా బాగా ఎవడూ వాడలేడు’’… నిజమే, ఇది విరాట్ కోహ్లికి సరిగ్గా వర్తిస్తుంది… కోహ్లి క్రీజులో కుదురుకుంటే ఇక ఆ బ్యాట్‌కు తిరుగులేదు… కొన్నాళ్లుగా తను సరిగ్గా ఆడటం లేదు… ఇక కోహ్లి పని అయిపోయింది, రిటైర్‌మెంట్ లేదా తొలగింపే మంచిది, అనవసరంగా జట్టుకు వేలాడుతున్నాడు అనే విమర్శలు, విశ్లేషణలు బోలెడు… ప్రతి క్రికెటర్ జీవితంలోనూ ఫామ్ కోల్పోయే ఒక దశ వస్తుంది…

అది తాత్కాలికం… దాన్ని అధిగమించేశాడు కోహ్లి… మళ్లీ తన బ్యాట్ ఊచకోత ఆరంభించింది… శ్రీలంకపై ఆదివారం నాటి ప్రపంచ రికార్డు గెలుపులో… 317 పరుగుల భారీ తేడా విజయంలో… 166 పరుగులు కోహ్లివే… ఈ ప్రపంచ రికార్డుకన్నా మునుపటి కోహ్లి కనిపించడమే ఆనందంగా ఉంది… నిజానికి ఈ గెలుపు వెనుక శుభమన్ గిల్ సెంచురీ ఉంది… నాలుగు వికెట్ల సిరాజ్ ఉన్నాడు… టీం గేమ్ ఉంది… కానీ కోహ్లికి ఆ క్రెడిట్‌లో సింహభాగం వెళ్తుంది…

kohli

విమర్శలకు జడవకుండా టీం మేనేజ్‌మెంట్ కోహ్లిని అలాగే కొనసాగించడం ఎంత బెటరో… కోహ్లి ఇంకా ఇండియన్ క్రికెట్‌కు చేయాల్సింది ఏముందో ఈ మ్యాచులో గెలుపు, పరుగులు నిరూపించాయి… అఫ్‌కోర్స్, ఇవి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాధించిన పరుగులు… కానీ కోహ్లి అంటేనే చేజింగ్… తను బ్యాట్‌కు పదును పెరిగేది చేజింగులోనే… అసలు చేజింగులో ఇండియన్ ప్లేయర్లు తడబడతారనే అపోహను బద్దలు కొట్టింది కోహ్లి బ్యాటే…

తన పేరిట ఏయే రికార్డులు ఉన్నాయని చెప్పడానికి కాదు ఈ కథనం… కోహ్లి ఈరోజుకూ ఇండియన్ జట్టుకు, ఇండియన్ క్రికెట్‌కు… కాదు, వరల్డ్ క్రికెట్‌కు ఎలాంటి బంగారమో చెప్పడానికి..! నాలుగు రోజులు ఫామ్ కోల్పోగానే తన స్నేహితులు ఎవరో, శ్రేయోభిలాషులు ఎవరో, ప్రపంచం గెలుపు చుట్టూ మాత్రమే ఎలా తిరుగుతుందో కోహ్లికి బాగా అర్థమైందని చెప్పడానికి..! ఇప్పుడు తన ఫామ్ అందిపుచ్చుకున్నాడు కదా… ఇక ఆహాలు, ఓహోలు వినిపిస్తాయి..!!

చెప్పనేలేదు కదూ… ఆదివారం నాటి శ్రీలంకతో జరిగిన మ్యాచ్… పరుగుల కోణంలో అతి పెద్ద విజయం… ప్రపంచ రికార్డు… అంతకు ముందు న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఐర్లాండ్ అనే పసికూనను ఓడించింది… ఆస్ట్రేలియా అప్ణనిస్థాన్ మీద సాధించిన 275 పరుగుల విజయం సెకండ్ ప్లేసులో ఉండేది… వాటితో పోలిస్తే శ్రీలంకపై ఇండియా తాజా గెలుపు నాణ్యమైంది… మరుపురానిది…


Biggest Win in ODI (by runs)

318 – IND vs SL*
290 – NZ vs IRE
275 – AUS vs AFG
272 – SA vs ZIM


Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions