మనం పొద్దున్నే కదా చెప్పుకున్నది… తారకరత్నకు గొప్ప పరివారం ఉండీ, ఘనమైన వారసత్వం ఉండీ… కఠినాత్ములైన తల్లిదండ్రుల కారణంగా, తన ప్రేమను ఇన్నేళ్లయినా అంగీకరించలేని వాళ్ల పంతాల కారణంగా… ఆ పెద్ద పరివారంలో భిన్నంగా బతికిన తారకరత్న విషాదం గురించి… కారులో నిద్రించిన క్షణం నుంచీ భార్యాభర్తలు కష్టాలకోర్చి బతుకులు వెళ్లదీయడం గురించి… అమ్మాయి వైపు ఆమె కుటుంబం, విజయసాయిరెడ్డి, అబ్బాయి వైపు జస్ట్, బాలకృష్ణ మాత్రమే కాస్త ఆత్మీయులుగా కనిపిస్తున్నారే తప్ప అంతపెద్ద ఎన్టీయార్ కుటుంబం అతన్ని క్రూరంగా వెలివేసిందనీ చెప్పుకున్నాం కదా…
తను మరణించాక తండ్రి మృతదేహం వద్దకు వెళ్లినప్పుడైనా కనీసం కోడల్ని, పిల్లలను పలకరించలేదనే సంగతి కూడా గుర్తుచేసుకున్నాం… బాలకృష్ణ తారకరత్న పిల్లల బాధ్యతను తీసుకున్నట్టు వస్తున్న వార్తల్నీ చదివాం… మొన్నామధ్య ఓ సినిమా జర్నలిస్టు తన ఫేస్‌బుక్ వాల్ మీద తారకరత్న చిన్నకర్మ కార్యక్రమం గురించి ఫోటోలు పెట్టి, జూనియర్ ఎన్టీయార్ తప్ప నందమూరి కుటుంబసభ్యులు అందరూ హాజరయ్యారని రాసుకొచ్చాడు… జూనియర్ ఎన్టీయార్ ఎందుకు హాజరు కాలేదో తెలియదు కానీ… తారకరత్న తల్లిదండ్రులు హాజరైనట్టు ఒక ఫోటో చూపిస్తోంది…
కానీ అనుకోకుండా ఓ శ్రద్ధాంజలి, పెద్ద కర్మ కార్డు కనిపించింది… అది చూసి ఆశ్చర్యమేసింది… ఒకసారి చూడండి అది…
Ads
మార్చి రెండున, ఫిలిమ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్టు ఉంది అందులో… జస్ట్, విజయసాయిరెడ్డి, బాలకృష్ణ కుటుంబాల పేర్లన్నాయి… తారకరత్న భార్య, పిల్లల పేర్లు, అలేఖ్య తరఫు కుటుంబం పేర్లున్నాయి… అంతే… ఒక్కటంటే ఒక్కటీ ఎన్టీయార్ కుటుంబం నుంచి పేరు కనిపించలేదు… లేదు…!
ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న… మరణం తరువాత కూడా ఆ వెలి కొనసాగుతోందా..? బిడ్డనే కోల్పోయినా సరే, ఆ పంతాలు పెద్ద కర్మకూ అడ్డు వస్తున్నాయా..? తెల్లారిలేస్తే సమాజానికి బోలెడు నీతులు చెప్పే దగ్గుబాటి పురంధేశ్వరి తదితరుల స్టాండ్ ఏమిటి..? తారకరత్న తండ్రి కఠినవైఖరేనా మిగతా వారందరిదీ..? ఇంతకీ అలేఖ్యారెడ్డి చేసిన పాపం ఏముంది..? తనను ప్రేమించిన తారకరత్నను పెళ్లాడి, మనస్పూర్తిగా తనతో కలిసి ఉండటమేనా..? ఆ పిల్లలు చేసిన పాపం ఏముంది..? తారకరత్నకు పుట్టడమేనా..?!
Share this Article