Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కల్కిలో అమితాబ్‌లాగా… ఇందులోనూ ఎస్వీఆర్‌దే అసలు హంగామా…

July 5, 2024 by M S R

100% వినోదభరిత చిత్రం . సినిమా అంతా SVR , నాగభూషణంల గోలే . మరీ ఎక్కువ గోల SVR దే . మరో వైపు శోభన్ బాబు , లక్ష్మిల రొమాన్స్ . సినిమా మొదట్లో ANR జయలలితల అదృష్టవంతుడు సినిమాలో జయలలిత మగవాడి రూపంలో ఉండటం , ANR అల్లరి గుర్తుకొస్తాయి .

హిందీలో హిట్టయిన విక్టోరియా 203 సినిమాకు రీమేక్ మన ఈ అందరూ దొంగలే సినిమా . అందులో అశోక్ కుమార్ , ప్రాణ్ , సైరాబాను , నవీన్ నిశ్చల్ నటించారు . SVR పాత్రను అశోక్ కుమార్ పోషించారు . నేను హిందీ సినిమాను కూడా రెండు సార్లు చూసా . అంత బాగుంటుంది హిందీ సినిమా కూడా .

యాభై ఏళ్ల కింద 1974 లో వచ్చిన మన తెలుగు సినిమాకు ప్రముఖ నిర్మాత-దర్శకుడు వి బి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు . ఆయన దర్శకత్వం వహించిన బయట బేనర్లో సినిమా ఇది ఒక్కటే కావటం విశేషం . ఆయన పిచ్చి మారాజు అనే సినిమాను మరో బేనర్లో దర్శకత్వం వహించారు . అయితే , అది తమ జగపతి సంస్థలో పనిచేసే సిబ్బంది సంక్షేమం కొరకు తీయబడిన సినిమా .

Ads

సినిమా పేరుకు తగ్గట్లు అందరూ దొంగలే . దొంగల సినిమా . మెయిన్ హీరోలు SVR , నాగభూషణం చిల్లర దొంగలు . బడా దొంగలుగా సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు . ఆరోజుల్లో జ్యోతిలక్ష్మి తర్వాత డాన్సర్ పాత్రల్లో ఎక్కువగా నటించిన జయకుమారికి కాస్త ప్రాధాన్యత కలిగిన పాత్ర లభించింది ఈ సినిమాలో . వజ్రాల కొరకు వెతుకులాట సినిమా అంతా . సినిమా ఆఖర్లో శోభన్ బాబే నాగభూషణం కొడుకు అని తెలవటం మంచి ట్విస్ట్ .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . కొసరాజు వ్రాసిన నాయుడోరింటికాడ నల్ల తుమ్మా చెట్టు కింద పాట చాలా బాగుంటుంది . రామకృష్ణ పాడారు . ఇద్దరు అల్లరి దొంగల మీద చిత్రీకరించబడిన పాట చంటి బాబూ ఓ బుజ్జి బాబూ బాగా హిట్టయింది . ఆరుద్ర వ్రాసారు . మిగిలిన పాటలు గుడుగుడు గుంజం గుళ్ళో రాగం , చూసానురా ఈవేళ నాయాలా కూడా బాగుంటాయి . కాకపోతే ఆరోజుల్లో నాయాలా అనే పద ప్రయోగం కొందరికి నచ్చలేదు . ఇప్పుడు ఘోరాతిఘోరమైన బూతు మాటలు , బూతు పనులు పరిపాటి అయిపోయాయి అనుకోండి .

ఈ సినిమా విజయానికి ముఖ్య కారణం SVR , నాగభూషణాల డైలాగులు . SVR పాత్ర చెణుకులు . భమిడిపాటి చేత వీరిద్దరి డైలాగులు వ్రాయించి ఉంటారు . టైటిల్సులో ఆత్రేయ , భమిడిపాటిల పేర్లు ఉంటాయి . హిందీలో సైరాబాను అంత అందంగా లక్ష్మిని చూపలేక పోయారేమో అని అనిపిస్తుంది . Still , Lakshmi was ok for that role .

పాటలు , మాటలు , రొమాన్స్ , గోల గోల , ఫైట్లు , చంపుకోవటాలు , వెరశి 100% వినోదభరిత సినిమా . మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమా . రిపీట్ రన్సుల్లో కూడా బాగానే ఆడింది . మా నరసరరావుపేటలో నాగూర్వలి టాకీసులో ఆడినట్లు గుర్తు . టివిలో కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది . యూట్యూబులో కూడా ఉంది . చూడనివారు తప్పక చూడతగ్గ 100% వినోదాత్మక , ఫీల్ గుడ్ మూవీ . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions