.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హఠాత్తుగా చంద్రబాబు మీద ఎందుకు అలిగాడనే కారణాలు ఎలా ఉన్నా… ఆదివారం నాడు తను కొత్తపలుకులో రాసుకొచ్చిన పీ4 పథక విశ్లేషణ గానీ… నిన్న ఫస్ట్ పేజీలో పరిచేసిన అమరావతి రైతుల ప్లాట్ల లేఅవుట్ల పాట్ల కథనం కూడా నిజాలు… వాటిని పాత్రికేయ కోణంలో మాత్రమే చూస్తే..!
భూములు తీసుకున్నప్పుడు రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తాం అని నమ్మ బలికారు… ఇప్పటికీ దాదాపు పదేళ్లు… ఇంతవరకు రైతుల ప్లాట్లకు సంబంధించి అభివృద్ధి పనులు మొదలే కాలేదు. ఉండవల్లి లాంటి కీలకమైన గ్రామాలలో రైతులకు ఫ్లాట్లు కేటాయించేందుకు అవసరమైన లేఔట్లే ఇంతవరకు వేయలేదు…
Ads
మూడు రాజధానులు అంటూ జగన్ అమరావతిని పట్టించుకోలేదు… తన ఐదేళ్ల పాలన కాలాన్ని తీసేసినా మిగిలిన ఐదేళ్లు టీడీపీయే కదా అధికారంలో ఉంది..? మరేమైంది..? ఇప్పుడు ఇంకో 40 వేల ఎకరాల భూసమీకరణ చేస్తారట…
అసలు ఈ భూముల వినియోగం, కేటాయింపుల మీదే బోలెడు విమర్శలు వస్తున్నాయి… మరోవైపు ఆంధ్రజ్యోతి రాసినట్టు ప్లాట్ల వ్యవహారం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది… ఇప్పుడు మరో 40 వేల ఎకరాల సమీకరణా అనే ఆశ్చర్యం, సందేహం, ఆందోళన కనిపిస్తోంది…
చంద్రబాబు సీరియస్‌గానే రైతుల ప్లాట్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోతే ఇంకో మూడేళ్లలో కూడా రైతులకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేరు… చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేయకుండా రైతులతోనే దురుసుగా ప్రవర్తిస్తున్న నారాయణ మాటల మీద పూర్తిగా ఆధారపడితే ఈ టర్మ్ అయ్యే లోపు కూడా పనులు పూర్తి కావు…
2016లో ఏం చెప్పారు..? గ్రామాల వారీగా రిటర్నబుల్ లేఅవుట్లు వేయాలి… లెవలింగ్ చేయాలి… హద్దు రాళ్లు పాతి ఏ ప్లాటు ఎవరిదో ఫిజికల్‌గా చూపించాలి… కరెంటు లైన్లు వేయాలి… ఇంటర్నల్ రోడ్లు వేయాలి… నీటి వసతి, డ్రైనేజీ ఏర్పాట్లు పూర్తి చేయాలి… ఇవన్నీ రెండేళ్లలో పూర్తి చేస్తామని అప్పట్లో అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చెప్పింది…
ఇప్పుడేమో కంప్యూటర్లలో చూసుకుంటేనే ప్లాట్లు… కానీ ఏది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు… ఇదీ ఆంధ్రజ్యోతి కథన సారాంశం… అవునూ, ఆంధ్రజ్యోతికి తన ఇష్ట ప్రభుత్వం మీద అకస్మాత్తుగా ఇంత కోపం ఎందుకొచ్చింది చెప్మా..! అమరావతి రైతుల రంగుల కలలు వెతలు కథల మీద ఈ కాన్సంట్రేషన్ ఏమిటబ్బా..?!
Share this Article