.
ఆంధ్రా కింగ్ తాలూకా… సినిమా టైటిల్ ఇది… టైటిల్ భాషే ఆంధ్రా… హీరో రామ్ పోతినేని నేపథ్యమూ అదే… సినిమా కూడా ఆంధ్రా సినిమాయే…
చాన్నాళ్లుగా రామ్ సినిమాలు రొటీన్, ఫార్ములా కథలు, ప్రజెంటేషన్లతో ఫ్లాప్ అవుతున్నాయి… అసలు తెరమరుగేనా ఇక అనుకున్న దశలో ఈ సినిమాలో మళ్లీ థియేటర్లకు వచ్చాడు… సగటు తెలుగు హీరోకు ఉండే ఎలివేషన్లు సరేసరి…
Ads
అసలే వ్యక్తిపూజ సొసైటీకి ప్రమాదకరంగా మారింది… ప్రత్యేకించి ఫ్యానిజం వెర్రితలలు వేస్తోంది… ఈ స్థితిలో ఇంకా హీరోలను, ఫ్యాన్లను, ఫ్యానిజాన్ని గ్లోరిఫై చేస్తూ… సొసైటీని మరింత పొల్యూట్ చేయడం అవసరమా..?
అవునూ, ఉపేంద్రకు ఇంత ఘట్టి, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారా..? వేరే పాపులర్ హీరోను తీసుకుంటే బాగుండేదేమో… ఐనా ఎందుకు లెండి, మళ్లీ ఆ హీరోకు పడని ఫ్యాన్స్ నెగెటివిటీ స్ప్పెడ్ చేస్తారు… అసలు సినిమాయే ఫ్యానిజం మీద కదా…
రామ్‌కూ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెకు నడుమ ఏదేదో ఉందని ప్రచారం జరిగింది… అబ్బే, అదేమీ లేదు అని ఆమె కూడా ఖండించింది… ఏమాటకామాట సినిమాలో వాళ్ల కెమిస్ట్రీ బాగుంది… ఏదో ఉందన్నట్టుగా… ఉంటే ఏమిటిలే అన్నట్టుగా…
.
సరే, ఈ అంశాలను పక్కన పెడితే సినిమా ఎలా ఉంది..? పర్లేదు… అంతే… అంతకుమించి ఏమీ లేదు… యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్ చూద్దాం ఓసారి…
ఈ సినిమా కథ సాగర్ (రామ్) అనే వీరాభిమాని చుట్టూ తిరుగుతుంది… అతను తన అభిమాన నటుడు, స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర) కోసం, అతనికి ఎదురైన కష్టాల నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాడు… ఒకరికొకరు ఎప్పుడూ కలుసుకోనప్పటికీ, ఈ ప్రయాణంలో హీరో, అభిమాని ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటారు… చివరకు వారిద్దరూ ఎలా కలిశారు అనేది కథ. ఈ కథలో సాగర్ ప్రేమకథ కూడా మిళితమై ఉంది…
అభిమాని పాత్రలో రామ్ బాగానే చేశాడు… సినిమాకు ప్రధాన బలం తనే… సినిమాలో పెద్దగా భావోద్వేగ సన్నివేశాలు లేకపోయినా, తనదైన సహజమైన ఎనర్జీ, నటనతో సినిమాను మోశాడు తనే… ఉపేంద్ర హీరో పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఉంది… కీలకమైన పాత్రే, అనుభవమున్న నటుడు కదా, పాత్రకు తగినట్టు ‘బరువుగా’ పర్‌ఫామెన్స్ ఉంది…
భాగ్యశ్రీ బోర్సే (హీరోయిన్) పాత్ర కూడా చిన్నదే… సరిపోయింది… ఇతర నటుల్లో రావు రమేష్ తన పాత్ర పరిధిలో బాగా నటించాడు… కానీ ప్రతి సినిమాలోనూ కనిపించే మురళీ శర్మ పాత్రను సరిగా ఉపయోగించుకోలేదు, ఇది వృధాగా అనిపించింది… ప్చ్, కమెడియన్ సత్య కామెడీ పెద్దగా పేలలేదు… రాహుల్ రామకృష్ణ కూడా..!
దర్శకుడు మహేష్ బాబు పచ్చిగొల్ల ఒక స్టార్, ఒక అభిమాని నేపథ్యాన్ని నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు… కొన్ని సన్నివేశాలు (ముఖ్యంగా రావు రమేష్ బ్లాక్) వోకే…
కానీ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది… ముఖ్యంగా ఫస్టాఫ్ నిడివి ఎక్కువగా అనిపిస్తుంది… కథనం కూడా సోసో… రామ్ పాత్రకు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే బలమైన ‘పోరాటం’ (Struggle) చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు…
సినిమాకు అత్యంత కీలకమైన పాయింట్, అంటే అభిమాని – స్టార్ కలుసుకునే క్లైమాక్స్, భావోద్వేగంగా పండలేదు… అక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదా స్పార్క్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్… బీజీఎం పర్లేదు… చాలా సీన్లను పొడిగించినట్టు అనిపించినా ఎడిటింగ్ సరిగ్గా జరగనట్టుంది… రామ్ పోతినేనీ, పెద్ద హిట్ ఆశించకు..!!
రాపో (రామ్ పోతినేని) సూపర్ అని కీర్తించేలా లేదు… అలాగని పోరా (పోతినేని రామ్) అని విసిరికొట్టేట్టు కూడా లేదు… యావరేజ్ సినిమా…!!
Share this Article