.
అంతే భయ్యా… అంతే… ఆంధ్రా మీడియాకు మర్యాద దక్కదు అని స్ట్రాంగ్ డోస్ ఇవ్వాల్సిందే… నువ్వు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాళ్లంటే, తెలంగాణ నాయకులంటే ఎంత అమర్యాద వాళ్లకు..? హమ్మా..! బరితెగిస్తున్నారు, హైదరాబాదులో బతుకుతూ…!!
అఫకోర్స్, నువ్వేమైనా తక్కువా..? ఇప్పుడంటే అచ్చ కాంగ్రెస్ అంటున్నావు కానీ మధ్యలో కాషాయ కాంగ్రెస్ కదా…! పోతేపోనీ, అదొక గ్రహణకాలం అనుకుందాం… ఇప్పుడు పోవడానికి మరో క్యాంపు లేదు, కేసీయార్, కేటీయార్ పెత్తందారీ పోకడలు మనం భరించలేం…
Ads
పెట్టాల్సిందే… అవసరమైతే నువ్వన్నట్టు వంద మీడియా చానెళ్లు పెట్టగలవు… పెట్టాలి… పత్రికలూ పెట్టాలి… యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, సోషల్ మీడియా దుకాణాల్ని విరివిగా బీఆర్ఎస్ క్యాంపు స్థాయిలో పెట్టాలి… లేకపోతే ఏమిటన్నా ఇది..?
ఈటీవీ- ఈనాడు… ఆంధ్రా… ఏబీఎన్- ఆంధ్రజ్యోతి… ఆంధ్రా… సాక్షి టీవీ, పేపర్… ఆంధ్రా… వాట్ నాట్..? చివరకు ఓ కంట్రిబ్యూటర్‌గా పనిచేసిన వంశీ కూడా ఓ పచ్చ చానెల్ నడిపిస్తున్నాడు… మేఘా కృష్ణారెడ్డి, టీవీ5 చౌదరి, టెన్ టీవీ, టీవీ99… పేర్లు గుర్తుకురావడం లేదు గానీ అన్నీ ఆంధ్రా వాసనలే కదా నాయకా..?
అదే జనసేన, అదే టీడీపీ, అదే వైసీపీ భజనలు, బురద జల్లుకునే ధోరణులు తప్ప… ఒక్కడికైనా తెలంగాణ మీద ప్రేమ ఉండి చస్తే కదా… సో, మనం అర్జెంటుగా ఓ మీడియా చానెల్ పెట్టాల్సిందే ఫస్ట్… చివరకు ప్రభాత ఉదయం అనే పేపర్ వస్తుందట, అదీ ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తున్న సదరు రాధాకృష్ణ అన్న కొడుకుదేనట… మళ్లీ పేరుకు అదీ తెలంగాణ మీడియా…
వీ6, వెలుగు, నమస్తే తెలంగాణ, టీన్యూస్, మన తెలంగాణ, ప్రజాపక్షం, నవతెలంగాణ… ఇంతేకదా, మనకున్నవి… అవేమో అంతంతమాత్రం దుకాణాలు… అందుకే మనం స్టార్ట్ చేయాలె… తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్యూర్ తెలంగాణ జర్నలిస్టులనే తీసుకోవాలి… అందులోనూ అచ్చ కాంగ్రెస్ సానుభూతిపరులైతే మరీ బెటర్…
కానీ ఒక్కటే డౌట్… నువ్వు అప్పట్లో రాజ్ న్యూస్ అని ఓ చానెల్ లీజుకు తీసుకుని నడిపినట్టు గుర్తు… ఎన్నాళ్లు నడిచిందో తరువాత ఏమైందో కూడా తెలియదు… అందుకే మళ్లీ అందరూ నవ్వేటట్టు గాకుండా… ఈ ఆంధ్రా మీడియా దుకాణాలను తలదన్నే ఓ పే-ద్ద దుకాణం తెరవాల్సిందే, మళ్లీ మూసేయకుండా నడిపించాల్సిందే నాయకా..? అవసరం ఉందిప్పుడు… జై అచ్చ కాంగ్రెస్ !!
అన్నట్టు, మొన్నామధ్య ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ నేషనల్ మీటింగుకు వెళ్లిన మన ఉపముఖ్యమంత్రి భట్టి ‘‘పాలకులను నిలదీసే పత్రికా స్వేచ్ఛను మేం పూర్తిగా స్వాగతిస్తాం… ప్రభుత్వాలు, పాలకుల తప్పులను మీడియా బరాబర్ ప్రశ్నించాలి.., విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు ఉండాలి…’’ అన్నాడు… అంటే తెలంగాణ మీడియాకు మాత్రమే ఆ ప్రశ్నించే, ఆ నిలదీసే అవకాశం అని అర్థం చేసుకోవాలి… అంతే కదా…
Share this Article