Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన్నీరు – పన్నీరు ! ఓ బోఫోర్స్ – ఓ రాఫెల్ – ఓ బ్రహ్మోస్ – ఓ తేజస్ !!

July 23, 2026 by M S R

.

నిజం ఏమిటంటే..? పొద్దున్నే ఆంధ్రప్రభ చదవడం ఆరోగ్యానికి చాలామంచిది… హాయిగా నవ్వుకుంటే రిలాక్స్, బీపీ తగ్గుతుంది, సుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి… మెంటల్ పీస్… పక్కా… ఈ విషయంలో ఆ పత్రిక ఎప్పుడూ నిరాశపరచలేదు ఎవరినీ… చాలా ఉదాహరణలున్నాయి గానీ… తాజాగా ఒకటి చూద్దాం…

హబ్బా, ఈరోజు పత్రికే… ఫస్ట్ పేజీలో మూణ్నాలుగు కాలాలు, సెకండ్ బ్యానర్, తరువాయి పేజీల్లో మరో హాఫున్నర పేజీ… కుమ్మిపారేశారు… మామూలుగా అన్ని పత్రికల్లో రిపోర్టర్లు రాస్తారు… కానీ ఇందులో నెట్‌వర్క్ ఇన్‌చార్జులు రాస్తుంటారు… అలా ఓనర్ శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు… నిమిషాల్లో ఔట్‌పుట్ రెడీ…

Ads

సదరు సంపాదకుడు పాపం ఎవరో గానీ… కళ్లకద్దుకుని, ఒరేయ్ అబ్బాయిలూ, ఫస్ట్ పేజీ అట, పెట్టేయండర్రా అనేస్తాడు… ఇలా…

ప్రభ

అసలు తన్నీరు హరీష్ రావు అంటే ఎవరు..? కేసీయార్ చెక్కిన శిల్పం, పార్టీకి కవచం, ట్రబుల్ షూటర్, సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్ర… ఇవన్నీ వాళ్లు ఆ కథనరత్నంలో రాసినవే సుమా… స్పేస్ సరిపోక కట్టయినట్టున్నాయి కొన్ని పదాలు… హరీష్ అంటే ఓ బోఫోర్స్ గన్ను, ఓ రాఫెల్ జెట్టు, ఓ బ్రహ్మాస్ క్షిపణి… ప్చ్, స్పేస్ చూసుకోవాలి కదా మిత్రమా…

తను ప్రత్యర్థి పత్రిక వెలుగులోనే బ్రహ్మాండమైన వ్యాసం పబ్లిష్ చేయించుకోగలిగిన సమర్థుడు… (అక్షరాలా సమర్థుడే, అది అంగీకరించాలి… వివేక్ వెంకటస్వామి అంటేనే వన్నెతరగని నిష్పాక్షికత, నిఖార్సు పాత్రికేయ ఘన ప్రమాణం…)… అలాంటిది ఆంధ్రాప్రభలో ఇది రాయించుకోవడం పెద్ద పనా తనకు..? ఐతే సందర్భం ఏమిటి..? తెలియదు! ఇప్పటికిప్పుడు ఈ కీర్తనల మతలబు ఏమిటి..? తెలయదు!

పాపం, రేపు తన వారసత్వ ప్రత్యర్థి, కేటీయార్ జన్మదినం కదా, పత్రికల్ని పెయిడ్ యాడ్స్, కథనాలతో హోరెత్తిస్తారు కదా, ముందురోజే ఈయన్ని ఆకాశానికి ఎత్తితే, రేపటి కవరేజీ మసకబారుతుందనే భావనా..,? అవునూ, ఇక్కడ హెడింగులో పన్నీరు అంటే ఏమిటి మాస్టారూ..?

పన్నీరు అంటే పాలతో తయారయ్యే ఆహారపదార్థమా..? పరిమళాలు వెదజల్లే రసాయనమా..? ఓహ్, తన్నీరుకు ప్రాస కలవాలని పన్నీరు అన్నారా..? సరే, సరే… చివరగా ఓమాట… నమస్తే తెలంగాణ కూడా తన ఓనర్ కేసీయార్ మీద ఇలాంటి కీర్తన ఎప్పుడూ పబ్లిష్ చేసి ఉండదు… అంతెందుకు..? నమస్తే సాక్షికి కూడా చేతకాలేదు ఈ విద్య..!! సొంతంగా యాడ్ ఇస్తే, ఆ కంటెంటు కూడా ఇలా ఉండబోదు, పక్కా… జయహో ఆంధ్రప్రభ… జయహో హరీష్ రావు…!!!

పేరుకు ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్, యూట్యూబ్, డిజిటల్ జర్నలిజాల మీద విషం కక్కుతాయి, మీరెవరికన్నా తక్కువ మాస్టారూ..!? హెలో కవితక్కా… ఎనీ కామెంట్?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తన్నీరు – పన్నీరు ! ఓ బోఫోర్స్ – ఓ రాఫెల్ – ఓ బ్రహ్మోస్ – ఓ తేజస్ !!
  • N E E T – అసలు ఏమిటి ఈ పరీక్ష ! ఎందుకింత ప్రాధాన్యం !?
  • అవును, పాటలు, సీన్లు, ట్రెయిలర్లు చెప్పేది అదే… ‘టాక్సిక్’ అని..!!
  • ఫాఫం పూజా హెగ్డే ! ‘జననాయకుడి’ కథలో ఎడాపెడా కట్ కట్ !!
  • మిస్టర్ పవన్ కల్యాణ్… కోడి చెరువు కబ్జాపై మాట మీద నిలబడతావా…
  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?
  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions