ఆమధ్య ఒకసారి చదివినట్టు గుర్తు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు తన కొత్తపలుకు వ్యాసంలో చంద్రబాబు, తెలుగుదేశం పేరు ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టకుండా తమాయించుకోవడం… మళ్లీ ఈరోజు కూడా అలాంటిదే చదివా… కాస్త లేటుగా, తాపీగా… ఆనందం వేసింది… అసలు చాలా గ్రేట్… జగన్‌ను ఆడిపోసుకోకుండా… చంద్రబాబును పొగడకుండా ఒక వ్యాసం రాయడం అంటే అది మామూలు పరీక్ష కాదు… ఆర్కే తొడుక్కున్న పచ్చ అంగీ, పెట్టుకున్న పచ్చటి కళ్లద్దాల పవర్ అలాంటిది మరి… బట్, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు తను ఈరోజు…
రాధాకృష్ణ మార్కు జర్నలిజంలోని బ్యూటీ అదే… జస్ట్, అలా ఏపీ కులరొంపి నుంచి బయటికి వస్తే చాలు, తను మంచి జర్నలిస్టు… ఎటొచ్చీ ఆ పచ్చంగీతోనే పరేషాన్… విషయానికొస్తే… కేసీయార్ ఎందుకు దెబ్బతిన్నాడో కాస్త పెరిఫెరల్గానైనా చెప్పుకొచ్చాడు… గొప్పే… ఎందుకు గొప్ప అంటే… తనేదో అద్భుతంగా విశ్లేషించాడని కాదు… ఈమాత్రం రాసే తెలుగు జర్నలిస్టులు అసలు హైదరాబాద్ అడ్డా మీద కనిపించడం గొప్ప… ఎల్బీ స్టేడియంలో కేసీయార్ సభకు వచ్చిందే పిడికెడు మంది… వాళ్లూ కేసీయార్ ప్రసంగం స్టార్ట్ కాగానే లేచి వెళ్లిపోయారు, అప్పుడే అర్థమై పోయింది కేసీయార్ పార్టీకి గ్రేటర్లో ఏ రిజల్ట్ రానుందో… ఇలాగే రాసుకొచ్చాడు ఆర్కే, నిజమే… జనం మూడ్ పట్టించేవి ఇలాంటివే… ఆర్కే పట్టుకున్నాడు… తను తప్ప ఇంకెవరూ ఆ కీలక పాయింట్ రాయలేకపోయారు చూశారా..? దటీజ్ ఆర్కే…
Ads
సరే, చాలా కారణాలు విశ్లేషించాడు, ఇప్పుడు వాటి జోలికి వద్దుగానీ… కాబోయే పీసీసీ అధ్యక్షుడిగా చెప్పబడుతున్న రేవంతుడికి ఓ హెచ్చరిక చేశాడు తను… నిజానికి రేవంత్‌కు ఆర్కే మంచి సన్నిహితుడే… ఐనా సరే, పేకాట పేకాటే… కాంగ్రెస్‌ను ఓడించటానికి మీడియా సుపారీ తీసుకుందని ఏదో రేవంత్ ఆరోపణ చేశాడు కదా… వోకే, మరెవర్ని తిట్టాలో తెలియక, అప్పటికప్పుడు ఫ్లోలో ఏదో తోచింది చెప్పాడు… రేవంత్ మాటల్ని కూడా అంత సీరియస్‌గా తీసుకుంటే ఎలా..? కనీసం సుపారీ ఇచ్చింది బీజేపీయా, టీఆర్ఎస్సా కూడా చెప్పలేదుగా తను… ఆర్కేకు రోషం వచ్చింది… అబ్బే, తనకు ఆ డబ్బులు రాలేదని కాదు… జర్నలిజాన్ని అలా అవమానపరుస్తాడా అని… అందుకే హెచ్చరిక చేశాడు…
ఏమోయ్ రేవంతూ… ఆ నమస్తే తెలంగాణ ఇతర పత్రికల చందాదారులకు కూడా పుణ్యానికి పత్రికల్ని పదిరోజులు పంచిపెట్టింది, ఏం ఫాయిదా వచ్చింది..? రాలేదు… రాదు… అసలు మీడియాను నమ్ముకుని రాజకీయం చేయడమే వేస్ట్… అవివేకం… కేసీయార్‌కు బోలెడంత మీడియా మద్దతు ఉంది, ఏమైంది..? రాజకీయాల్లో అవకాశం కోసం ఓపికగా వేచిచూడాలే తప్ప ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా నోరుజారొద్దు… సరికాదు… ఐనా షార్ట్‌కట్‌లో రాజకీయంగా ఎదగాలని అనుకుంటే ఎవరి పొలిటికల్ కెరీర్ అయినా అర్ధంతరంగా ముగిసిపోతుంది…….. అంటూ బోలెడన్ని నీతులు చెప్పాడు…
నిజానికి రేవంత్ ఏదో ఫ్లోలో ఏదో అన్నాడు… ఆ సుపారీ ఆరోపణలు ఎంత అర్ధరహితమో ఆర్కే రాతలూ అలాగే… ఎందుకంటే..?
- రేవంత్ షార్ట్‌కట్‌లో రాజకీయంగా ఎదగాలని ఏమీ అనుకోవడం లేదు… తను ప్రత్యక్ష రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తింటూనే ఎదుగుతున్నాడు…
- షార్ట్ కట్ రాజకీయాలకూ… మీడియా సుపారీకి లింక్ లేదు… ఆర్కే కూడా ఏదో చెప్పబోయే ఇంకేదో రాసుకుంటూ పోయాడు…
- అసలు మీడియాను నమ్ముకుని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం అవివేకం అన్నాడు కదా… దానికి ఆద్యుడు ఇదే ఆర్కే గురుదేవుడు చంద్రబాబు… ఆ మీడియాలో ఆంధ్రజ్యోతి పాత్ర కూడా ప్రముఖమే… తను కూడా మీడియాతో ఫాయిదా లేదోయ్ అని చెప్పడం ఏదైతో ఉందో… అది అల్టిమేట్ ఆత్మవిమర్శ…
- ఐనా కేసీయార్, పారా హుషార్ అని స్టార్ట్ చేసి, చివరకు రేవంత్‌కు చురకలు పెట్టి ముగించడం ఏమిటో ఓ పట్టాన అర్థమై చావలేదు… అంటే, ఆర్కే స్టాండర్డ్ రాతల్ని అర్థం చేసుకునే కెపాసిటీ, అంత బుర్ర మనకు లేకపోవడం వల్లే అంటారా..? ఏమో, అదే అయి ఉంటుంది…!!
Share this Article