విశేషమే… అంతటి రాధాకృష్ణ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు వివరణ ఇచ్చుకోవడం… నన్ను అర్థం చేసుకొండి, నా రాతల్ని అపార్థం చేసుకోకండి అంటూ హాఫ్ పేజీ పాటు పవన్ ఫ్యాన్స్‌ను వేడుకున్న తీరు ఎందుకోగానీ సరైందిగా అనిపించలేదు… నిజంగానే కేసీయార్ ఓ రాజకీయ ఎత్తుగడగా పవన్ కల్యాణ్‌కు 1000 కోట్లు ఇవ్వజూపాడు అని తను గత వ్యాసంలో రాయడాన్ని కేసీయార్ కోణంలోనే చదువుకోవాలి… కేసీయార్ డబ్బు వెచ్చిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనేది ఆ వాక్యం చదవాల్సిన కోణం..
ఈరోజు తన కొత్తపలుకులో సుదీర్ఘంగా ఇచ్చుకున్న వివరణలో… నేనెక్కడా పవన్ కల్యాణ్ కేసీయార్ డబ్బును అంగీకరించినట్టు ఏమీ రాయలేదు… ఇక్కడ పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ డిమాండ్ బాగా ఉంది, అందరూ తన మద్దతు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు అనే భావనే వ్యక్తమైంది… కానీ నాగబాబు అండ్ కో ఆర్కే రాతల్ని భిన్నమైన కోణంలో చూసినట్టున్నారు… ఆయ్ఁ మా బాస్ డబ్బుకు అమ్ముడుబోయే రకమా అని భారీగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు… (వైసీపీ క్యాంపు ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని నిందిస్తుండగా, దానికి ఆజ్యం పోసినట్టుగా చంద్రబాబు అనుకూల ఆంధ్రజ్యోతిలో ఈ 1000 కోట్ల వాక్యం రావడం ఏమిటనేది బహుశా జనసేన అసంతృప్తికి కారణం కావచ్చు…)
నిజానికి ఏ స్థాయి ట్రోలింగైనా రాధాకృష్ణ పెద్దగా పట్టించుకునే రకమేమీ కాదు… మరి నాగబాబుకు కూడా అంత లోతైన వివరణ ఎందుకు ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టు..? అసలు ఏపీ రాజకీయాల్లో నాగబాబు పాత్ర, ప్రభావం ఎంత..? కానీ రాధాకృష్ణకు ఈ 1000 కోట్ల వాక్యం తెలుగుదేశం వైపు నుంచి చిక్కులు తెచ్చిపెట్టినట్టుంది… ఇలాంటి రాతలు చంద్రబాబు- పవన్ కల్యాణ్ బంధానికి నష్టదాయకమనీ, ఒకవైపు పవన్- బాబు బంధాన్ని పలుచన చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుంటే, దానికే సహకరిస్తున్నట్టు ఈ రాతలేమిటి అనే ప్రశ్న ఘాటుగా ఎదురైనట్టుంది…
Ads
అందుకేనేమో ఈ సుదీర్ఘ వివరణ… పట్టాభిని కొట్టారనే వార్తకు సంబంధించి ఓ తప్పుడు ఫోటో పెట్టి, ఈనాడు రెండుమూడు వాక్యాల్లో ‘సవరణ’ అచ్చేసి, చేతులు దులుపుకుంది… మంచిదే, కనీసం ఆ పాత్రికేయ ప్రమాణాన్ని పాటించింది… ఆంధ్రజ్యోతి చాలా వార్తలకు సంబంధించి అదేమీ చేయదు… నా రాత నా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది… కొన్నిసార్లు ఆ పెడసరం కూడా కరెక్టే అనిపిస్తుంటుంది… కానీ పవన్ విషయంలో రాసిన ఒక్క వాక్యానికి ఎంత పెద్ద వివరణ ఇచ్చాడో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది…
ఒక్క వాస్తవం గమనించలేదేమో రాధాకృష్ణ ఇన్నేళ్లలో… పవన్ కల్యాణ్ రాజకీయాలు ఏపీకి అవసరమే అని భావించే తటస్ఠులు కూడా పవన్ కల్యాణ్ గురించి రాయడం మానేశారు… మంచి రాయడం లేదు, చెడు రాయడం లేదు… నో నెగెటివ్, నో పాజిటివ్… కారణం, ఏ రాతనూ ఆ క్యాంప్ స్వీకరించడం లేదు సరిగ్గా… పవన్ కల్యాణ్ గురించి రాయాలనుకుంటే ఈ ట్రోలింగుకు వెరవకూడదు, లేదంటే రాతలకు దూరంగా ఉండాలి… సోషల్ మీడియాలో జరిగే దాడి సెగ ఎలా ఉంటుందో ఇప్పుడర్థమైనట్టుంది రాధాకృష్ణకు..!
Share this Article