రాష్ట్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ జగడం ముదురుతోంది… నిజమే… కానీ జగన్ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ నడుమ కూడా ఘర్షణే కదా… ఆ తగాదా ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయింది… ప్రజల వోట్లతో గెలవలేక, తమ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా సమాంతర పాలనకు ఈ రూట్లను చంద్రబాబు ఆశ్రయిస్తున్నాడనేది జగన్ కోపం అనుకుందాం… అందుకే పదే పదే రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగాన్ని చట్టుబండలు చేశారు అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో గాయిగత్తర లేపే ప్రయత్నం చేస్తున్నారనే అనుకుందాం… ఇంకో కోణంలో ఆలోచిస్తే… ‘‘జరగనీ, ఇలాంటి పరిస్థితులు వస్తే, ఏ వ్యవస్థ పరిధి ఏమిటో తేలిపోతే… భవిష్యత్తులో ఇలాంటి పంచాయితీలు వచ్చినప్పుడు ఓ ఉదాహరణగా (ప్రిసిడెంట్) ఉంటుంది కదా…’’ అని ఇంట్రస్టింగు గమనిస్తున్న సెక్షన్ కూడా ఉంది… అయితే ఏపీలో మీడియా సంస్థలు కూడా కులం, పార్టీ వారీగా చీలిపోయి, ఎవరి డప్పు వాళ్లే కొట్టుకుంటున్నందున… ఇష్యూను ఇష్యూలాగా గాకుండా… సంయమనం, ప్రమాణాలు, విలువలు గట్రా వదిలేసి… పెట్రోల్ గుమ్మరిస్తూ, జనం మెదళ్లను ప్రభావితం చేసే పనిలో పడ్డాయా..?
ఈనాడు కొంత సంయమనం పాటిస్తున్నట్టుగా తోస్తున్నది… కానీ ఇటు ఆంధ్రజ్యోతి, అటు సాక్షి… రెండూ బరితెగింపు బ్యాచులే… మరీ ఆంధ్రజ్యోతి కథనాల ధోరణి ఎలా ఉంటున్నదంటే..? తక్షణం జగన్ను కుర్చీ దింపేసి, తరిమేయాలి… రాష్ట్రపతిపాలన పెట్టాలి అన్నట్టుగా ఉంటున్నయ్… అంతేకాదు, వీలయితే మళ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం పెట్టాలి, మళ్లీ ఎవరూ రాజ్యాంగ సంస్థల జోలికి రాకుండా కట్టుబాట్లు పెట్టాలి, వీలయితే మోస్ట్ ఎక్స్పీరియెన్స్డ్ లీడర్ చంద్రబాబును ఆపద్ధర్మ సీఎంగా పెట్టాలి అని వ్యంగ్యంగా కామెంట్లు చేసుకోదగిన రీతిలో కథనాలు సాగుతున్నయ్… మచ్చుకు ఈరోజు వచ్చిన బ్యానర్ చూసుకొండి… ‘‘రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ సర్కారు రంకెలు… దేశంలోనే తొలిసారిగా ఇలాంటి సంక్షోభం, ప్రతిష్ఠంభన, ఇదేం తీరు, ఎన్నికలపై కమిషన్ నిర్ణయాలే అల్టిమేట్, ఈమాత్రం తెలియదా..? ఏమిటీ సాకులు..? కోర్టు ఆదేశాల్నే ధిక్కరిస్తారా..?’’ అన్నట్టుగా ధుమధుమలాడిపోయింది… ఆ కోపాగ్నిలో పత్రిక కాలిపోతున్న కమురు వాసన…
Ads
వోకే… కోర్టు చెప్పింది ఫైనల్… ఎస్ఈసీ ఫైనల్ చెప్పింది ఫైనల్… అంగీకరిద్దాం… జగన్ సర్కారుది మొండి వైఖరే, అనుభవరాహిత్యం నిజమే అనుకుందాం… ఇప్పటికిప్పుడు మోడీ అర్జెంటుగా గవర్నర్కు కాల్ చేసి, జగన్ను పీకిపారెయ్ అని ఆదేశించాల్సిందే, లేకపోతే మోడీని దింపడమే కరెక్టు అని కూడా అనుకుందాం… కానీ ఆర్కే గారూ, బీపీలు పెంచుకుంటే వచ్చేది ఆయాసమే… జెర సైసు… జగన్ సర్కారు ఔటాఫ్ సిస్టం పోవడం లేదు కదా… సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం అంటున్నాడు… అది రాజ్యాంగం అనుమతించిన ప్రక్రియ కాదా..? ఆ హక్కు జగన్ సర్కారుకు లేదా..? ఇది రంకెలు ఎలా అయ్యాయ్..? పోనీ, తమ భయాందోళనల్ని వ్యక్తం చేసే హక్కు అధికార యంత్రాంగానికి లేదా..? ప్రభుత్వానికి లేదా..? ఫాఫం, ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందే కదా… ప్రజలు వోట్లేసి రాజ్యాంగం ప్రకారమే జగన్ను గెలిపించారు కదా… ఒక్క ఆంధ్రజ్యోతికి, ఒక్క చంద్రబాబుకు ఇష్టం లేదని గవర్నర్ నిర్ణయాలు తీసుకోలేడు కదా… జగన్, ఇక చాల్లేవోయ్, కుర్చీ దిగి వెళ్లిపో అనలేడు కదా…? ఏమంటారు సార్..? ఓడిపోతే పోతాడేమో, పోనివ్వండి, కానీ ప్రయత్నించి ఓడిపోనివ్వండి తనను..!!
Share this Article