ధిక్కారం..! తనను బెదిరించడానికి, తొక్కడానికి చూస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భయపడడు… ఇంకో నాలుగు వాక్యాలు ఎక్కువే రాసి, కమాన్, తొక్కగలవేమో చూడు అని సవాల్ చేస్తాడు… గతంలో చాలా సందర్భాల్లో ఇది అందరూ గమనించిందే… తిరుమల శ్రీవారి పరువు తీసే రాతలు రాస్తుందంటూ వంద కోట్ల దావాకు సిద్దపడిన సుబ్రహ్మణ్యస్వామి విషయంలో ఇంకాస్త ముందుకు వెళ్లి… రివర్స్ పరువు నష్టం కేసు వేయడానికి ఆంధ్రజ్యోతి రెడీ అయిపోవడం తాజా విశేషం… నిజమే, చంద్రబాబు డబ్బులిస్తేనే ఆంధ్రజ్యోతి ఇలా రాతలు రాస్తోందని ఆరోపించాడు కదా, తద్వరాా ఆంధ్రజ్యోతి పరువుకు భంగం కలిగించాడు కదా, సో, స్వామి మీద కేసు వేసేందుకు ఆంధ్రజ్యోతికి హక్కు ఉన్నట్టే… అర్హత ఉన్నట్టే…! అది నిజమని నిరూపించే బాధ్యత స్వామిపై పడుతుంది… ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం కదా మరి..! అయితే..? రాజ్యసభ సభ్యత్వం కోసమే స్వామి ఆరాటపడుతున్నాడనీ, జగన్ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాడనీ, అందుకే ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశాడనే ఆర్కే వాదన కొంత నమ్మబుల్‌గా లేదు… కానీ..?
పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సీటు ఇవ్వడానికి బీజేపీ ప్రోద్బలం కారణం కావచ్చు, రిలయెన్స్‌తో సత్సంబంధాలు కోరుకోవడం కారణం కావచ్చు… కానీ సుబ్రహ్మణ్యస్వామి అసలే బీజేపీ అధిష్ఠానానికి అయిష్టుడు… ఆర్కే చెప్పినట్టు… స్వామి బయట ఉండటంకన్నా పార్టీ ఫోల్డ్‌లో, ఏదో ఓ పదవిలో ఉండటమే బెటర్ అని బీజేపీ భావించి ఉండవచ్చు… కానీ స్వామికి బీజేపీ మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమో, ఇప్పించడమో చేస్తుందని నమ్మలేం… తాము చెప్పినట్టు ఆంధ్రజ్యోతి మీద కేసు వేశాడు కాబట్టి జగన్ అభిమానంతో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తాడని నమ్మడమూ కష్టమే… జగన్ లెక్కలు వేరుగా ఉంటయ్… ఆ లెక్కల్లో స్వామి ఫిట్టవుతాడా..? సరే, అదీ వేచి చూడాల్సిన విషయమే అనుకుందాం… కానీ స్వామికి సంబంధించి ఆంధ్రజ్యోతి వెల్లడించిన వివరాలు, వేస్తున్న ప్రశ్నలూ ఇంట్రస్టింగే…
Ads
స్వామి ప్రాక్టీసింగ్ లాయర్ కాదు… తను ఎకనమిస్ట్… అలాంటప్పుడు తనకు ఏ హోదాలో టీటీడీ పరువు నష్టం కేసు అప్పగిస్తుందనేది ఓ ముఖ్యమైన ప్రశ్న… ఇది పిల్ కూడా కాదు… పైగా లోకస్ స్టాండీ కాదు… ఎవరో లాయర్ ద్వారా దావా వేయించాలి… అదే జరుగుతున్నప్పుడు స్వామి ఎందుకు పదే పదే ఈ కేసు గురించి మాట్లాడుతున్నాడు అనేదీ ప్రశ్నే… టీటీడీ ఖాతాలను కాగ్ ద్వారా ఆడిటింగ్ చేయించటానికి జగన్ అంగీకరించాడనీ, కానీ టీటీడీ ప్రభుత్వ సంస్థ కాదు కాబట్టి కాగ్ దానికి అంగీకరించలేదనే అసలు విషయాన్ని కూడా ఆర్కే వెల్లడించాడు… కాగ్ ఆడిటింగ్‌కు జగన్ అంగీకరించినందున తనకు నచ్చాడని స్వామి చేసే మెచ్చుకోళ్లలో అసలు పాయింట్ లేకుండా పోయింది దీంతో… స్వామి పింక్ డైమండ్ మీద సుప్రీంకు వెళ్లాడు కదా, మరి మళ్లీ దానిపై ఎందుకు మాట్లాడటం లేదు అనేదీ ఓ పాయింటే… ఒకవేళ ఆంధ్రజ్యోతి ఆర్కే తన పత్రికలో తానే రాసుకున్నట్టు స్వామి మీద ఉల్టా పరువు నష్టం దావా గనుక వేస్తే… తనే చెప్పినట్టు… అరె ఓ సాంబా, అబ్ ఆయేగా మజా…!! చివరగా… చంద్రబాబుకూ ఆంధ్రజ్యోతికి ముడిపెట్టి ఎవరు ఏం రాసినా కోర్టుకు ఈడుస్తామని మరో ప్రకటన జారీ… రేప్పొద్దున వైసీపీ లీడర్స్, సాక్షి ఈ దిశలో ఏం ఆరోపించినా, ఏం రాసినా కేసులే అన్నమాట… అప్పుడు… ఆయేగా బహుత్ మజా…!!
Share this Article