నాగిన్ నాగిన్ అని కాజల్‌ని వెక్కిరించి, చివరికి తనే బుక్కై పోయింది ఆనీ మాస్టర్… హౌజ్ వీడిపోయింది… శుక్రవారం మరీ బ్యాలెన్స్ కోల్పోయింది ఆమె… నిజానికి ప్రియాంక వెళ్ళిపోతుంది, లేదా తక్కువ వోట్లకు ఆమెతో పోటీపడిన మానస్ లేదా కాజల్ వెళ్లిపోతారు అని అనుకున్నారు అందరూ… ఆమె పెద్ద పోటీదారు కూడా కాదు… గ్రూపులు కట్టలేదు, కుట్రలు చేయలేదు… అన్నింటికీ మించి బిగ్‌బాస్ టీంతో మిలాఖత్ లేదు… మరింకేం..? కథ ముగిసింది… సూట్‌కేసు సర్దుకుంది, బయటపడింది… నిజానికి ఆమె ఇండివిడ్యుయల్ ప్లేయర్… హౌజులో ఉండాల్సిన వ్యక్తి… కానీ నానా కుట్రలు, రాజకీయాలు, ప్రభావాలకు వేదిక బిగ్‌బాస్… అదొక డర్టీ హౌజ్… ఎట్ లీస్ట్ ఈ సీజన్…
అందరూ పెద్ద మనుషులే… శ్రీరాంచంద్ర, మానస్ ఎట్సెట్రా… లేదంటే బుర్ర పనిచేయని సన్నీ… ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ… రవి కుట్రదారు… ప్రతిదీ ఓ స్ట్రాటజీ… అందరూ అందరే…. నిజానికి మోస్ట్ హోప్‌లెస్ కంటెస్టెంట్ షణ్ముఖ్‌ను ముందుగా బయటికి పంపించేయాలి… తనతో జతకట్టిన సిరిని బయటికి పంపించాలి… కానీ బిగ్‌బాస్ ప్లే చేస్తున్న ఏకైక లవ్ ట్రాక్ ఇదే ఇప్పుడు… రెండూ మెంటల్ కేసులే… ఇద్దరికీ బయట ‘‘బంధాలున్నయ్’’… కానీ హౌజులో మాత్రం ముద్దులు, హగ్గులు, ఒకే బెడ్ మీద పడక… చివరకు షన్నూ అనేవాడు ఏమేమో తిట్టేస్తాడు, ఆమె బాత్‌రూంలోకి వెళ్లి గాయపరుచుకుంటుంది… మళ్లీ ఇద్దరూ కలిసి అలుముకుంటారు… ప్రేక్షకులకు వెగటు… బిగ్‌బాస్ టీంకు పరమానందం…
Ads
అదేమంటే… అలా కనెక్షన్ పెరిగిపోయింది, నాకేం జరుగుతోందో నాకే తెలియదు అంటుంది సిరి… షణ్ముఖ్‌కన్నా మెంటల్… సేమ్, మానస- పింకీ జంట… అదో మరో ఎక్స్‌ట్రీమ్… ఈ కారణాలతోనే బార్క్ రేటింగుల్లో బిగ్‌బాస్ రేటింగ్స్ చంకనాకిపోయాయ్… చివరకు నాగార్జున వచ్చి గంటల కొద్దీ ఏదేదో వాగేస్తున్నా సరే, సండే-సాటర్ డే వీకెండ్ షోలు కూడా పైకి లేవడం లేదు… మొత్తానికి ఈసారి సీజన్ ఓ ఫ్లాప్ షో… జనానికి కూడా ఆసక్తి సచ్చిపోయింది, అవే పాత టాస్కులు, అవే పిచ్చి స్ట్రాటజీలు… ఓ కొత్తదనం లేదు, థ్రిల్ లేదు… ఎందుకొచ్చిన షోరా బాబూ అని జనం చానెల్ మార్చేస్తున్నారు… వెరసి నాగార్జున ఇజ్జత్ పోతోంది… మాటీవీ పరువు పోతోంది… ఎవరెవరు టాప్ 5 లో ఉంటారనే ఆసక్తి కూడా జనంలో చచ్చిపోయింది… ఓ పని చేయండ్రా… ప్రియాంక, షణ్ముఖ్, సిరిలను టాప్ త్రీ అని ఖరారు చేసి, ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించి, ఏదో పిచ్చి ఎపిసోడ్స్ నడిపించేస్తారుగా… అదిక స్టార్ట్ చేసేయండి… అన్నట్టు, ఫినాలేకు అదే చిరంజీవిని పిలవండి, మరిచిపోకండి…!!
Share this Article