.
అవునూ, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూశారా..? చూసే ఉంటారు లెండి, ఎంతోమంది చూడకపోతే 250 కోట్లు ఎలా వస్తయ్ మరి… అదీ ఒక్క తెలుగులోనే…
సరే, చాన్నాళ్లయింది కదా థియేటర్లలో కూడా తీసి, ఓటీటీలో పెట్టి… చెప్పుకోవచ్చు… ఎహె, రివ్యూ కాదు… రివ్యూయేతరాలు… వెంకటేశ్ మీద దర్శకుడు అనిల్ రావిపూడి పరోక్షంగా వేసిన సెటైర్లు, గోదావరి మార్క్ వెటకారాలు… అవీ కాస్త విశేషంగా అనిపించాయా మీక్కూడా…
Ads
సినిమా మైనస్సుల గురించి రాస్తూపోతే ఈ స్పేస్ సరిపోదు గానీ… దర్శకుడికి ‘‘ఆ రాత్రి పని’’ మీదే బాగా యావ ఉన్నట్టుంది… మొత్తం కథంతా దానిచుట్టే… వోకే వోకే, సినిమాలో బుల్లిరాజు అనే ఓ పిచ్చి కేరక్టర్ ఒకటి ఉంది తెలుసు కదా… ముదురు పోరడు, వాడి భాష, వాడి కేరక్టరైజేషన్ పరమ వెగటు…
ఏమిట్రా అంటే… వాడు ఓటీటీలు చూసీ చూసీ అలా ఆ వెగటు డర్టీ భాష నేర్చుకున్నాడని చెప్పించారు సినిమాలో… అన్ని ఓటీటీల భాష మీద సెటైర్ అని పైపైన అనిపించినా ఎందుకో అది వెంకటేశ్ విపరీతంగా బదనామైన రానానాయుడు వెబ్ సీరీస్ భాష మీద వేసిన సెటైర్ అనిపించేలా ఉంది… ఆ సీరీస్‌తో వెంకటేశ్ పాపం బాగా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు…
అదే ముదురు పోరడితోనే మరో సెటైర్ వేయించాడు దర్శకుడు వెంకటేశ్ డాన్సులు, స్టెప్పుల మీద… ‘‘తనకు వచ్చినవే నాలుగు స్టెప్పులు’’ అంటూ వెంకటేశ్ సిగ్నేచర్ స్టెప్పులు వేయించి చూపిస్తాడు దర్శకుడు… అవి తప్ప వెంకటేశ్ డాన్సుల్లో కొత్త స్టెప్పులేమీ ఉండవని ఇన్‌డైెరెక్ట్ చెణుకు… చురుకు…
వయస్సు మీద పడుతున్న హీరో కదా… కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ గట్రా ఆడ్‌గా ఉంటుంది కదా కొత్తతరం ప్రేక్షకులకు… సో, మీనాక్షితో సంభాషణల్లో… ఐశ్వర్యతో సంభాషణల్లో కూడా ఏజ్ బార్‌తనం మీద డైలాగ్స్ పెట్టించి మరీ… పర్లేదు, వయస్సు తేడా కూడా మంచిదే అనిపించాడు… ఏదో శుష్క వాదన… పరోక్షంగా వెంకటేశ్ ఏజ్‌నూ సినిమా కథలోకి లాక్కొచ్చాడు అనిల్ రావిపూడి…
ఎలా అంగీకరించాడో వెంకటేశ్… కానీ భలే అంగీకరించాడు స్పోర్టివ్‌గా…! మరొక్కటీ ఉందండోయ్… వయస్సు మీద పడుతోంది, మరీ నా సినిమాల్లో యాక్షన్ సీన్లు వద్దు, చేయలేను, మరీ అవసరమైతే ఏదో క్లైమాక్సులో ఒకటీరెండు చిన్న చిన్న యాక్షన్ సీన్లు అయితే వోకే అని వెంకటేశ్‌తో చెప్పించినట్టుగా ఉంది…
తను ఆపరేషన్‌లోకి దిగగానే… అప్పటిదాకా బాగానే ఉంటాడు పాపం… ఇక హీరో రంగంలోకి దిగాడు ఇక యాక్షనే అనుకునే దశలో… కదిలితే చాలు మెడ పట్టుకుంటుంది, భుజం పట్టుకుంటుంది… నడుం పట్టుకుంటుంది… ఇక నాకూ యాక్షన్ సీన్లకూ సరిపడదురోయ్ అని వెంకటేశ్ చెప్పుకుంటున్నట్టుగా దర్శకుడు భలే స్కెచ్ వేసి, మరీ అదే వెంకటేశ్‌తో అలా చెప్పించాడు…
(దృశ్యం వోకే.., ఎఫ్2, ఎఫ్3 వోకే.., సైంధవ్ పేరిట కిందామీదా పడితే ఫ్లాప్… ఫ్యామిలీ టచ్ ఉండాలి తప్ప ఈ వయస్సులో యాక్షన్లు వద్దు అని జనమే తేల్చిచెప్పినట్టయింది… ఒరే, ఇలాంటి కథలే నాకు చెప్పండ్రోయ్ అన్నట్టుగా…)
అనిల్ రావిపూడి తెలివైన దర్శకుడే… అందరికీ తెలుసు… కానీ ఒక స్టార్ హీరోతో… తన స్టెప్పులు, తన వెబ్ సీరీస్ భాష, తన ఏజ్, తన ఫిట్‌నెస్ మీద తనతోనే సెటైర్లు వేయించడం… నువ్వు మాగొప్ప తెలివైన దర్శకుడివయ్యా… ఏమో అనుకున్నాం గానీ…!!
అవునూ… ఈమధ్య టీవీ షోల్లో తలతిక్క వేషాలతో వెగటు పుట్టిస్తున్న అనంత శ్రీరామ్ ఏం రోల్ వేశాడు, దాని దుర్గతి ఏమిటనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… చివరికి సాయికుమార్ స్టోన్ మీద కూడా కొన్ని సెటైర్స్ …
Share this Article