Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లా… విడాకులా… నాన్సెన్స్.., జస్ట్, కొన్నాళ్లు కలిసి ఉన్నాం అంతే…

March 19, 2024 by M S R

మీకు తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి యవ్వారం గుర్తుంది కదా… ఓ ధనిక వ్యాపారి నిఖిల్ జైన్‌ను టర్కీలో (డెస్టినేషన్ మ్యారేజ్) పెళ్లి చేసుకుంది… ఏడాదిలో గొడవలు… దూరంగా ఉంటున్నారు… ఆయన గారు విడాకులకు అప్లయ్ చేస్తే, అసలు మాది పెళ్లే కాదుఫో అనేసింది… టర్కీలో పెళ్లి జరిగింది, అక్కడి చట్టాల ప్రకారం మా పెళ్లికి గుర్తింపు లేదు, ఇండియాలో పెళ్లిని రిజిష్టర్ చేసుకోలేదు కాబట్టి ఆ పెళ్లే జరగనట్టు లెక్క… జరగని పెళ్లికి విడాకులేంటి అంటోంది… అసలు కథేమిటీ అంటే… తను యష్‌దాస్‌గుప్తా అనబడే ఓ బీజేపీ నాయకుడు కమ్ యాక్టర్‌తో తిరుగుతోంది…

మీకు పెళ్లి అనే సినిమాలో రుక్కు రుక్కు రుక్కమని రమణి సుగుణమణి అనే హిట్ పాట గుర్తుందా..? నటుడు పృథ్విరాజ్ అనగానే ఇద్దరు నటులు తెలుగు ప్రేక్షకులకు గుర్తొస్తారు, ఒకరు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి… మరొకరు ఈ రుక్కు రుక్కు పృథ్వి… అలియాస్ బబ్లూ పృథ్విరాజ్… తమిళ, మలయాళ, తెలుగు సినిమాలు చాలా చేశాడు… మొన్న యానిమల్‌లో కూడా చేశాడు… టీవీ సీరియల్స్ సైతం…

వయస్సు 57 ఏళ్లు… కానీ మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుంటాడు… ఆమధ్య ఏదో ఈటీవీ స్కిట్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమై షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ ప్రదర్శించాడు… నేను స్టిల్ యంగ్ యునో అన్నట్టుగా…

Ads

ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు… అదేమిటీ అంటే, తన సహజీవని శీతల్‌తో విడిపోయాడు… తాము విడిపోవడం మీద శీతల్ చేసిన వ్యాఖ్య చదవగానే… టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ చేసిన టర్కీ పెళ్లి వ్యాఖ్యే గుర్తొచ్చింది… శీతల్ ఏమంటోంది అంటే..? ‘‘పృథ్వితో నాకు పెళ్లేమిటి..? ఎప్పుడు జరిగింది..? అంతా ట్రాష్… జస్ట్, కొన్నాళ్లు కలిసి సహజీవనం చేశాం, మంచి మెమొరబుల్ డేస్, కానీ కొన్ని విషయాల్లో తనతో నాకు సరిపడదని అర్థమైంది, అంతే విడిపోయాం, ఇందులో విడాకుల ప్రస్తావన దేనికి..? అసలు పెళ్లంటూ జరిగితే కదా’’ అని లైట్ తీసుకుంది…

నిజానికి పృథ్వి అప్పుడెప్పుడో 1994లో… అంటే 30 ఏళ్ల క్రితం వీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు… చాలా ఏళ్లు బాగానే ఉన్నారు… జబ్బర్ అనే కొడుకు కూడా పుట్టాడు… కొన్నేళ్లుగా వారికి పడటం లేదు… ఆరేళ్లు విడివిడిగా ఉన్న తరువాత అధికారికంగా విడాకులు అయ్యాయి… మలేషియాలో ఉంటే మన తెలుగమ్మాయి శీతల్‌తో ఎక్కడో పరిచయం ఏర్పడింది… బంధం ఏర్పడింది… అతుక్కుపోయారు… ఇద్దరి నడుమ వయస్సు తేడా జస్ట్, 33 ఏళ్లు…

ఇదేమిటమ్మా, ఇంకెవరూ దొరకలేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు వెక్కిరించినా సరే… ప్రేమబంధం వయస్సు తేడాను పట్టించుకోదు అంటూ వెండితెర వంగిపోయే రేంజ్ బరువైన డైలాగులు చెప్పింది శీతల్… ఏడాదిగా వారి బంధం తెగిపోయినట్టు రూమర్స్ వస్తున్నాయి… ఒకరి వీడియోలను మరొకరు తమ సోషల్ ఖాతాల్లో డిలిట్ కొట్టేసుకున్నారు… రీసెంటుగా ఆమె ఇలా ‘జస్ట్, సహజీవనం మాత్రమే, ఆ చాప్టరూ క్లోజ్’ అనేసింది… అఫ్‌కోర్స్, ఇండస్ట్రీలో ఇలా కలవడాలు, విడిపోవడాలు చాలా కామన్… కాకపోతే మరీ శీతల్ ఇంత తేలికగా తీసిపారేయడం పెళ్లిళ్లు, బంధాల మీద ప్రస్తుత జనరేషన్ తారల వైఖరులకు అద్ధం పట్టినట్టుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions