M.g. Uday Kiran… అనే మిత్రుడు యానిమల్ అనే సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ పోస్టులో పెట్టిన కామెంట్ ను ఓసారి చదవండి…
‘సార్… ఏమి బాగుంది సార్ సినిమా… అసలు బాగాలేదు నాకు నచ్చలేదు… Family వాళ్ళని తీసుకుని ఎవ్వరూ ఈ సినిమా కి వెళ్ళకండి… తమ్ముడు చనిపోయాడు అని తెలిసి అన్న తన 3వ పెళ్ళాంతో సంభోగం చేస్తాడు, తరువాత మొదటి, రెండవ పెళ్లాలతో కలసి ముగ్గురిని కలిపి చేస్తా అని చెపుతాడు… ఇది ఒక సీన్ లో… ఇక ఇంకో సీన్ లో అన్న చనిపోయాడు అనీ, అన్న మూడవ భార్యకి అప్పుడే కవలలు పుట్టారు అనీ, నీవు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకో నిన్ను నేను సాదుతా అంటాడు.
ఇలా విలన్స్ క్యారెక్టర్… ఇగ హీరో ది క్యారెక్టర్ గురించి మాట్లాడుదాం. హీరోకి గుండె ఖరాబ్ అయ్యింది.వేరే ఒక్కరి గుండె పెట్టాలి అని అంటే చనిపోయిన ఒక వ్యక్తి గుండె తీసుకోని వచ్చి పెడతారు.. మళ్ళీ బతికిన హీరో ఆ చనిపోయిన పర్సన్ భార్య వచ్చి మాట్లాడితే ఆమెతో సంభోగం చేస్తాడు.
Ads
ఇంకా వీళ్ళకి తగ్గట్టు హీరోయిన్ క్యారెక్టర్… భర్త నేను వేరే ఆమెతో సంభోగించాను అంటే, కండోమ్స్ వాడినవా. నేను కూడా వేరే వారితో ఉంటా అంటూ గొడవ పెట్టుకుంటుంది. ఇగ హీరో వాళ్ళ నాన్నలాగా డూప్లికేట్ మనిషిని తయ్యారు చేస్తే, మా నాన్న మూత్రం పోసేది తాను మూత్రం పొసేటప్పుడు ఎడమ చేతితో పట్టుకుంటాడు. ఈయన కుడి చేతితో పట్టుకుంటున్నాడు అంటూ డైలాగ్ లు… ఇగ చివరికి సినిమాకి సంబంధం లేకుండా సినిమాను విమర్శ చేసే వారికీ నాకు దీనితో సమానం అంటూ సిగ్నల్ చూపెట్టే డైరెక్టర్ పైత్యం… ఇలా ఏ దశలో కూడా సినిమా నాకు నచ్చలేదు సార్..’’
అర్థమైంది కదా… సినిమా పోకడ ఏమిటో తెలిసింది కదా… ఇది ఓ రియలిస్టిక్ రివ్యూ… అర్జున్‌రెడ్డి చూశాం కదా… అరాచకమైన సినిమా… అదెందుకు హిట్టయిందో ఓ పెద్ద మిస్టరీ… అదే గుర్తుంది కదా, చెడ్డీలో ఐస్ ముక్కలు, అరుపులు, తాగుడు… అత్యంత బేకార్ కేరక్టరైజేషన్… అవును మరి, సదరు దర్శకుడు గారు బాలీవుడ్ దాకా ఎక్కాడు కదా… అదే ధోరణి… అదే పైత్యం…
యానిమల్ అనే సినిమాలోనూ అదే ప్రదర్శించాడు… పైగా తానేం చేసినా, ఏం చూపించినా ప్రేక్షకులు పిచ్చి ఎదవలు భరిస్తారు అనుకునే అర్జున్‌రెడ్డి తరహా కేరక్టరే తనది కూడా… మూడున్నర గంటల సినిమా ఏమిట్రా బాబూ..? పైగా వయెలెంట్… పిల్లలు, ఫ్యామిలీతో గనుక వెళ్తే అడ్డంగా బుక్కయిపోతారు… కేంద్రం స్పందించి (సినిమాల మీద తనకు నియంత్రణ గనుక ఉందీ అనుకుంటే… అంత సోయి మోడీ ప్రభుత్వానికి లేదు, బట్ ఆశ)… ఈ సినిమా ఓటీటీ లేదా టీవీల్లో రాకుండా చేస్తే ఓ రకమైన కాలుష్యం నుంచి రక్షించినవారవుతారు… గమనించ ప్రార్థన…
రణబీర్ కపూర్ ఏ మంటలో కాలిపోతేనేం గానీ… రష్మిక మంథన పుష్పతో వచ్చిన నేషనల్ ఇమేజీ కాస్తా ఇలాంటి కేరక్టర్లతో భ్రష్టుపట్టిపోవడం గ్యారంటీ… యానిమల్ అని దర్శకుడు సందీప్‌రెడ్డి, హీరో రణబీర్ కపూర్ తమ జంతుప్రవృత్తిని బాగానే బయటపెట్టుకున్నారు గానీ… నిజానికి మెంటల్ అని టైటిల్ పెట్టి ఉంటే మరింత ఆప్ట్‌గా ఉండేది…!!
————
అర్జున్ రెడ్డి లో స్త్రీ ద్వేషము చులకన భావం వుంటాయి
ఆనిమల్ అంతా సైకోపాతిక్ బిహేవియర్
ఆల్ఫా మేల్ అని చావ దొబ్బాడు సినిమా అంతా ఆల్ఫా అంటే సైకో కాదు నాయనా…డామినేటింగ్ పెర్సొనాలిటీ వుంటది..aggressive వుంటారు.. నాయకత్వ లక్షణాలు కూడా. చానా మందికి నచ్చుతార ఈ పెర్సొనాలిటీ టైపు వారు…. Shyla, USA
Share this Article