.
ఏమాటకామాట… నార్త్ ఇండియన్లకు సౌత్ ఇండియా సింగర్స్ అంటే వివక్ష… ఏదో సాంబార్ వాసన, ద్రవిడ యాస వినిపిస్తుందని కుంటి సాకులు… కానీ అసలు కారణం మనవాళ్లను సహించరు… అంతటి బాలసుబ్రహ్మణ్యానికీ బోలెడు పొగబెట్టారు కదా…
సినిమా పాటల పోటీల్లో టాప్ టీవీ ప్రోగ్రామ్ ఇండియన్ ఐడల్ హిందీ… ఇప్పుడు నడుస్తోంది 15వ సీజన్… నిజానికి దక్షిణాది గాయకుల్లో మన వాళ్లే కాస్త నయం… మన ప్రాతినిధ్యం బాగానే ఉంటోంది… హిందీ గాయకులను ఢీకొట్టి మనవాళ్లు కప్పులు కూడా కొట్టారు కదా…
Ads
13 వ సీజన్‌లో ఎవరూ సౌత్ సింగర్స్ లేరు… 12 వ సీజన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు మన తెలుగు వాళ్లు… ఇద్దరూ వైజాగ్ నుంచే షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల (ఈమె సోదరి సౌజన్య తెలుగు ఇండియన్ ఐడల్ ఒక సీజన్ విజేత)… నిజానికి షణ్ముఖప్రియ బలమైన పోటీ ఇచ్చింది గానీ నార్త్ ఇండియన్ నెటిజన్ల నెగెటివిటీ, వివక్ష కారణంగా ఆరో ప్లేసులో నిలబడాల్సి వచ్చింది…
10, 11వ సీజన్లలో సౌత్ సింగర్స్ లేరు… 9వ సీజన్ మళ్లీ మన తెలుగు వాళ్లకు కాస్త నయం… రేవంత్ విన్నర్ కాగా, రోహిత్ సెకండ్ రన్నరప్… జూనియర్స్ సీజన్2 లో ముగ్గురు, సీజన్1లో ఒక్కరు సౌత్ ఇండియన్స్… సీజన్1 విజేత కూడా… 6వ సీజన్‌లో సౌత్ కంట్రిబ్యూషన్ లేదు… 5వ సీజన్‌లో మన శ్రీరామచంద్ర విన్నర్… 2వ సీజన్‌లో మన కారుణ్య ఫస్ట్ రన్నరప్… ఫస్ట్ సీజన్‌లో ఒకరే సౌత్ సింగర్…
సో, మొత్తం 14 సీజన్లకు గాను మొత్తం సౌత్ నుంచి పాల్గొన్నది కేవలం 12 మంది… అందులో ఆరుగురు మన తెలుగువాళ్లే… ఇంట్రస్టింగు… ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా…? మరో గానకెరటం ఇప్పుడు ఈ 15 వ సీజన్ ఫైనలిస్టుగా పోటీపడుతున్నాడు… పేరు అనిరుధ్ సుస్వరం… ఊరు కర్నూలు…
తను మద్రాస్ ఐఐటీయన్… కొన్నాళ్లు పేపాల్‌లో పనిచేశాడు… చిన్నప్పటి నుంచీ పాటలంటే ఇష్టం… గతంలో సూపర్ సింగర్ ఫైనలిస్టు కూడా… ఈటీవీ స్వరాభిషేకంలో కూడా సీనియర్ గాయకులతో పాడుతూ కనిపించేవాడు…
తను తెలుగు ఇండియన్ ఐడల్‌లో కూడా పార్టిసిపేట్ చేశాడు… కానీ థమన్, గీతామాధురి తాలూకు రాగద్వేషాలు మన్నూమశానం తెలుగు కదా… ఈ షోను చెడగొట్టారు… అనిరుధ్ కూడా గెలవలేదు… నేరుగా హిందీ ఇండియన్ ఐడల్ షో ఆడిషన్ వెళ్లాడు… ఇదుగో అందరినీ రంజింపచేస్తూ ఫినాలేకు వచ్చాడు… ఆరుగురిలో ఒకడిగా…
వోట్లు కీలకమే… కానీ సౌత్ జెండా పట్టుకుని ఆ వేదిక మీద పాడటం, నిలబడటం కూడా ఓ అచీవ్‌మెంటే కదా… సో, గెలుపో కాదో జానేదేవ్… అక్కడికి వెళ్లామా, పాడామా, చప్పట్లు కొట్టించుకున్నామా లేదానేదే ముఖ్యం… సమంత చెప్పినట్టు సక్సెస్ అంటే కప్పు కొట్టడమే కాదుగా… ప్రయత్నమే ముఖ్యం… సో, ఆల్ ది బెస్ట్ అనిరుధ్ సుస్వరం… ఇంటిపేరులోనే ఉందిగా సు- స్వరం..!!
ఫినాలేను వారంపాటు వాయిదా వేశారు… ఈసారి కోల్‌కత్తాకు చెందిన ఇద్దరు గాయకులు… అందులో మానసి ఘోష్ అదరగొడుతోంది… అనిరుధ్‌కు పోటీ బలంగానే ఉంది సుమా..!!
Share this Article