.
వ్యంగ్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి… ఇలాంటివాళ్లు అసలు సినిమా పరిశ్రమకు ఎందుకొస్తారు అని..!
నిజమే కదా… మన తెలుగు సినిమా పిచ్చికూతగాళ్లు వేదిక మీదకు తాగొచ్చి ఏదేదో వాగుతుంటారు… ప్రత్యేకించి మహిళా నటుల గురించి కూడా…
Ads
వాడెవడో ఆమధ్య హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తున్న ఓ నటి సైజుల గురించి కూడా స్టేజ్ మీద ఏదో కూశాడు, తెలిసిందే కదా… జస్ట్ ఓ ఉదాహరణ…
కానీ ఈ వార్త చదవండి ఓసారి …. హర్యానా మ్యూజిక్ వీడియోలకు ప్రసిద్ధి నటి అంజలి రాఘవ్… భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… ఇటీవల లక్నోలో జరిగిన ఒక ఈవెంట్‌లో పవన్ సింగ్ ఆమె నడుమును అసభ్యంగా తాకాడని ఆరోపించింది… ఈ సంఘటన తర్వాత, ఆమె భోజ్‌పురి పరిశ్రమను వీడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది…
నిజమే, ఇకపై అసలు భోజ్‌పురి సినిమాల్లో నటించను అని తేల్చేసింది… అరె, ఎవడో ఒకడు అలా చేశాడని, మొత్తం ఓ ఇండస్ట్రీనే వదిలేస్తే నీకే నష్టం, వాడిదేం పోయింది? మరో పదిమందిని తెచ్చుకుంటాడు అనే విమర్శలూ వినిపిస్తున్నాయి… అసలేం జరిగింది?
‘సయ్యా సేవ కరే’ అనే పాట ప్రచారం కోసం లక్నోలో నిర్వహించిన ఈవెంట్ అది… అందులో అంజలి, పవన్ పాల్గొన్నారు… ఈ సందర్భంగా పవన్ సింగ్ ఆమె నడుమును అసభ్యంగా తాకాడు… ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోపాటు, అంజలికి ప్రజల నుంచి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి…
“అక్కడే వాడిని ఎందుకు ఈడ్చి కొట్టలేదు?”, “పైగా వాడు తాకుతూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వే కదా నవ్వుతున్నావు..? అంటే ఆమోదిస్తున్నట్టేనా..? పైగా ఇప్పుడు భోజ్‌పురి ఇండస్ట్రీని బహిష్కరిస్తున్నట్టు ఈ కన్నీళ్లు, ప్రకటనలు దేనికి..?’’ ఇవీ ప్రశ్నలు…
రీజనబుల్ క్వశ్చన్స్… తాను నవ్వుతోంది ఆ వీడియోలో… ‘‘నో నో… జరిగింది ఏమిటంటే..? వేదికపై పవన్ సింగ్ తన చీరకు ఏదో అంటుకుందని సరదాగా చెప్పడంతో, మొదట అది చీర ట్యాగ్ అయి ఉంటుందని భావించాను… అందుకే, ఆమె నవ్వి, ప్రసంగాన్ని కొనసాగించాను….
ఈ విషయంపై వెనక వేదికపై మాట్లాడాలనుకున్నా, పవన్ సింగ్ రీల్స్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు… పవన్ సింగ్ పిఆర్ టీం చాలా బలంగా ఉంది.., సో, ఈ విషయం గురించి పోస్ట్ చేయవద్దని నా స్నేహితులు సలహా ఇచ్చారు… అందువల్ల, ఈ విషయం సద్దుమణిగిపోతుందని వేచి చూశాను, కానీ రోజురోజుకీ పెరిగిపోయింది…’’ అని ఏదో వివరణ ఇస్తోంది ఆమె… కానీ అక్కడ అలా లేదు.,.
“ఎవరి అనుమతి లేకుండా, ఏ అమ్మాయినైనా తాకడం చాలా తప్పు… ముఖ్యంగా ఇలాంటివి హద్దులు దాటి చేసే చర్యలు చాలా చాలా తప్పు… ఒకవేళ ఇదే సంఘటన హర్యానాలో జరిగి ఉంటే, అక్కడి ప్రజలే దీనికి సమాధానం ఇచ్చేవారు, నేను ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు… నేను ఇకపై భోజ్‌పురి పరిశ్రమలో పనిచేయను…” అని అంజలి చెబుతోంది…
ప్చ్… ఇంత సున్నితం మనిషి తెలుగులోకి వస్తే… ఇక్కడ హీరోల తాకిడిని తట్టుకోగలదా ఫాఫం… ఓ హీరో అయితే వెనుక నుంచి పిరుదులపైనే వాయిస్తాడు సక్సెస్ మీట్లలో..!! ‘‘గిల్లితే గిల్లించుకోవాలి’’ అనే టైపు ఇక్కడ..!!
Share this Article