.
ఉంటుంది… ఖచ్చితంగా తేడా ఉంటుంది… పాలకుడి బాడీ లాంగ్వేజీ, వ్యవహారశైలి… ప్రత్యేకించి మతానుసరణ, ఆధ్యాత్మిక అంశాల్లో పాలకుడి ధోరణి ఖచ్చితంగా ఎంతోకొంత ప్రజల పరిశీలనలో ఉంటాయి…
సూటూ బూటూతో జెరూసలెం పోయినా సరే, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఐనా సరే… ధోవతి కట్టి, అచ్చ తెలుగు ఆహార్యంలో కనిపించిన వైఎస్ మీద మతసంబంధ విమర్శలు ఎప్పుడూ రాలేదు… చివరకు ఏడుకొండలపై హిందూ వ్యతిరేకత కనబరిచినా సరే…
Ads
కానీ జగన్..? ఎప్పుడూ ధర్మపత్నితో కలిసి తిరుమలకు రాలేదు… నెత్తి మీద పట్టువస్త్రాలు సరే, నొసటన బొట్టు సరే… భారతి తన వెంట లేదు… డిక్లరేషన్ వివాదం వచ్చినప్పుడు తోసిపుచ్చాడే తప్ప అక్కడి ఆచారాన్ని గౌరవిస్తాను అనే మాట రాలేదు…
కానీ తనే స్వరూపానందుడితో యాగాలు చేయిస్తాడు రుషికేష్‌లో… పంచాంగ శ్రవణాలు చేయిస్తాడు… పుష్కర స్నానాలు చేస్తాడు… చిత్రమైన కేరక్టర్ తను… సీన్ కట్ చేస్తే కూటమి నేతల సంగతి చూద్దాం ఓసారి…
గతాన్ని వదిలేద్దాం కాసేపు… తను ఏకంగా బాప్టిజం తీసుకున్నానని ప్రస్తుత వీర సనాతన ధర్మపరిరక్షణ అవతారుడు పవన్ కల్యాణ్ అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తు… తన భావాలు, నిర్ణయాలు, ఆచరణ చంచలం కాబట్టి గతాన్ని వదిలేస్తే…
తన మూడో భార్య రష్యన్… అన్నా లెజినెవా ఆమె పేరు… కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్…. మొన్న సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఇండియాకు తీసుకొచ్చారు తనను… గుడ్… గాడ్ బ్లెస్ హిమ్… తాజాగా కొన్ని ఫోటోల్లో ఏం కనిపించిందంటే..?
తిరుమలకు వెళ్లడానికి అన్నా లెజినెవాతో డిక్లరేషన్ మీద సంతకం చేయించారు… ఒక పద్ధతిని గౌరవించడం అంటే అదీ… నచ్చింది… తలనీలాలు ఇచ్చింది… అబ్బే, అందులో ఏముందండీ అంటారు కొందరు… ఏమీ లేనప్పుడు భారతి జగన్ వెంట ఎందుకు కనిపించలేదు…
అవసరమైతే ఇంటి దగ్గరే తిరుమల సెట్టు వేయించి మరీ ఆడంబరాన్ని, అట్టహాసాన్ని ప్రదర్శించిన జగన్ సతీసమేతంగా తిరుమలకు ఒక్కసారైనా ఎందుకు వెళ్లలేదు..? ప్రజల మనోభావాల్ని లైట్ తీసుకోవడం… ఇలాంటివి ఎప్పుడో దెబ్బతీస్తాయి, తీశాయి…
చంద్రబాబు విషయానికొద్దాం… శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు బూట్లతోనే కనిపిస్తాడనే విమర్శ ఉంది… కానీ తన చర్మ అనారోగ్యం రీత్యా కాళ్లు, చేతులను తను జాగ్రత్తగా మెయింటెయిన్ చేసుకోవాలట… నిన్న ఒంటిమిట్టకు రాములోరి కల్యాణోత్సవానికి భువనేశ్వరీ సమేతంగా వెళ్లి పట్టువస్త్రాలు, తలంబ్రాలు మోసుకెళ్లాడు…
ఎస్, తప్పకుండా చంద్రబాబు పట్ల కాసింత పాజిటివిటీని పెంచేదే అది… కొడుకు, కోడలు, భార్య, మనమడితో తిరుమలకు వెళ్తాడు తను… సరే, ఇక మనం ఓసారి భద్రాచలం వెళ్దాం… కేసీయార్ తన అధికారం మొదట్లో ముత్యాల తలంబ్రాలను తీసుకెళ్లినట్టు గుర్తు… తరువాత భద్రాచలాన్ని వదిలేశాడు… కేవలం యాదగిరిగుట్ట… అదేం పద్ధతి..?
పాలకుడు ముత్యాల తలంబ్రాలను తీసుకెళ్లడం ఆనవాయితీ… తెలంగాణ ప్రజానీకానికి కేసీయార్ ధోరణి నచ్చలేదు,.. పైగా కుటుంబం తరఫున అన్నట్టుగా మనమడితో తలంబ్రాలు పంపించాడు ఓసారి… నేనేం చేసినా చెల్లుతుందనే ధోరణి… గత ఎన్నికల్లో రాముడు శపించాడు…
రేవంత్ రెడ్డి ఏం చేశాడు..? చక్కగా భార్యతో కలిసి రాములోరి కల్యాణానికి వెళ్లాడు… ముత్యాల తలంబ్రాలను మోసుకెళ్లాడు… ఏతావాతా ఇవన్నీ చిన్న చిన్న అంశాలుగా కనిపించవచ్చుగాక… కానీ జనం ప్రతి చిన్న విషయాన్నీ గమనిస్తూనే ఉంటారు… అదీ చెప్పాలనుకున్నది…
Share this Article