Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నా మలై..! తన కొత్త పొలిటికల్ జర్నీలో రజినీకాంత్ కూడా..?!

June 6, 2026 by M S R

.

అన్నా మలై… ఈ పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చర్చనీయాంశం… ఎందుకంటే..? తమిళనాడులో మిగతా బీజేపీ నేతలంతా (ప్రత్యేకించి ఓ నలుగురు) నయాపైసా పనికొచ్చే పని చేయలేని స్థితిలో అన్నా మలై ఒక్కడే కొద్దోగొప్పో బీజేపీ ఉనికి బలంగా చాటాడు… తను రాజీనామా చేశాడు, సొంతంగా ఓ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాను, ఓ పార్టీ పెడతాను, సొంతంగా పోటీ చేస్తాను అని ప్రకటించేశాడు…

కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది… బీజేపీతో సామరస్యంగా విడిపోయాడు… దాని వెనుక రాజకీయాలు అంత సాఫీగా ఉండవు, ఏదో మర్మం ఉంటుంది, ఉంది… అది అమిత్ షాకు అన్నా మలైకి మాత్రమే తెలుసు… ఇటు విజయ్ ప్రభుత్వానికి దినదినగండం, అసలే ఉదయనిధి మూర్ఖపు పోకడలు, దెబ్బతిన్న స్టాలిన్ నైరాశ్యం…

Ads

విజయ్ ప్రభుత్వానికి మనుగడ పాత డీఎంకే కూటమి సభ్యులే… కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే ఎట్సెట్రా… అందరూ స్టాలిన్ చెప్పినట్టు ఆడేవాళ్లే… ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో చెప్పలేం… ఈ స్థితిలో తమిళ రాజకీయాల్లో స్పేస్ ఏర్పడుతోంది… అన్నా మలై ఆ స్పేసులోకి దూరిపోదామని చూస్తున్నాడు… నో డౌట్, బీజేపీ పరోక్ష మద్దతు… తను పక్కా జాతీయవాది, తమిళ అస్థిత్వవాది…

నిజానికి 2025 డిసెంబర్ నెలలోనే అన్నామలై బీజేపీని వదిలేస్తున్నట్టు హైకమాండ్‌కు చెప్పాడు… నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, తమిళిసై తదితరులతో ఏమీ ఒరగదని తెలుసు, పైగా తనకు అడుగడుగునా అడ్డుపడే కేరక్టర్స్, మరోవైపు బీజేపీ కూటమిలోని అన్నాడీఎంకే పళనిస్వామికి అన్నామలై అంటే పడదు… సో, పళనిస్వామి చెప్పగానే అన్నామలైని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసేశారో తనకు అర్థమైంది…

ఇక బీజేపీలో పాము చావదు, కర్ర విరగదు అని… అప్పుడే చెప్పాడు… కానీ ఆగమన్నారు… ఆగాడు, ఇప్పుడిక బయటికి వచ్చేస్తున్నాడు… విజయ్‌కు చర్చి ఆర్థికసాయం చేస్తుంది, మరి అన్నామలైకి..? కొన్ని వార్తల ప్రకారం… జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నా మలైకి ధన సహాయం చేస్తాడు..! అందుకే పని కట్టుకొని మరీ మోడీ JOHO ని ప్రమోట్ చేశాడు…

అన్ని లెక్కలు బేరీజు వేసుకున్నాకే అన్నా మలై బీజేపీని వీడి స్వంత పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు… సొంతంగా రాజకీయాలు పెద్ద టాస్క్ అని అన్నా మలైకి తెలుసు, కానీ తనకు ఫైటింగ్ స్పిరిట్ ఉంది… రాజ్యసభ సభ్యత్వం వద్దు, నేను తమిళజనం మధ్యే ఉండి పోరాడతాను అని స్పష్టంగా చెప్పాడు అమిత్ షాకు… విజయ్ జోసెఫ్ ఎంత త్వరగా విఫలమైతే అన్నా మలైకి అంత చాన్స్… ప్రస్తుతం సెంగొట్టయన్ అనే వ్యక్తి మీద ఆధారపడి ఉన్నాడు విజయ్…

KA సెంగొట్టయన్ వయసు 78 ఏళ్ళు..! 5 దశబ్దాలుగా AIADMK పార్టీతో అనుబంధం ఉంది..! అన్నాదురై, MGR, జయలలితలతో కలిసి పనిచేసాడు. కొంగునాడుకి చెందిన సెంగొట్టియన్ 1977 లో సత్యమంగళం నుండి మెదటిసారిగా MLA గా ఎన్నికై ఇప్పటి వరకూ 9 సార్లు గెలుస్తూ వచ్చాడు! AIADMK నాయకులు నిర్లక్ష్యం చేయడంతో విజయ్ జోసెఫ్ దగ్గరికి చేరాడు..! ప్రస్తుతం విజయ్ మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు..! పళనిస్వామి వల్ల జరిగిన నష్టాల్లో ఇదీ ముఖ్యమే…

తను విజయ్‌కు అండగా ఉన్నన్ని రోజులూ విజయ్ సర్కారును ఎలాగోలా మేనేజ్ చేస్తాడు తను… కానీ..? స్టాలిన్ అంత తేలికగా వదిలేరకం కాదు… మరోవైపు అమిత్ షా పావులు వేరే చోట చకచకా కదలుతున్నాయి… సుప్రియా సూలే, కనిమోళిలని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని టాక్! ఇప్పుడప్పుడే బయటికి కనిపించని వ్యూహం…

మరోవైపు జోసెఫ్ విజయ్ భార్యని బీజేపీలోకి చేర్చుకొని విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయించాలనే వ్యూహం కూడా ఉందని టాక్! అయితే తమిళ ప్రజలు ఇలాంటివి పట్టించుకోరని MGR, జానకి రామచంద్రన్, జయలలిత విషయంలో తెలిసిపోయింది కదా!

రజినీకాంత్ సంగతి… తను పిరికి, తనను వెంట తీసుకుని వెళ్లేవాళ్లు కావాలి… రీల్ హీరో, రియల్ జీరో… రాజకీయాల్లోకి ఇక రాను అంటూనే విజయ్ గెలుపు మీద అక్కసును, ఈర్ష్యను ప్రదర్శించాడు… స్టిల్, ఇంకా ఆశలున్నాయి… ఏదో ఆలోచనతో ఉన్నాడు గనుకే విజయ్ గెలవగానే స్టాలిన్‌ను కలిసి మంతనాలు చేశాడు… అన్నా మలైతో కలిసి నడుద్దాం అనుకున్నాడు మొదట్లో, అదే అడిగాడు… (విజయ్ చెబుతున్నదే)… కానీ అప్పట్లో కుదరలేదు… రేప్పొద్దున కూడా రజినీకాంత్ కూడా అన్నా మలైకి సపోర్ట్..!!

చివరగా… స్పేస్ ఉందా..? ఉంది..! రాసి పెట్టుకొండి, అన్నాడీఎంకే నిలువునా చీలిపోయి రెండు నామమాత్ర పార్టీలు మిగులుతాయి, విజయ్‌ను స్టాలిన్ భ్రష్టుపట్టిస్తాడు… మరో ప్రత్యామ్నాయం కావాలి తమిళజనానికి… దాన్ని అన్నా మలై పూర్తిస్తాడా లేదానేది కాలం చెబుతుంది…!!

rajnikant

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions