Shyla……. సినిమా మొదలయ్యే ముందు ఈమధ్య పోయిన సినీ ప్రముఖుల ఫొటోలకి చాలా టైం కేటాయించారు… అలాగే థాంక్స్ చెప్తూ పెద్ద లిస్ట్ లు … సినిమా బిగినింగ్ స్లో గా లేకపోయినా వుంది అనిపించటానికి నా వరకు కారణం ఇదే… అవును కంప్లైంటే!!
సినిమా సాంతం చూసాక అర్ధం అవుతుంది అంత లేసి థాంక్స్ లు గట్రా ఎందుకో … వాళ్ళందరి సినిమాల్లోంచి కొంచెం కొంచెం తీసుకుని.. అదే ఇన్స్పైర్ అయ్యి, కథ రాసుకుని వాళ్లకన్నా వాళ్ళు నటించిన చానా సినిమాల కన్నా బానే తీసాడు శ్రీకాంత్ ఓదెల… అన్ని సినిమాల్లానే అమ్మాయి ప్రమేయం, అంగీకారం లేకుండానే అన్నీ జరుగుతుంటాయి.. మారండయ్యా కొత్త తరం అయినా .. వాత పెట్టేసి వెన్న రాసినంత మాత్రాన నొప్పి మరచిపోలేము కదా…
Ads
ఇక పోతే సినిమాలో అబ్బాయిల జబ్బలు, తొడలు expose చేసి సమన్యాయం దిశగా అడుగేసాడు ఓదెల.. హీరోలే ఐటెంలు అని అర్ధం అన్నట్టు!! No complaints btw… అప్పుడెప్పుడో వచ్చిన శివ సినిమాలో శుభలేఖ సుధాకర్ చేజ్ సీన్ తర్వాత అంత బాగుందనిపించిన చేజ్ సీన్ తీసాడు శ్రీకాంత్ ఓదెల… ఫార్ములా డైరెక్టర్ లంతా పక్కకి తప్పుకోండబ్బా ఇంక.. ఆర్ట్ వాళ్ళు భీ!!
సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్ created మ్యాజిక్ ఇన్ సమ్ సీన్స్… ధరణిని మర్చిపోవటం కష్టం.. అంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఏమిస్తాను నాని నటనకి!! సింగల్ ఎక్స్ప్రెషన్ ఆక్టర్ అని ఇదే గోడ మీద బోలెడు సార్లు అన్నాను అసలే… కీర్తి సురేష్ ఎప్పటిలానే జీవించేసింది.. దీక్షిత్ షెట్టి అంట బాగున్నాడు, బాగా చేసాడు.. పిల్లలు ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా పాత్రల్లో ఇమిడిపోయారు…
కన్నడం వాళ్ళ కోసం సాయికుమార్ ని.. తమిళ్ కి సముతిరఖనిని .. మళయాళీల కోసం షైన్ చాకోని పెట్టి వేస్ట్ చేసాడు.. హీరోలను లేపటంలో టైం పెట్టి విలన్ ని అంతకన్నా ఎక్కువ లేపాలని మర్చిపోవటం బిగినర్స్ మిస్టేక్ క్రింద జమ కట్టి గ్రేస్ మార్క్స్ వేసేద్దాం కొత్త డైరెక్టర్ సాబ్ కి… అన్నట్టు, కాకులకి డిమాండ్ పెరుగుద్ది… e-కాకులని సరిగ్గా చూపేలా ప్రాక్టీస్ చెయ్యండయ్యా special effects people…
Share this Article