.
నిన్నటి నుంచీ మనం అభిలాష అనే సినిమా గురించి… ఉరిశిక్ష రద్దుకై అప్పట్లో ఓ లాయర్ చేసిన పోరాటం గురించి చెప్పుకున్నాం… ఆ సినిమా నిర్మాణ విశేషాలనూ చెప్పుకున్నాం…
నిజానికి అది ఓ కాజ్ సెంట్రిక్ నవల… రాసింది యండమూరి… ఓ బేసిక్ ఐడియాను పాపులర్ నవలకు అవసరమైన హంగుల్ని అద్ది ఎలా రాయబడిందో స్వయానా రచయితే ముందు మాటలో చెప్పుకున్నాడు…
Ads
ఓసారి అది చదవండి ముందుగా…
Veerendranath Yandamoori (నవల ముందు మాట) ‘‘ఉరి రద్దు’’ అభిలాష వెనుక…
విశాఖపట్టణం శారదా బేకరీ ఓనర్ ప్రసాద్ తాను చూసిన ఒక ఇంగ్లీష్ సినిమా ఆధారంగా అభిలాష కథ 1974లో చెప్పారు. దాన్ని నవలగా వ్రాయాలనే అభిలాష కలిగింది. పూర్తవటానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఈ ఏడు సంవత్సరాల్లోనూ చాలా దేశాలు ఉరిని రద్దు చేశాయి. మన దేశం ఇంకా ‘స్టే ఆర్డర్ల స్టేజీ’లోనే ఉంది.
ఈ నవలలో యథార్థ విషయాలకు నవలీకరణ కోసం కొంచెం మెలోడ్రామా ఆడవలసి వచ్చింది. ఉరికి ముందు రాత్రి డాక్టర్ పరీక్ష, ఖైదీకి స్నానం చేయించటం వగైరా… అలాగే కొన్ని డ్రమటిక్ లిబర్టీస్ తీసుకోవటం కూడా జరిగింది. రెండు నెలల్లో ఉరి తియ్యటం, ఆవేశంతో చేసిన హత్యకి ఉరిశిక్ష పడటం, సెంట్రీ ఆఖరి క్షణంలో జైలు లోపలికీ, బైటకీ పరుగెత్తటం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ మొదలైనవి.
ఈ విషయంలో రచయితకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి విమర్శకులు ఈ విషయంలో విరుచుకుపడవద్దని మనవి. అలాగే కోర్టులో జరిగే వాదోపవాదాలు ఎడిట్ చేయబడ్డాయి.. సౌలభ్యం కోసం.
ఉరికన్నా- కఠిన యావజ్జీవ కారాగార శిక్ష ఎక్కువ బాధాకరమైనది.
ఖైదీ మారటానికి కూడా వీలున్నది. ఉరి తీస్తారనే భయంవల్ల ఎవరూ హత్య చేయడం మానరు. క్షణికావేశం లోనో, తప్పించుకో గలమనే ధైర్యంతోనో చేస్తారు. ఉరి వల్ల సాధించేదేమీ లేదు. అందుకే ఎవరు అధికారంలో ఉండగా మన దేశంలో ఉరిశిక్ష రద్దు అవుతుందో- ఆ ప్రెసిడెంట్‌కీ- ప్రైమ్ మినిష్టర్‌కీ ఈ నవల అంకితం.
మనం ఇది చదువుతున్నాం… దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధింపును సమర్థించిన వార్తలు వస్తున్నాయి… ఎస్, వాళ్ల ఉద్దేశాలు వేరు… జస్ట్ డిబేట్ కోసం… వాళ్లకు ఉరి విధించొద్దు సరే… వాడేం మారతాడా..?
కసబ్ మారతాడా..? అఫ్జల్ గురు మారతాడా..? ఓ ఉన్మాదంలో పడి కొట్టుకుపోయే ఉగ్రవాదం… ఓసారి వాడి నేరం ఫిక్సయ్యాక ఇంకా కోర్టులు, విచారణలు వేస్ట్… అసలే ఇది భారతదేశం, ఏ కపిల్ సిబలో అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపులు తెరిపించి మరీ కాపాడే ప్రమాదం ఉంది…
సరే, ఆ అభిలాష కథకొద్దాం… ఓ సీరియస్ అంశాన్ని నవలీకరించడానికి డ్రమెటిక్ లిబర్టీ తీసుకున్నాను అంటున్నాడు రచయిత… పాపులారిటీ కోసం, చాలామందికి రీచ్ అవడం కోసం… తీరా దాన్ని సినిమాకరించడానికి మరింత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నాడు దర్శకుడు… అసలే పాపులర్ హీరో… స్టెప్పులు, ఫైట్లు ఎట్సెట్రా లేకపోతే హీరోయిజం లేదు కదా… పైగా చిరంజీవి…
సరే, గతం వదిలేయండి… ఇదే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసే తీసుకుందాం… నిందితుడి ఇంటెన్షన్ క్లియర్… కానీ మన న్యాయవ్యవస్థ అత్యంత భారీ గొప్పతనం తెలుసు కదా… ఇప్పటికి ఏళ్లు గడిచిపోయాయి… వాళ్లకు ఇంకా సుప్రీం ఉంది, ధర్మాసనం ఉంది, రాష్ట్రపతి క్షమాభిక్ష అప్పీల్ చాన్స్ ఉంది… కాలయాపన… ఏళ్లకేళ్లు…
ఈ స్థితిలో అభిలాష హీరో ఏం చేసేవాడు..? అర్జెంటుగా ఏ రెండు నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు, ఏర్పాట్లు అనేది అబ్సర్డ్… తను తెలివైనవాడు, పైగా లాయర్… సో, హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేవాడు… బెయిల్ తెచ్చుకునేవాడు… తన కాజ్ కోసం పోరాటం చేస్తూనే తన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీం దాకా వెళ్లేవాడు… ఉరిశిక్ష రద్దుకై తన పోరాటంపై తనపై జాతీయ దృష్టిని మళ్లించుకునేవాడు…
అంతేతప్ప, గవర్నర్… అర్ధరాత్రి పరుగులు… వాచ్‌మెన్ ఆపసోపాలు, వీథుల్లో పరుగులు ఉండేవి కావు… బట్, వోకే… ఒక నవల, ఒక సినిమా… పాఠకుడు, ప్రేక్షకుడి థ్రిల్ కోసం కొన్ని ఆర్టిఫిషియల్ అద్దకాలు తప్పవు… ఇదంతా జస్ట్, ఓ అకడమిక్ డిబేట్ మాత్రమే… అంతే…
Share this Article