.
సినిమా సెలబ్రిటీలందరూ అంతే… ఎవరూ శుద్ధపూసలు కాదు… సందర్భం వచ్చిన ప్రతిసారీ తమ నిజస్వరూపం చూపిస్తుంటారు… ఆహో ఓహో ప్రగతి అని మనం మొన్న అందరమూ చప్పట్లు కొట్టిన నటి ప్రగతి… వేదిక ఎక్కగానే నానా నీతులూ బోధించింది…
అంతేకాదు, ఇప్పుడు వేణుస్వామిని విమర్శిస్తోంది… అవ్వా, తల్లీ… నువ్వు కూడా ఎవరికీ మినహాయింపు కాదు… బరువులు ఎత్తగలిగావు గానీ… పరువు మోయలేని మనస్తత్వం కనిపిస్తోంది…
Ads
కాస్త వివరంగా చెప్పుకుందాం… ఎస్, వెయిట్ లిఫ్టింగుతో ఏవో పతకాలు సాధించింది, గుడ్… అక్కడి వరకూ వోకే… అభినందిద్దాం, చప్పట్లు కొడదాం… కాకపోతే అది మరీ ఘొప్ఫ ఘనత గాకపోయినా సరే, మన ఆంటీ కదా.,. (మళ్లీ ఇక్కడ మరో పంచాయితీ, ఆంటీ అంటే ఒప్పుకోరు ఎంత వయస్సొచ్చినా… అటు అనసూయ, ఇటు ప్రగతి)…
ఆమె ఏవో మెడల్స్ సాధించింది కదా… తరువాత కార్పొరేట్ సెలబ్రిటీ వామాచార పూజారి కమ్ జ్యోతిష్కుడు వేణుస్వామి ఏదో వీడియో పెట్టాడు… నా ఆశీస్సులు ఫలించాయి అని… సహజం… తనకు ప్రచారం కావాలి, తప్పు లేదు… అయితే తను ఏమైనా అబద్ధం చెప్పాడా అనేదే పాయింట్…
ఆమె వేణుస్వామిని ఆశ్రయించింది నిజం.., పూజలు చేయించుకున్నది నిజం… ఆశీస్సులు పొందింది నిజం… మరెందుకు ఈ కప్పదాట్లు, ఈ హిపోక్రసీ.,… ఎస్, వేణుస్వామి ఆశీస్సులే అని అంగీకరిస్తే నీ మెడల్స్ విరిగి కింద పడతాయా..? ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా..?
నువ్వు వేణుస్వామిని నమ్మకు, ఎవరూ నిన్ను అటు వైపు నెట్టేయరు… నీ ఇష్టం… నువ్వు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడేమో స్వాములు కావాలి, పూజలు కావాలి, ఆశీస్సులు కావాలి… ఏరు దాటక తెప్ప తగలేయాలి… తనెవడు అంటావా ఇప్పుడు..? ఇది కదా నీ అసలు సగటు తెలుగు సినిమా సెలబ్రిటీ తాలూకు కురూపం…
ఛట్, అవేమైనా ఒలింపిక్సా, ఆసియన్ పోటీలా..? జాతీయ పోటీలా అని ఎవడూ రంధ్రాన్వేషణ చేయడం లేదు కదా… మన మహిళ ఏదో సాధించిందిలే అని కదా అందరూ చప్పట్లు కొట్టింది… అది మరిచిపోతే ఎలా..? ఈ వార్త చదవండి…

‘‘పూజల వల్లే తాను విజయం సాధించానని వేణుస్వామి చెప్పడం సరికాదని ప్రగతి అన్నది… కఠిన సాధన, నిరంతర కృషి వల్లే తాను ఈ విజయాన్ని సాధించగలిగానని చెప్పింది… వేణుస్వామి వద్ద రెండున్నరేళ్ల క్రితం తాను పూజలు చేయించుకున్న విషయం నిజమేనని… అయితే, తాను మానసికంగా కష్టమైన దశలో ఉన్నప్పుడు ఆ పూజలు చేయించుకున్నానని తెలిపింది… తన స్నేహితుల సూచనతోనే తాను ఆయన వద్దకు వెళ్లానని… టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమేనని చెప్పింది…’’
‘‘వేణుస్వామి పూజల వల్ల సినీ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ తనకు ఎలాంటి ప్రగతి కనిపించలేదని ప్రగతి స్పష్టం చేసింది… ఎప్పుడో జరిగిన పూజలకు, ఇప్పుడు తాను సాధించిన విజయానికి ముడిపెడుతూ… తన విజయానికి ఆ పూజలే కారణమన్నట్టుగా చెప్పుకోవడం కరెక్ట్ కాదని అన్నది… తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని చెప్పింది…’’
నిజమే… దీన్నే ఏరు దాటాక బోడి మల్లన్న అంటారు… గెలిస్తే నీ ప్రగతి… అందరూ నాన్సెన్స్… మరి నీ మీద నీకు నమ్మకమే ఉంటే పూజలు ఎందుకు చేయించుకున్నట్టు… రాయి విసిరావా..? తగిలితే నీ గొప్పదనం, పూజలూ గీజలూ నాన్సెన్స్.,. అంతేనా..? ప్రగతి క్రీడల్లో, బరువులెత్తడంలో కాదు… ప్రగతికి సహకరించిన ప్రతి అంశాన్నీ తలవంచి ఆమోదించడంలో అసలు ప్రగతి, అసలు పరిణతి, అసలు వినమ్రత ఉంటాయి… అంత అర్థమైతే నువ్వు ప్రగతివెలా అవుతావులే…
Share this Article