.
Paresh Turlapati …….. సోషల్ మీడియాలో కొందరికి బాలయ్య నవ్వులు పూయించే కామెడీ సరుకు
మరికొందరికి మంటెక్కించే హాట్ సరుకు
అభిమానులకు మాత్రం మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడే భోళా సరుకు బాలయ్య
నిజమే బాలయ్య ఏదీ మనసులో దాచుకోడు
లౌక్యం కూడా తక్కువే
ఆవేశం వస్తే ఎంతటివాడికైనా దబిడిదిబిడి తప్పదు
ఆహ్లాదం వస్తే చేసే కామెడీ చేష్టలు మాములుగా ఉండవు
అంతా ఓపెన్
Ads
ఈ కామెడీ చేష్టల వల్ల బాలయ్య కొంత లోకువ అయిన మాట వాస్తవం
ఇవన్నీ కాకుండా బాలయ్యలో ఉన్న అసలైన కోణం ఇంకోటి ఉంది
సేవా కార్యక్రమాలు
బాలయ్యకు తల్లి అంటే విపరీతమైన ప్రేమ
ఆ తల్లికి కాన్సర్ వచ్చి చనిపోవడంతో భార్య జ్ఞాపకార్థం ఆమె పేరు మీదే ఎన్టీయార్ స్థాపించిన బసవ తారకం కాన్సర్ ఆసుపత్రి ని అభివృద్ది చేసి ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తున్నాడు
అదీ అతి తక్కువ ఖర్చుతో
కాన్సర్ బాధితులను జలగల్లా పీడించుకునే కార్పొరేట్ ఆసుపత్రుల మధ్య బాలయ్య బసవ తారకం ఆసుపత్రి పేదలకు ఉపశమనం అందించే ఓ చక్కటి వైద్యాలయం
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా కనీసం నెలకోసారి అయినా బసవ తారకం హాస్పటల్ కు వెళ్ళి రోగుల ఆలనా పాలనా స్వయంగా వాకబు చేసి వస్తాడు బాలయ్య
మీరు ఏ కార్పొరేట్ హాస్పటల్ లో అయినా చూడండి
ఉద్యోగాల కల్పనలో వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఏమీ ఉండదు
కానీ బసవ తారకం ఆసుపత్రి లో నేను స్వయంగా చూసా
లిఫ్ట్ ఆపరేట్ చేసే బాయ్స్ అందరూ దివ్యాంగులే
పోలియో బారిన పడి రెండు కాళ్ళూ చచ్చుబడిపోయిన వాళ్ళు చక్రాల కుర్చీలో లిఫ్ట్ ఆపరేట్ బాయ్స్ గా కనిపిస్తారు
అందరికీ చక్కటి జీతాలు ఇస్తాడు కాబట్టి రోగుల నుంచి ఒక్క పైసా కూడా టిప్ ఆశించరు
ఓసారి నేను లిఫ్ట్ బాయ్ పరిస్థితి చూసి జాలేసి టిప్ ఇవ్వబోతే ‘ వద్దు సార్ ‘ అని సున్నితంగా తిరస్కరించాడు
పనిగంటలు మొత్తం కదలకుండా లిఫ్ట్ లో చెక్కబల్ల మీదే కూర్చుంటాడు
అటూ ఇటూ తిరగాలన్నా శరీరం సహకరించదు
డబ్బులెలాగూ తీసుకోవట్లేదు అని ఒక వాటర్ బాటిల్ కొని ఇది ఉంచు అని అతడి చేతిలో పెట్టి భోజనం సంగతి ఏంటని అడిగా
మాకు సార్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు సార్ అని సంతోషంగా చెప్పాడు
కార్పొరేట్ ఆసుపత్రుల లో లక్షలు లక్షలు ఖర్చుపెట్టలేని పేదవారు ఎక్కడెక్కడినుంచో బసవ తారకం ఆసుపత్రి కి వస్తారు
అంతేనా ,
తండ్రి పేరున కుటుంబ సభ్యుల సహకారంతో స్థాపించిన ఎన్టీయార్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు
ఎంచేతనో బాలయ్య సేవా కార్యక్రమాలకు అనుకున్నంత ప్రచారం రాలేదు
ఇప్పుడు మళ్ళీ తలసేమియా బాధితుల కోసం ఎన్టీయార్ ట్రస్ట్ తరుపున విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో సంగీత విభావరి నిర్వహించాడు
ఈ కార్యక్రమానికి దాదాపు ఎన్టీయార్ కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు
ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తదితరులు కూడా హాజరయి విభావరిని సక్సెస్ చేశారు
ఈ మ్యూజికల్ నైట్ లో తమన్ అండ్ కో ఏం పాటలు పాడారు అన్నది పక్కనబెడితే బాలయ్య చొరవ తీసుకొని వేదిక మీదకు వెళ్ళి గాయనితో కలిసి పాడి ప్రోగ్రాంలో జోష్ తీసుకు వచ్చాడు
అంతటితో ఆగలేదు
శివమణితో పోటీ పడి డ్రమ్ములు వాయించేసాడు
బాలయ్య ఉత్సాహాన్ని ఆయన కూతురు బ్రాహ్మణి వీడియో తియ్యడం కనిపించింది
ఇక సినిమా ఇండస్ట్రీ మొత్తం తనని బాలయ్య అని ప్రేమగా పిలిస్తేనే పలుకుతాడు
బాలయ్యకు లేనిపోని ప్రోటోకాల్స్ ఇష్టం ఉండవు
పవన్ కల్యాణ్ బాలయ్యను’ సార్ ‘అని సంబోధిస్తే తనను అలా పిలవ వద్దనీ బాలయ్య అనే పిలవాలని బాలయ్య నవ్వుతూ కోరాడట
ఈ విషయం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు
ముందు ముందు పద్మభూషణ్ బాలయ్య పేదలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుందాం ! ……. ( ఇదంతా చదివి నేనేదో బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్ అనుకునేరు.. ఈ పోస్ట్ కేవలం బాలయ్య సేవా కార్యక్రమాల వరకే పరిమితం… జై బాలయ్యా…)
Share this Article