Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో దేశాంతర ప్రేమకథ… ఇది ఇన్‌స్టా లవ్వు… ఆమె ఎగిరొచ్చి ఇండియాలో వాలింది…

July 22, 2023 by M S R

సీమా హైదర్… ఈమె గురించి ఇప్పుడే చెప్పుకున్నాం కదా… పాకిస్థానీ జాతీయురాలు… పబ్జీ ఆడుతూ ఆడుతూ ఓ ఇండియన్ ప్రేమలో పడి, సీమ హద్దులు దాటి, నేపాల్ గుండా పిల్లలతో సహా ఇండియాలోకి వచ్చేసింది… ఆమె కథ విదితమే… సచిన్ మీనా అనే యువకుడితో ఈ ప్రేమకథ 2019లోనే చిగురించి, పెరగసాగింది… ప్రస్తుతం ఆమె కథను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ జల్లెడ పడుతోంది… ఐఎస్ఐ ఏజెంట్ కావచ్చుననేది ఆమెపై సందేహం…

జనవరిలో ఇలాంటిదే ఓ కథ… బెంగుళూరులో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థానీ జాతీయురాలు అంటూ పోలీసులు ఇక్రా జీవని అనే యువతిని అరెస్టు చేశారు… గత ఏడాది ఆమె కూడా ఇండో-నేపాల్ హద్దుల నుంచే ఇండియాలోకి ప్రవేశించింది… 25 ఏళ్ల యువకుడు, ములాయంసింగ్ యాదవ్ అనే ఓ సెక్యూరిటీ గార్డ్‌తోొ లుడో గేమ్ ఆడుతూ ఆడుతూ ప్రేమలో పడింది… ఇండియాకు వచ్చేసింది… ప్రస్తుతం ఎఫ్ఆర్ఆర్ఓ (Foreigners Regional Registration Office ) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఆమె నిజమైన ప్రేమికురాలేనా..? ఏమైనా కుట్రలో భాగస్వామా..?

ఇంకో కథ ఉంది… అదీ రీసెంటుదే… 49 ఏళ్ల పోలాండ్ యువతి, పేరు బార్బరా పోలక్… ఆల్రెడీ ఆరేళ్ల బిడ్డ కూడా ఉంది… పేరు అనన్య… సేమ్, పైన చెప్పిన రెండు కేసుల్లాగే ఈమె కూడా ఇన్‌స్టా ద్వారా జార్ఖండ్‌లోని హజారిబాగ్‌కు చెందిన షాదాబ్ మాలిక్‌తో ప్రేమలో పడింది… ఇంకేం, ఇండియాలోకి వచ్చేసింది… టూరిస్ట్ వీసా మీద… 2027 వరకు వేలిడిటీ ఉంది… ఈ లవ్వుకు కులం, మతం, ప్రాంతం, దేశమే కాదు, వయస్సు కూడా అడ్డంకి కాదు… తరువాత..?

Ads

ఈ మూడు కేసులూ దాదాపు ఒకేతరహా… అయితే గేమింగ్ యాప్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, తరువాత ప్రణయాలు, తరువాత ఇండియాలోకి వచ్చేసి కాపురాలు… రెండు కేసుల్లో ఆల్‌రెడీ పిల్లలున్నారు ఆ యువతులకు… ఐతేనేం… ఇండియన్ యువకులు పీకల్లోతు పడిపోతున్నారు… రమ్మంటున్నారు… వాళ్లు వచ్చేస్తున్నారు… అఫ్‌కోర్స్, ఇలాంటి కేసులు గతంలో కూడా ఉన్నాయి…

ఈ ఇండో పోలాండ్ ప్రేమను పెళ్లి తీరానికి చేర్చాలని ఇద్దరూ భావిస్తున్నారు… పెళ్లి కోసం హజారీబాగ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు కూడా చేసుకున్నారు… అప్పుడే బార్బరా బిడ్డ షాదాబ్‌ను డాడ్ అని పిలుస్తోంది… మొదటి మొగుడికి బార్బరా విడాకులు కూడా ఇచ్చేసింది… ఇక భారత ప్రభుత్వం అంగీకరించడమే తరువాయి… బార్బరా, షాదాబ్ నిఖా అయిపోతుంది…
ఇక్రా, సీమ ఇద్దరూ పాకిస్థానీ జాతీయులు… వాళ్లు ఇండియాలోకి రావడం కూడా అక్రమ మార్గాల్లో… అందుకే సందేహాస్పదులయ్యారు… దర్యాప్తు సంస్థల కళ్లల్లో పడ్డారు… వాళ్ల దురదృష్టం… బంగ్లా నుంచి, బర్మా నుంచి ఎందరో రోహింగ్యాలు అక్రమంగా వచ్చేసి, ఎంచక్కా ‘ఇండియన్ సిటిజెన్లు’ కూడా అయిపోయారో కదా…

నా గురించి తెలిసి చాలామంది నన్ను చూడటానికి వస్తున్నారు… హజారీబాగ్ అందంగా ఉంది, నివసించడానికి అనువైన సిటీ… నేను ఇప్పుడు ఓ సెలబ్రిటీని అయిపోయాను… ఓ సొంత ఇల్లు, ఓ కారు, ఓ జాబ్… పెళ్లి పనులు చురుకుగా సాగుతున్నాయి… ఐ లవ్ ఇండియా అని చిలుక పలుకులు పలుకుతోంది బార్బరా… భారతీయ యువకులు ఆన్‌లైన్ గేమ్స్ బాగా ఆడుదురు, ఆటలో విదేశీ యువతులను పడేయుదురు… ఎంత గాఢంగా అంటే, సదరు విదేశీ యువతులు పుట్టిన గడ్డను వదిలేసి మరీ ఇండియాలో వాలుదురు… వీళ్లను పెళ్లాడుదురు… మరి గేమ్స్ అంటే ఉత్త ఆటలే అనుకున్నారా ఏం..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions