మూడు రోజుల కింద కూడా ఈటివిలో వచ్చింది . ANR సినిమా రంగంలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్న సంతోష సమయంలో సినిమా అని పోస్టర్లలో ప్రకటించారు . ANR హీరోయిన్ అంజలీదేవి ఈ సినిమాలో ఆయనకే తల్లిగా నటించటం విశేషం . ఎలా ఆడిందో గుర్తు లేదు నాకు . సినిమా పేరు కన్నకొడుకు.
వి మధుసూధనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ANR , లక్ష్మి , కృష్ణంరాజు , గుమ్మడి , అంజలీదేవి , రాజబాబు , ధూళిపాళ , రమాప్రభ , సూరేకాంతం , సాక్షి రంగారావు , భానుప్రకాష్ ప్రభృతులు నటించారు . టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
ఎన్నడైనా అనుకున్నానా , ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి , కళ్ళతో కాటేసి , తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి , అందమైన పిలగాడు అందకుండా పోతున్నాడు , లోకం శోకం పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ఎప్నడైనా అనుకున్నానా అనే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ANR , లక్ష్మిల జోడీ హుషారుగా ఉంటుంది . ANR చాలా చలాకీగా నటించిన సినిమా . ఎబౌ ఏవరేజ్ సినిమా అని గుర్తు .
Ads
విశ్వభారతి ప్రొడక్షన్స్ బేనర్లో జి రాధాకృష్ణ మూర్తి , ఎ రామచంద్రరావులు నిర్మించారు . ANR తో నిర్మించబడిన శ్రీమంతుడు సినిమాకు కూడా వీరే నిర్మాతలు . కాలేజి రోజుల్లో మా నరసరావుపేటలో చూసా . ఏ థియేటరో గుర్తు లేదు . యూట్యూబులో ఉంది . ANR , లక్ష్మి అభిమానులు చూడవచ్చు . Sentimental , feel good movie .
P.S : కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా 175 రోజులు ఆడిన తాయిదేవర అనే సినిమా ఆధారంగా మన తెలుగు సినిమాను నిర్మించారని ఇప్పుడే ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణ మూర్తి గారి కుమారుడు నారాయణరావు తెలియపరచటం జరిగింది . నారాయణరావు నాకు 1976-78 లో T.J.P.S. కాలేజిలో M Com విద్యార్థి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (By… డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
ఇదే పేరుతో 1961లో కూడా ఒక సినిమా వచ్చింది. అందులో జగ్గయ్య, దేవిక, కృష్ణకుమారి ప్రధాన పాత్రలు… కోదండపాణి సంగీత దర్శకుడిగా పనిచేసిన తొలిచిత్రం ఇది… ఇందులో మరో పాత్ర చేసింది సుజాత… భీష్మ సినిమాలో మత్స్యగంధి వేషం వేసి ‘హైలో హైలెస్సా హంస కదా నా పడవ’ అనే పాట ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని వారి మనసులలో ‘భీష్మ’ సుజాత గా నిలిచిపోయింది ఆమే…
Share this Article