.
సినిమా ఫీల్డ్ ఎంత చెత్తా తయారైందంటే… అబ్బో…
అరె, గేమ్ చేంజర్ సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న జూనియర్ ఫ్యాన్స్ గ్రూప్స్ గురించి కాదు… బన్నీ మీద విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్ గురించి కూడా కాదు… అవన్నీ జుజుబీ… విచిత్రం ఏమిటంటే వాళ్లందరి సోషల్ మీడియా టీమ్స్ ఒకటే…
Ads
వృత్తి కదా… ఎవడి మీదనైనా దుమ్మెత్తి పోస్తాయి, మనీ మ్యాటర్స్… సరే, ఆ పిచ్చి గోల పక్కకు పెడదాం… ఎవడెంత నెగెటివ్ క్యాంపెయిన్ చేసినా సరే, సినిమాలో సరుకుంటే ఎవడూ సక్సెస్‌ను ఆపలేడు…
మనం చెప్పుకునేది ఏమిటంటే..? నక్కిన త్రినాథరావు అనే ఓ వెగటు కేరక్టర్ తన సినిమాలో నటించే అన్షు అంబానీ మీద పిచ్చి కూతలు కూశాడని చెప్పుకున్నాం కదా…
జనమంతా బూతులు తిట్టేసరికి… ఈమధ్య సినిమా సెలబ్రిటీలకు అలవాటైనట్టుగానే సారీ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నాడు… మొత్తం దిగిపోయినట్టుంది తెల్లారేసరికి…
కానీ తన ఇగో చల్లారలేదు… ఒరేయ్ నాన్నా, ఆమె కాళ్లు పట్టుకుని సారీ చెప్పరా అని సోషల్ మీడియా ఉరిమితే తనేం చేశాడో తెలుసా..?
వెళ్లి ఆమెకు గట్టిగా చెప్పినట్టున్నాడు… వెంటనే ఆమె వీడియో ఒకటి రిలీజైంది… అబ్బే, మా దర్శకుడు మంచోడు, శుద్ధపూస, నన్ను కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నాడు, మన్నూమశానం అని ఏదో చెప్పింది బ్రిటిష్ ఇంగ్లిష్ యాక్సెంటులో…
సహజంగానే అది సగటు తెలుగు ప్రేక్షకుడెవడికీ అర్థం కాదు… కాకపోతే సదరు మజాకా టీమ్ దిక్కుమాలిన దరిద్రపు స్ట్రాటజీ మాత్రం అర్థమైంది… ‘‘ఒరేయ్ నాన్నా, క్షమాపణ చెబితే అందులో నిజాయితీ ఉండాలి, మళ్లీ ఆమెతోనే పొగడ్తలు ఏమిట్రా బాబూ’’ అని తిట్టుకుంటారు… ఆ సోయి కూడా లేదు ఆ దర్శక దరిద్రానికి…
ఆమె ఏదో రీఎంట్రీ ఇస్తోంది… సహజంగానే ఈ వివాదాలు తలనొప్పిని, ఆందోళనను క్రియేట్ చేస్తాయి ఆమెకు… పైగా అసలే వెగటుతనం పుష్కలంగా ప్రవహించే తలకుమాసిన వెకిలిప్రవాహం టాలీవుడ్… దబిడిదిబిడీ సాంగ్ చూశాం కదా… మొత్తం అదే కంపు…
సో, డైరెక్టరో, ప్రొడ్యూసరో ఎవడో చెప్పినట్టున్నాడు… ఇంకేముంది..? అందరూ మర్యాదస్తులు, సంస్కారులు, శుద్ధపూసలు అన్నట్టుగా ఆ వీడియో విడుదల చేసింది ఆమె… అసలు ఇదీ దరిద్రం… అంతే మరి, వీళ్లు డబ్బుతో, బెదిరింపులతో అందరి నోళ్లూ మూయించగలరు… అనుకున్నవి చెప్పించగలరు… ఇది మాలీవుడ్ కాదు, కనీసం కోలీవుడ్ కూడా కాదు కదా..!!
Share this Article