Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కృష్ణ హీరోయిన్ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించినట్టు లేదు..!!

May 20, 2024 by M S R

Subramanyam Dogiparthi… 1972 లోకి వచ్చేసాం . నేను B Com పాసయి గుంటూరు-నల్లపాడు లోని A.U.P.G. సెంటర్లో M Com కోర్సులో జాయిన్ అయ్యాను . 1953 లో చండీరాణి సినిమాకు దర్శకత్వం వహించిన భానుమతి 19 సంవత్సరాల తర్వాత ఈ ‘అంతా మన మంచికే’ సినిమాకు దర్శకత్వం వహించారు . చండీరాణి సూపర్ హిట్ సినిమా .

అంతా మన మంచికే సినిమా అంతా ఆమే … కధ , స్క్రీన్ ప్లే , మాటలు , సంగీత దర్శకత్వం , సినిమా దర్శకత్వం , ప్రధాన పాత్ర అంతా ఆవిడే . ఆడటానికి ఏదో వంద రోజులు ఆడిందేమో నాకు ఐడియా లేదు , కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదని గుర్తు . 13 వారాలు ఆడినట్లు సాక్ష్యం అయితే ఉంది .

భానుమతి కంఠంతో చెవుల్లోని తుప్పు వదిలిపోతుంది . నీవేరా నా మదిలో దేవా తిరుమల వాసా ఓ శ్రీనివాసా , నేనె రాధనోయి గోపాలా అందమైన ఈ బృందావనిలో , సరిగమ పాట పాడాలి పాటలోనే పాఠాలన్నీ , చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా , మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే పాటలు ఆమే అద్భుతంగా పాడారు . నాకు గుర్తుండి భానుమతి పాడిన పాటల్లో శ్రావ్యంగా లేని పాట ఒక్కటయినా గుర్తు లేదు . మాట చాలదా మనసు చాలదా , నవ్వవే నా చెలీ చల్ల గాలి పిలిచేను పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . భానుమతి సొంత సినిమా, భరణీ పిక్చర్స్… అన్ని పాటలూ తనే పాడకుండా ఒకటి వసంతకు, మరొకటి సుశీలకు దయతో ఇచ్చింది…

Ads

డి వి నరసరాజు మాటలు తూటాల్లాగా పేలుతాయి . ఈ సినిమాలో కృష్ణకు జోడీగా టి పద్మిని అనే నటి నటించింది . ఆమె తెలుగులో మరే ఇతర సినిమాల్లో నటించినట్లు లేదు . నాగయ్య , కృష్ణంరాజు , నాగభూషణం , పద్మనాభం , మిక్కిలినేని , బాలక్రిష్ణ , సూరేకాంతం , ఛాయాదేవి , రుష్యేంద్రమణి ప్రభృతులు నటించారు .

మహిళల సత్తా గురించి చాటి చెప్పే కధాంశం ఉన్న ఈ సినిమా బాగుంటుంది . మహిళలకు బాగా నచ్చింది కూడా . సినిమా అంతా విలన్లందరినీ మాటలతో , చేతలతో వాయించేస్తుంది భానుమతి . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడినట్లు గుర్తు . కాలేజీ రోజుల్లో చూసా , టి విలో కూడా చూసా . ఏదో చానల్లో తరచూ వస్తూనే ఉంటుంది . సినిమా యూట్యూబులో లేదు . పాటల వీడియోలు ఉన్నాయి . భానుమతి అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions