Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పాత సినిమా విశేషాలు రాస్తూ పోతే… అదీ ఓ ‘అంతులేని కథ’…

August 20, 2024 by M S R

అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన కుటుంబ సభ్యుల కోసం తనను తాను కర్పూరహారతిని చేసుకునే అభాగ్యురాలి కధ టూకీగా . ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్ర మొదటిసారే అయినా జయప్రద జయప్రదంగా చేసింది . ఈ సినిమా ఆమె నట జీవితానికి ఓ మలుపు .

తమిళంలో సక్సెస్ అయిన అవల్ ఒరు తొడర్ కధై అనే సినిమాకు రీమేక్ అంతులేని కధ . తమిళంలో జయప్రద పాత్రను సుజాత పోషించింది . తెలుగులో కూడా సూపర్ హిట్టయ్యాక 1997 లో బెంగాలీలో కబిత అనే టైటిల్ తో రీమేక్ అయింది . కబిత అంటే కవిత . బెంగాలీలు వ ను బ అంటారు కదా ! జయప్రద పాత్రను మాలాసిన్హా నటించింది . 1983 లో కన్నడంలోకి రీమేక్ అయింది . కన్నడంలో సుహాసిని నటించింది . 1982 లో జీవన్ ధారా అనే టైటిల్ తో రీమేక్ అవ్వగా జయప్రద పాత్రను రేఖ నటించింది . అంత ట్రాక్ రికార్డు ఉన్న కధ ఈ సినిమా కధ . అయిదు భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో అందరికన్నా జయప్రదే బాగా నటించిందని అంటారు .

ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే . ముఖ్యంగా బాల సుబ్రమణ్యం పాడిన తాళి కట్టు శుభవేళ మెడలో కల్యాణమాల పాట . మిమిక్రీతో కూడిన పాట . బాల సుబ్రమణ్యంకు తప్పితే ఈ ఫీట్ మరెవరికీ చేతకాదు . ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి పాట . జేసుదాసు బ్రహ్మండంగా పాడారు . యస్ జానకి పాడిన రెండు పాటలు జనం చెవుల తుప్పు వదిలించాయి . అరే ఏమిటి లోకం పలుగాకుల లోకం మరియు కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . యం యస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వానికి హేట్సాఫ్ .

Ads

(తాళికట్టు శుభవేళ పాటలో అడవిలో జంతువుల పాత్రలు తీసుకుని, సినిమా కథకు ముడేసి మిమిక్రీతో చెప్పడం గొప్ప ప్రయోగం… సేమ్, ఇది కథ కాదులో కూడా బాలచందర్ వెంట్రిలాక్విజం ఉపయోగించి ఓ బొమ్మ ద్వారా ఓ పాత్ర అంతరంగాన్ని చెప్పిస్తాడు… ఇప్పుడు ఆ లోతు, ఆ భావం, ఆ ప్రయోగం ఎక్కడివి..? అన్నీ ఊ అంటావా ఊఊ అంటావా అంటూ కుర్చీలు మడతపెట్టడమే కదా… అంతులేని కథ సినిమాలోని ఒక్కో పాటపై ఒక్కో వ్యాసం రాయొచ్చు…)

ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . రజనీకాంత్ , నారాయణరావు , శ్రీప్రియలకు తెలుగులో మొదటి సినిమా . రజనీకాంత్ స్టైలుగా సిగరెట్ కాల్చటం ప్రేక్షకులకు బాగా నచ్చింది . వికటకవి పాత్రలో నటించిన నారాయణరావుకు మంచి పేరు వచ్చింది . ఇంక బెంగాలీ బాబు పాత్రలో కమల్ హసన్ మంచబ్బాయిగా చక్కగా నటించారు . బెంగాలీ సినిమాలో ఇదే పాత్రను తిరిగి పోషించారు . కన్నడంలో కూడా నటించారు .

ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది జయలక్ష్మి . ఈ సినిమా ద్వారానే ఫటాఫట్ జయలక్ష్మి అయింది . ఈ సినిమాకు మాటలు వ్రాసిన ఆత్రేయకు ఈ ఫటాఫట్ పదం ఎక్కడ దొరికిందో కాని ఆంధ్ర దేశమంతా ఫటాఫట్ ఆడింది , ఇంకా ఆడుతూనే ఉంది . Careless యువతిగా , చలాకీగా , హుషారుగా బ్రహ్మాండంగా నటించింది . అరె ఏమిటి లోకం పాటలో ఇరగతీసింది . తల్లీకూతుళ్ళ మధ్య ఎన్ని విబేధాలయినా రావచ్చు కాని సవతి పోరు మాత్రం రాకూడదనే డైలాగ్ బాగా పేల్చింది .

మరో నటుడు ప్రసాద్ బాబు . అతనికి కూడా ఇదే మొదటి సినిమా అనుకుంటా . Subject to correction . ఆల్మోస్ట్ షూటింగ్ అంతా విశాఖపట్నం లోనే జరిగింది . బాలచందర్ కు కూడా విశాఖ అంటే సెంటిమెంట్ లాగా ఉంది . చరిత్ర సృష్టించిన మరో చరిత్ర సినిమా కూడా విశాఖలోనే తీసారు . బ్లాక్ & వైట్ సినిమా అయినా సూపర్ హిట్టయింది .

టివిలో ఇప్పటికీ వస్తూనే ఉంటుంది . బహుశా ఈతరంలో కూడా చూడనివారు ఎవరూ ఉండరేమో ! ఒకరూ అరా ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . మధ్య తరగతి కుటుంబాలలో ఏ పనీ చేయకుండా భూమికి భారమయ్యే కుటుంబ సభ్యుల బాధితులు అవుతున్న అభాగ్య అక్కలకు , తల్లులకు ,తండ్రులకు ఈ సినిమా అంకితం . వారి జీవితాలు అంతులేని కధే #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు     (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions