Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకలి సూచీ..! మోడీ అసమర్థ పాలకుడే, మరి మీ రాష్ట్రాల్లో మీరేం ఉద్దరించారు..?!

October 17, 2022 by M S R

ఏదో దిక్కుమాలిన సంస్థ, దురుద్దేశపూర్వక సర్వే చేస్తే… దేశాన్ని బదనాం చేస్తుంటే… ఇండియాలో ఎక్కడ చూసినా సరే, ఆకలి చావులకు గురైన శవాలు కనిపిస్తున్నట్టుగా ఫస్ట్ పేజీల్లో హాఫ్ పేజీ కథనాలు పబ్లిష్ చేసుకున్న మూర్ఖులు ఒక్కసారి తమ ఆత్మల్ని పరీక్షించుకోవాలి… మన ప్రభుత్వం, కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్లి మరీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేస్తుంది కదా… మరి ఆ ఇంపార్టెంట్ వివరాల్ని ఎప్పుడైనా పబ్లిష్ చేశారా..? శిశుమరణాలు, పౌష్టికాహారలోపాలు, మాతాసంరక్షణ వంటి కీలకాంశాలపై నిఖార్సయిన సర్వే అది… అసలు ఆ అంకెలు మీకు అర్థమవుతాయా..? అవి అర్థం చేసుకుని, లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని, చేతనైతే ఫీల్డ్ రిపోర్ట్‌తో మోడీ బట్టలు విప్పండి… అది చేతకాదు…

ఆ శ్రమ అక్కర్లేదు… 140 కోట్ల జనాభాలో సెలెక్టెడ్ 3 వేల మందిని ఎవడో ప్రశ్నలు వేస్తాడట… అవీ నెత్తిమాశిన ప్రశ్నలు… వాటిని బట్టి ‘అయిపోయింది, ఇక ఇండియాలో జనాభా అంతరించిపోయినట్టే’ అన్నట్టుగా ఓ ర్యాంకింగ్ ఇస్తాడు… దొరికింది కేంద్రంలోని ప్రభుత్వం అనుకుని, యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పత్రికలు, జర్నలిస్టులు, నాయకులు, పార్టీలు రెచ్చిపోయి బజారులో వీరంగం వేస్తారు… చుట్టుపక్కల దేశాలకు వేల టన్నుల ఆహారధాన్యాల్ని ఉచితంగా పంపిస్తాం మనం… కానీ మనం బొచ్చె పట్టుకుని ఇంటర్నేషనల్ బజారులో నిలబడ్డట్టుగా ఈ మొహాలు కలరింగు ఇస్తాయి…

ఒకవైపు బ్రిటన్‌ను కూడా దాటేసి, ఓ బలమైన ఆర్థికశక్తిగా మారాాం అని ఇలాంటి ర్యాంకింగ్ సంస్థలే రిపోర్టులు ఇస్తాయి… ఈ సోకాల్డ్ ఐఎంఎఫ్‌లు ఎట్సెట్రా మెచ్చుకుంటాయి… కానీ వాడెవడో ఆకలి సూచీలో ఇండియా ఇంకా అధ్వాన్నపు ర్యాంకుకు జారిపోయింది… అనగానే ఒక్కొక్కడూ సంబురాలు చేసుకుంటున్నారు… మరి మీరు ప్రభుత్వాలు ఉద్దరిస్తున్న తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల్లో మీరేం ఉద్దరించినట్టు… వాడెవడో బజారులో నిలబెట్టి కడుగుతున్నది మిమ్మల్ని కూడా…!! మోడీకి పాలన చేతకాదు, మరి మీ పాదరసం బుర్రలు ఏమయ్యాయ్..? ఈ విషయంలో ఇంకా మిత్రుడు పార్ధసారధి పోట్లూరి ………. రాసిన మరింత వివరణ చదవండి…

Ads



ghi

అంతర్జాతీయ ఆకలి సూచీ, భారత్. International Food Policy Research Institute- India. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఆకలి చావులు, పోషకాహార లోపం ఎంత శాతంగా ఉందో మరియు దానిని ఎలా అరికట్టాలి అనే ఆశయంతో 1975 లో ఇంటర్నేషనల్ ఫుడ్ పోలోసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసింది అమెరికా. IFRI హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC లో ఉంది. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ! IFRI కి దక్షిణాసియాలో ఢిల్లీలో ప్రాంతీయ హెడ్ క్వార్టర్ ఉంది.

1. ప్రతీ సంవత్సరం వివిధ దేశాలలో చిన్నపిల్లల మరియు పెద్దల పౌష్టికాహారము ఎంత తీసుకుంటున్నారో సర్వే చేస్తుంది. దాని ప్రకారం వివిధ ర్యాంకులు ఇస్తూ ఉంటుంది.

2. సర్వే ఎలా చేస్తుంది ? దేశం మొత్తం మీద నాలుగు మూలలా తిరిగి దాదాపుగా 3000 మందిని ప్రశ్నిస్తుంది.

3. IFRI వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి ? పేదలు ఉండే చోటుకి వెళ్ళి రోజూ ఎంత ఆహారం తీసుకుంటున్నారు ? మీరు తీసుకునే ఆహారంలో ఎలాంటి పదార్ధాలు ఉంటాయి ? ఇలా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతుంది.

4. IFRI అలా రాబట్టిన సమాధానాలని క్రోడీకరించి ఆయా దేశాల ర్యాంకులని నిర్ణయిస్తుంది.

5. అసలు పౌష్టికాహారం అంటే ఈ అమెరికన్ ఏజెన్సీ దృష్టిలో రోజూ కోడి గుడ్లు తీసుకోవడం, రోజూ కనీసం 100 గ్రాముల కోడి మాంసం తీసుకోవడం లేదా వేరే జంతువుల మాంసం తీసుకోవడం లాంటివి అన్నమాట !

6. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎంత శాతం తీసుకునే ఆహారంలో ఉంటున్నదో లెక్క కడుతుంది. వీళ్ళ లెక్కల ప్రకారం కందిపప్పు తినడం వలన ప్రోటీన్లు శరీరానికి కావలసినంతగా అందవు.

7. రోజూ కోడి గ్రుడ్లు, కోడి లేదా ఇతర జంతు మాంసం తినేవారి సంఖ్య భారత్ లో ఎంత ఉంటుంది ?

8. అందులోనూ పేద వాళ్ళు రోజూ కోడి గ్రుడ్లు, ఇతర జంతు మాంసం తినగలరా ?

9. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 3000 సాంపుల్స్ తీసుకొని వాటిని ప్రామాణికంగా ఎలా పరిగణిస్తారు ?

10. మొత్తం యూరోపు జనాభా వచ్చేసి 74,86,75,003 కోట్లు. అంటే మన దేశ జనాభా తో పోలిస్తే సగానికి సగం ఉంది.

11. శ్రీలంక జనాభా 2 కోట్ల 19 లక్షలు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా 3 కోట్ల 89 లక్షలు. పాకిస్థాన్ జనాభా 23 కోట్ల 67 లక్షలు. పాకిస్థాన్ జనాభా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంది. శ్రీలంక జనాభా కేరళ రాష్ట్రమంత కూడా లేదు. ఆఫ్ఘనిస్థాన్ జనాభా తెలంగాణ జనాభాతో సమానంగా ఉంది.

12. అంటే 2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక దేశంలో 3000 సాంపుల్ సర్వే చేసి ర్యాంక్ నిర్ణయిస్తారా ? అటువంటప్పుడు మన కేరళతో పోల్చి శ్రీలంకకి ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ?

13. పాకిస్థాన్ జనాభాతో సమానంగా ఉన్న ఉత్తరప్రదేశ్ జనాభాని పోల్చుతూ పాకిస్థాన్ ర్యాంక్ ఎంతో నిర్ధారించాల్సి ఉంటుంది కదా ?

14. ఇలా చూస్తే భారత దేశం మొత్తంలో 3 వేల సాంపుల్ సర్వే చేసి 140 కోట్ల జనాభాకి ఎలా లెక్కకడతారు ?

15. గత జులై నెలలో ఈ 3 వేల సాంపుల్ సర్వే మీద భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది పైన పేర్కొన్న గణాంకాలని సరిపోలుస్తూ !

16. కోవిడ్ విజృంభించిన తరువాత భారత ప్రభుత్వం 80 కోట్ల మందికి సరిపడా ప్రతినెలా సబ్సిడీ మీద గోధుమలని ఇస్తున్నది రాష్ట్రాలకి ఇప్పటి వరకు. ఇందులో బిలో పావర్టీ లైన్ అనే ప్రాతిపదిక మీద 40 కోట్ల జనాభాకి ఉచితంగా రేషన్ ఇస్తూ వస్తున్నది 2020 నుండి ఇప్పటివరకు. ఈ స్కీమ్ ని మరో మూడు నెలలు పొడిగించింది తాజాగా కేంద్ర ప్రభుత్వం !

17. హంగర్ ఇండెక్స్ అంటే పౌష్టికాహార లోపం అని అర్ధం కానీ దీనికి వాళ్ళకి అనుకూలమయిన పారామీటర్స్ కి అన్వయించి ర్యాంకులు ఇస్తున్నది IFRI.

18. ఒక దేశంలో కేవలం రొట్టెలు తిని బ్రతుకుతారు అది వాళ్ళ అలవాటు. ఆ రొట్టెలలోకి పప్పు లేకపోతే మాంసాహారం కలిపి తింటారు. డబ్బులు లేని రోజున పప్పు లేదా పచ్చడితో తింటారు. అంత మాత్రాన అది పౌష్టికాహార లోపం ఎలా అవుతుంది ? అలా అయితే దక్షిణాది రాష్ట్రాలతో సహా ఒరిస్సా, బెంగాల్, అస్సాంలలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉంటుంది అంటే ఇది పౌష్టికాహార లోపమా ?

ghi

గతంలో అంటే 6 నెలల క్రితం అత్యంత సంతోషంగా ఉండే దేశాల లిస్ట్ లో శ్రీలంకతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ లని చేర్చి, వాటి కంటే దిగువన భారత్ ఉన్నట్లు ప్రచారం చేశారు. తీరా చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ల పరిస్థితి ఈ రోజున ఎలా ఉందో మనందరికీ తెలుసు.

శ్రీలంకకి మనం బియ్యంతో పాటు పెట్రోల్, డీజిల్, నోటు పుస్తకాలు ఇవ్వకపోతే రోజు గడవట్లేదు. ఇక మందుల సంగతి సరే సరి ! ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా అంతే. పాకిస్థాన్ తాజాగా 5 కోట్ల దోమ తెరలు కావాలని భారత్ ని అభ్యర్ధించింది. మరి ఈ దేశాలు హంగర్ ఇండెక్స్ లో భారత్ కంటే ఎలా పైన ఉన్నాయి ? పాకిస్థాన్ లో కిలో గోధుమపిండి 170 రూపాయలు అయితే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ? గ్యాస్ సిలెండర్ ధర 4500 రూపాయలు అదీ బ్లాకులో కొనాల్సిన చోట పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ? శ్రీలంకలో అయితే గత 10 నెలలుగా నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతుంటే అక్కడ పౌష్టికాహార లోపం లేకుండా ఎలా ఉంటుంది ?

మరీ విచిత్రం ఏమిటంటే నేపాల్ మన కంటే మెరుగ్గా ఉంది అని రిపోర్ట్ చేసింది IFRI. 2024 ఎన్నికలు పూర్తయే వరకు ఇలాంటి బోగస్ ప్రచారం చేస్తూనే ఉంటారు. IFRI రిపోర్ట్ రాగానే పుర్ర చేయి అభిమానులు సోషల్ మీడియాలో సంబరం చేసుకుంటున్నారు. ఇంకో రెండు నెలలు ఆగితే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, శ్రీలంకల స్థితి ఎలా ఉండబోతుందో తెలసిపోతుంది. అసలు ఈ శీతాకాలంలో యూరపులో చలికి ఎంత మంది చనిపోతారో చూద్దాం !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…
  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions