Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!

May 20, 2025 by M S R

.
Subramanyam Dogiparthi …….. ఫక్తు కోదండరామిరెడ్డి మార్క్ సినిమా అనుబంధం . 1+ 2 సినిమా . ఓ ఎస్టేట్ ఓనర్ కుమారుడు . ఆ కుమారుడికి నమ్మినబంటు లాంటి డాక్టర్ స్నేహితుడు . ఎస్టేట్లో పనిచేస్తున్న పనివాడి కూతుర్ని గుడిగంటలు సినిమాలో లాగా ఇద్దరూ ప్రేమిస్తారు .

హీరోయిన్ మాత్రం బాబు గారినే ప్రేమిస్తుంది . స్నేహితుడు దగ్గరుండి ఇద్దరి పెళ్ళి జరిపిస్తాడు . కాపురం కూడా పెడతారు . హీరోయిన్ గర్భవతి అయ్యాక పెదబాబు గారొచ్చి హీరోయిన్ ఇల్లు తగలబెట్టిస్తాడు .

చినబాబు గారు ఖిన్నులైపోయి గడ్డం లైటుగా పెంచుతారు . పెదబాబు గారి గోల తట్టుకోలేక రెండో హీరోయిన్ని పెళ్ళి చేసుకుంటాడు కానీ మనసారా కాపురం చేయలేక పోతూ ఉంటాడు . ఇంతలో మొదటి హీరోయిన్ కొడుకు తెర మీదకు వస్తాడు .

Ads

పెదబాబు గారి వద్దకే చేరుతాడు . క్లైమాక్సులో నిజం హీరో గారికి తెలవటం , అతన్ని రెండో హీరోయిన్ కూడా ఆమోదించటం , హీరో గారి మరో డ్రైవర్ స్నేహితుడి కూతురుతో పెళ్ళి కావడంతో సినిమా ముగుస్తుంది .

చినబాబుగా ANR , అతని ఇద్దరు స్నేహితులుగా జగ్గయ్య , ప్రభాకరరెడ్డి , మొదటి హీరోయినుగా రాధిక , రెండవ హీరోయినుగా సుజాత , కొడుగ్గా కార్తీక్ , అతను పెళ్ళి చేసుకునే అమ్మాయిగా తులసి నటించారు . ANR , జగ్గయ్యలను 60+ వయసులో అంత అందంగా చూపించిన కోదండరామిరెడ్డిని మెచ్చుకోవలసిందే .

అలాగే రాధిక , సుజాత , తులసిలను కూడా చాలా అందంగానే చూపారు . కార్తీక్కి తెలుగులో ఇది రెండో సినిమా . డ్యూయెట్లు , అక్కినేని ప్రభాకరరెడ్డిల పాట అన్నీ ఊటీలోనే షూట్ చేసారు . చక్కటి లోకేషన్లు . ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం పాటలే .

ఆత్రేయ , వేటూరి , రాజశ్రీలు వ్రాసిన పాటలన్నీ బాగుంటాయి . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . జిం జిం తారారే , మల్లెపూలు ఘొల్లుమన్నవి పక్కలోన డ్యూయెట్లు రెండూ ANR , రాధికల మీద ఉంటాయి . ఇద్దరూ బ్రహ్మాండంగా డాన్సించారు .

మరో డ్యూయెట్ ANR , సుజాతల మీద వాళ్ళు నడి వయసుకు వచ్చాక ఉంటుంది . అయితేనేం ఇద్దరి చేత లైటుగా బాగానే డాన్సింపచేసాడు కోదండరామిరెడ్డి . నృత్య దర్శకుడు సలీంను అభినందించాల్సిందే .

ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం అనే పాట మొదలవ్వగానే అన్నదమ్ముల అనుబంధం సినిమాలోని ఐకానిక్ సాంగ్ వస్తుందేంటి అని అనిపిస్తుంది . ఇంతలో వినూత్నంగా పాట మధ్యలో పలుకులు కూడా వస్తాయి . అక్కినేని , ప్రభాకరరెడ్డి , కార్తీక్ , తులసిలు ఉంటారీ పాటలో . బాగుంటుంది .

మరో డ్యూయెట్ జూనియర్ లవర్స్ కార్తీక్ , తులసిల మీద ఉంటుంది . ఒక బుధవారం ఒక బుల్లోడు మా ఇంటికొచ్చాడు అంటూ సాగుతుంది . ఇద్దరూ చాలా ఎనర్జిటిక్ గా డాన్సిస్తారు . డాన్సింపచేసాడు కోదండరామిరెడ్డి .

ఇతర పాత్రల్లో రామదాసు , అల్లు రామలింగయ్య , రావి కొండలరావు , రాధాకుమారి , హేమసుందర్ , నాగేష్ , మమత , నిర్మలమ్మ , గిరిజ , జయవిజయ , ప్రభృతులు నటించారు . 12 సెంటర్లలో వంద రోజులు ఆడిన ఈ సినిమా 1984 మార్చిలో వచ్చింది . ANR కాస్ట్యూమ్స్ చాలా రిచ్ గా , షోగ్గా ఉంటాయి .

సత్యానంద్ డైలాగ్స్ బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , శైలజ , రమేష్ శ్రావ్యంగా పాడారు . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని అక్కినేని అభిమానులు చూడవచ్చు . చూడబులే . It’s an entertaining , sentimental , musical , feel good , ANR movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు



మల్లెపూలు ఘొల్లుమన్నవీ పక్కలోన అనే పాటలో ఆ పూలు ఆ వేడికి, ఆ తాకిడికి ఘొల్లుమని ఏడ్చాయా..? లేక ఆ సరసాలు, ఆ సంభోగాలు చేసి ఘొల్లుమని నవ్వాయా..? అసలు రచయిత ఉద్దేశం ఏమిటి..? ఇది అర్థం కాకపోయేది చాన్నాళ్లు, ఆ సినిమా చూసిన తరువాత…. అఫ్‌కోర్స్, ఇప్పటికీ…



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions