.
#the signature
మనిషి జీవితంలో డబ్బులు ఎంత ప్రాముఖ్యమో, ఒక్కొక్క రూపాయి కోసం తపించిపోతూ, భార్య కొస ప్రాణాలను కాపాడుకోవడం కోసం తాపత్రయ పడుతున్న భర్త పాత్రలో అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించారు
Ads
“మధూ! నువ్వు ముందే ఎందుకు చనిపోలేదు? పన్నెండు రోజుల తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత చనిపోతానంటే ఎలా?”
“నా దగ్గర ఉన్న డబ్బులతో నేను నీకు ఇంకా ఎన్ని శ్వాసలు కొనగలను మధూ?”
అంటూ కోమాలో ఉన్న భార్యకు నమస్కారం పెట్టి ఏడుస్తున్న అనుపమ్ ఖేర్ ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.
అన్ని ప్రయత్నాలు చేసి, హాస్పిటల్లో మరునాటి ట్రీట్మెంట్ కోసం, ఒక్క రూపాయి కూడా పుట్టించ లేక, DRS ఫారం మీద, అంటే, తన భార్యకు పెట్టిన వెంటిలేటరును తొలగించడానికి అంగీకారాన్ని తెలియచేస్తూ, సంతకం (The Signature) చేస్తాడు.
మనం కూడా మన గుండెల్లో కన్నీటి చెలిమలు భద్రంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ సినిమాలోని అనుపమ్ ఖేర్ లాగా దుఃఖపు సముద్రంలో అప్పడప్పుడైనా మునగాలి. అప్పుడే దేవుడు మనకు ఎంత చక్కటి జీవితం ఇచ్చాడో అవగతమవుతుంది.
మనస్సు ఆకాశమంతా విషాద మేఘాలు కమ్ముకోవడాన్ని ఎప్పుడైనా అనుభవించారా?
బాంధవ్యాల బూటకపు నాటకంలో కత్తి సాము చేయడమంటే ఏమిటి?
ఇంటికైతే చేరాను కానీ
నా ప్రయాణం ఇంకా ముగియలేదెందుకు?
ఎవరి ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలుస్తుంది?
జీ 5 లో ఉంది. వీలైతే చూడండి. తెలుగులో లేదు……… { ప్రభాకర్ జైనీ }
Share this Article