.
Pardha Saradhi Potluri….. Tejas crashed at Dubai Air show! 22-11-2025 8.30 AM
భారత్ వాయుసేన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ మొన్న దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిపోయింది!
పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ న్యాల్ ( Wing Commander Namansh Nyal) చనిపోయాడు!
Ads
అల్ మక్టోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దుబాయ్ ( Al Maktoum International Airport, Dubai) లో జరుగుతున్న ఎయిర్ షో మొన్నటితో మూడో రోజు ముగియనున్న సందర్భంలో తన చివరి ఆక్రోబాట్ విన్యాసాల సందర్బంగా తేజస్ జెట్ ఫైటర్ పైలట్ అకస్మాత్తుగా ఇంజిన్ థ్రస్ట్ కోల్పోయాడు, దాంతో విమానం వేగంగా నేలని ఢీ కొట్టి ఇంధనం మండడంతో మంటల్లో కాలిపోయింది!
తేజస్ పైలట్ కి ఎజెక్ట్ అయ్యే సమయం దొరకలేదు!
భారత రక్షణ శాఖ లోతుగా దర్యాప్తు మొదలుపెట్టింది!
దుబాయ్ లో ఎవరన్నా విద్రోహ చర్యకి పాల్పడి ఉంటారా?
అలాంటిది జరిగే అవకాశం ఉండదు. మూడు రోజుల ఎయిర్ షో ఉంటే వివిధ దేశాల విమానాలు టర్మాక్ మీద వరసగా పార్క్ చేసి ఉంటాయి రాత్రిపూట! దుబాయ్ అనే కాదు ఎక్కడ ఎయిర్ షో జరిగినా భద్రత కట్టు దిట్టంగా ఉంటుంది.
సంబంధిత దేశానికి చెందిన విమానం తాలూకు పైలట్స్, ఇంజినీర్లు, సహాయక సిబ్బంది వివరాలు ఆతిధ్య దేశానికి ముందే ఇస్తారు. ఆతిధ్య దేశ సెక్యూరిటీ సిబ్బంది ఆయా దేశాలు ఇచ్చిన వ్యక్తుల వివరాలని పరిశీలించి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తాయి. ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న వారికే టర్మాక్ మీదకి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. సందర్శకులకు దూరం నుండి చూడడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
రాత్రి వేళ ఆ ప్రాంతం మొత్తం సీల్ చేస్తారు! సెర్చ్ లైట్స్, సీసీటీవీ కెమెరాలతో భద్రత పటిష్టంగా ఉంటుంది.
వెలుతురు రాగానే పైలట్, మెయింటనెన్స్ ఇంజినీర్లు, సహాయక సిబ్బంది వాళ్ళ వాళ్ళ విమానాల దగ్గరికి వెళ్లి చీకటి పడేదాకా అక్కడే ఉంటారు.
సహాయక సిబ్బంది ఇంజినీర్ల అనుమతి లేకుండా విమానం మీదకి ఎక్కడం, విమానం కిందకి వెళ్లడం చేయలేరు. పైలట్ నిరంతరం తన విమానాన్ని చూస్తూనే ఉంటాడు. మెయింటనెన్స్ ఇంజినీర్ ఏదన్నా చేయాలంటే పైలట్ కి చెప్పి తాను ఏం చేయబోతున్నాడో తెలియచేసి లాగ్ షీట్ మీద పైలట్ సంతకం చేశాకే తన పని చేయగలుగుతాడు.
ప్రతీ పని మినిట్స్ తో సహా లాగ్ షీట్ లో వ్రాయాల్సి ఉంటుంది. పైలట్, ఇంజినీర్, ఇంచార్జ్ తో సహా అందరి సంతకాలు ఉండాలి.
ఆరు నెలల క్రితం తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన F 35 పైలట్ విమానం దగ్గరలోనే టర్మాక్ మీద పడుకున్నాడు తప్పితే విమానం వదిలి వెళ్ళలేదు. అది పైలట్ బాధ్యత!
**************
తేజస్ యాక్రోబాట్ విన్యాసాలు చేస్తున్న సమయంలో పైనుండి నేలకి దగ్గరగా దిగి తిరిగి పైకి వెళ్లే సమయంలో ఇంజిన్ తన థ్రస్ట్ కోల్పోయింది కిందపడిపోయింది!
చివరి నిముషంలో ఇంజిన్ మిస్ ఫైర్ అయిన శబ్దం వినపడింది. అంటే మిస్ ఫైర్ కావడానికి ముందే పైలట్ విన్యాసంలో భాగంగా వేగంగా కిందకి దిగి తిరిగి విమానాన్ని పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఇంజిన్ వేగాన్ని పెంచాడు. కానీ ఇంజిన్ మిస్ ఫైర్ అయిపోయి థ్రస్ట్ దొరకక కిందకి పడిపోయింది. చివరి సెకండ్ లో ఫట్ మనే శబ్దం వినిపించిన తరువాతే కింద పడిపోయింది.
High speed negative G roll, Pull Up Turn అనేది Aerobatic maneuver. ఈ విన్యాసం ఎయిర్ షోలలో చేస్తుంటారు అన్ని దేశాల పైలట్లు. అఫ్కోర్స్! హెవీ వెయిట్, మీడియం వెయిట్ విమానాల కంటే లైట్ వెయిట్ విమానాలు ముఖ్యంగా సింగిల్ ఇంజిన్ విమానాలతో చేయడం తేలికే అయినా సింగిల్ ఇంజిన్ ఉండడం వల్ల రిస్క్ ఎక్కువ.
Upscale సమయంలో రెండు ఇంజన్లు ఉన్న విమానాలు ఒకటి పనిచేయక పోయినా రెండోది ఆదుకుంటుంది! అదే సింగిల్ ఇంజిన్ అయితే పైకి లేచే సమయంలో ఒకే ఇంజిన్ ఉండడం వలన ఏదైనా టెక్నికల్ గ్లిచ్ ఏర్పడితే రికవర్ అవడం కష్టం!
తేజస్ కుప్పకూలడానికి కారణం జెనరల్ ఎలక్ట్రిక్ GE-404 ఇంజిన్ పనిచేయకపోవడమే కారణం కానీ పైలట్ తప్పిదం ఏ మాత్రం కాదు!
పైలట్ ఎజెక్ట్ ఎందుకు కాలేకపోయాడు?
ఎజెక్ట్ అయేంత సమయం లేదక్కడ!
పైలట్ ఇంజిన్ మీద ఉండే విశ్వాసంతోనే విమానాన్ని నడుపుతాడు ఏ దేశంలో అయినా సరే!
అదే ఇంజిన్ ఆకస్మాత్తుగా పనిచేయకపోతే ఎవరైనా ఏం చేయగలరు?
అప్పడే కొంతమంది విశ్లేషణలు చేసేస్తున్నారు తేజస్ గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిపోయింది అంటూ..
ఇది అపోహ!
నిజం ఏమిటీ?
తేజస్ ని డిజైన్ చేసింది ఇంటర్సెప్ట్ కోసం! అంటే మన దేశ సరిహద్దు దాటి చొరబడే శత్రు విమానాలని అడ్డుకోవడం కోసం ( INTERCEPT). తేజస్ ఎటాక్ ఫైటర్ జెట్ కాదు, కేవలం అడ్డుకోవడానికి మాత్రమే!
అడ్డుకోవడానికి విమానం తేలికగా ఉండాలి! వేగంగా ప్రతిస్పందించాలి! శత్రు విమానాలు మన దేశంలోకి చొరబడి వాటి లక్ష్యాలని చేరుకొని దాడి చేయకుండా ఆలస్యం చేయడం కోసం డిజైన్ చేశారు. కాల పరిమితి తీరిన MIG-21 ల స్థానంలో తేజస్ లని ప్రవేశపెట్టడానికి మాత్రమే డిజైన్ చేశారు.
తేజస్ లు వేగంగా ప్రతిస్పందించి శత్రు విమానాలని దారి మళ్లీంచి ఆలస్యం చేస్తాయి ఈ లోపు SU-30 MKI లాంటి ఎయిర్ సుపిరియారిటి ఫైటర్ జెట్స్ అక్కడికి చేరుకొని తలపడతాయి! ఇదీ ఇంటర్సెప్టర్స్ చేసేపని. హైదరాబాద్ రోడ్ల మీద మహీంద్రా బొలెరో వాహనాలని INTERCEPTOR గా వాడడం మనం చూస్తున్నాం కదా?
So! 35 ఏళ్ళ క్రితం అప్పటి అవసరాల కోసం డిజైన్ చేశారు.
తేజస్ డిజైన్ ని unstable delta wing configuring తో చేశారు. తేజస్ డెల్టా వింగ్ అనేది నిలకడగా ఉండదు ( unstable). ఎజిలిటీ ( agility) అంటే చురుకుగా కదలడం కోసం డిజైన్ చేశారు కాబట్టి ఇంజిన్ థ్రస్ట్ లేకపోతే తిరుగుతూ పడిపోతుంది!
జస్ట్, త్రాచు పాము ముంగిస పోరాటంలో ముంగిస ఎజిలిటీ అంటే వేగంగా కదలడం అనేదే ముంగిస పాము కాటు నుండి తప్పించుకొని బ్రతకగలుగుతుంది. Unstable Delta Wing డిజైన్ అనేది కావాలని చేసిందే కానీ అది లోపం కాదు. తేజస్ లో పైలట్ సౌలభ్యం కోసం fly by wire టెక్నాలజినీ అమర్చారు.
జెనరల్ డేవిడ్ ఎల్ గోల్డ్ ఫీన్ ( Gen. David L Goldfien )!
అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందిన చీఫ్ అఫ్ స్టాఫ్ జెనరల్ డేవిడ్ L గోల్డుఫిన్ 2018లో మన దేశ పర్యటనకి వచ్చి రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఎయిర్ బేస్ నుండి తేజస్ ని 40 నిమిషాలు నడిపాడు. డేవిడ్ వెనకాల కూ ర్చున్నది అప్పటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ మార్షల్ AP సింగ్ గారు. AP సింగ్ గారు మన దేశ నేషనల్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కి ప్రిన్సిపల్ డైరెక్టర్ గా ఉన్నారు 2018 లో.
- 40 నిమిషాలు తేజస్ ని నడిపి లాండ్ అయ్యాక డేవిడ్ గోల్డ్ ఫిన్ EXCELLENT అన్నాడు! ఇండియా చేసిన డిజైన్ అన్ని లైట్ వైట్ విమానాలలోకి ది బెస్ట్ అన్నాడు.
ఒక దశలో అమెరిన్ నావీ కోసం శిక్షణ ఇవ్వడానికి తేజస్ ని కొనాలనే ప్రతిపాదన ఉండేది. డేవిడ్ తేజస్ ని నడిపి చూసిన తరువాత అది మరింత బలపడింది.
అమెరికన్ నావీ దగ్గర శిక్షణ కోసం వాడే T-45 Goshawk విమానాలు పాత పడిపోవడంతో తేజస్ ని కొనడానికి ట్రయల్ చూడడానికే డేవిడ్ భారత్ కి వచ్చాడు. కానీ రాజకీయ కారణాల వల్ల అది మూలన పడేశారు. అమెరికా కనుక తేజస్ ట్విన్ సీటర్ విమానాలని తన నావీ కోసం కొంటే ఇతర దేశాలు కూడా కొంటాయి సహజంగా! అమెరికన్ ఆయుధ లాబీ కి అది ఇష్టం ఉండదు!
తరువాయి భాగం... రెండో కథనంలో... తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
Share this Article