రెడ్లు వర్సెస్ కమ్మలు… ఏపీలో ఇది… తెలంగాణలో కాస్త రెడ్లు వర్సెస్ వెలమలు… పూర్తిగా కాదు, కానీ బీఆర్ఎస్ బలపడేకొద్దీ ఈ సమీకరణం బలంగా తెర మీదకు వచ్చింది… ఏపీలో అంతకుముందు పెద్దగా బహిర్గతం అయ్యేది కాదు, కానీ జగన్ పూర్తిగా కమ్మ వ్యతిరేక స్టాండ్ తీసుకుని, కమ్మ అని తెలిస్తే చాలు, తొక్కడం మొదలుపెట్టాడో ఇక పూర్తిగా ఏపీ రాజకీయం ఆ రెండు కులాల సమరంగా మారిపోయింది…
నిజమెప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది… కానీ రియాలిటీ ఏమిటంటే… తెలుగుదేశం కమ్మలకు మస్తు ప్రయారిటీ ఇస్తుంది, కానీ రెడ్లను ఇగ్నోరన్ చేయలేదు… చేయదు… ఆ కులంలోనూ విధేయులు ఉంటారు… సేమ్, జగన్ కూడా కమ్మలకు ఒక్క టికెట్టూ ఇవ్వకుండా ఉండలేడు… ఉంటే కుదరదు… కాకపోతే రెడ్లకు ఫుల్లు ప్రయారిటీ మస్ట్…
అంతే ఇక… వాళ్లకు వేరే కులాలు అక్కర్లేదు… ఏదో ప్రాతినిధ్యం ఇచ్చాం అని చెప్పుకోవడానికి కొన్ని అలా పారేస్తారు సీట్లు… తప్పదు కాబట్టి, రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ సీట్ల జోలికి పోరు… పైగా మేం ఆ కులాలకు ఇదుగో ఇన్ని సీట్లు ఇచ్చాం తెలుసా అని ప్రకటనలు, గొప్పలు…
Ads
ఏపీలో 2024 ఎన్నికల్లో ఏ కులం నుంచి ఎందరు, ఏ పార్టీ నుంచి అంటూ ఓ మెసేజ్ వాట్సపులో గింగరాలు తిరుగుతోంది… ఓసారి పరిశీలిస్తే… (ఈ అంకెల్లో నిజానిజాలేమిటో ఈ రచయిత నిర్ధారణ చేసుకోలేదు, గమనించగలరు…)
A.P. అసెంబ్లీ ఎన్నికలు – 2024… MLA లుగా ఎన్నికయిన సామాజిక వర్గాలు…
కమ్మ – 35
31. (తెలుగుదేశం)
03. ( భారతీయ జనతా పార్టీ)
01. ( జనసేన)
రెడ్డి – 32
24. (తెలుగు దేశం)
06. ( వైఎస్ఆర్ కాంగ్రెస్)
02. (భారతీయ జనతా పార్టీ)
ఇక్కడ చూశారుగా… తెలుగుదేశం నుంచి ఏకంగా 31 మంది కమ్మలు గెలుపొందారు… సరే, వాళ్ల పార్టీ వాళ్లిష్టం… కానీ అదే సమయంలో 24 మంది రెడ్లు కూడా ఎన్నికయ్యారు… అదే తెలుగుదేశం నుంచి… జగన్ రెడ్ల వ్యతిరేక పార్టీగా భావించిన తెలుగుదేశం నుంచి..!
సరే, ఇంకొన్ని కులాల సంగతి చూద్దాం…
కాపు/బలిజ – 18
09 ( తెలుగుదేశం)
09 ( జనసేన).
మాదిగ – 14
తెలుగుదేశం – 13
YCP – 1
క్షత్రియ – 07
టీడీపీ – 05
జనసేన – 01
బీజేపీ – 01
వైశ్య – 02 ( టీడీపీ )
బ్రాహ్మణ – 01. (జనసేన )
పద్మనాయక వెలమ – 01. (టీడీపీ)
కొప్పుల/ పోలినాటి వెలమ – 07
07. ( తెలుగు దేశం).
మాల- 15
తెలుగుదేశం – 12
జనసేన -2
YCP -1
యాదవ్ – 07
05 (తెలుగు దేశం)
01 ( జనసేన)
01 ( భారతీయ జనతా పార్టీ)
తూర్పు కాపు – 05.
టీడీపీ – 04
జనసేన – 01
గౌడ – 04 . (టీడీపీ)
బోయ / వాల్మీకి – 04.
02. (టీడీపీ)
01. (బీజేపీ)
01. (వైఎస్ఆర్ కాంగ్రెస్)
అగ్నికులక్షత్రియ – 03. (టీడీపీ 02 – జనసేన 01)
కళింగ – 02 . (తెలుగు దేశం)
శెట్టి బలిజ – 02. తెలుగు దేశం
గవర – 02 .
01 (టీడీపీ). – 01 (జనసేన)
కురుబ – 01. (తెలుగుదేశం)
రజక – 01. (తెలుగు దేశం)
సూర్య బలిజ -01. (తెలుగు దేశం)
పద్మశాలి /దేవాంగ/ చేనేత – 01. (తెలుగు దేశం)
ఎస్టీ – 07
టీడీపీ – 03
జనసేన – 02
వైఎస్ఆర్ కాంగ్రెస్ – 02
ముస్లిం – 03 (తెలుగు దేశం)
ఇదండీ ఏపీ అసెంబ్లీలో కులాల లెక్క… ఏతావాతా తేలిందేమిటంటే… ప్రయారిటీలు పక్కన పెడితే… రెడ్లు ఆడా ఉన్నారు, ఈడా ఉన్నారు… కమ్మలు కూడా ఆడా ఉంటారు, ఈడా ఉంటారు… అదీ రియాలిటీ..!! ఐనాసరే, ఊళ్లల్లో ప్రజలు కులాల వారీగా తన్నుకుంటూనే ఉంటారు, కుత్తుకలు కత్తిరించుకుంటూనే ఉంటారు… అదీ అసలైన ట్రాజెడీ..!! మీరెందుకు చంపుకుంటారురా… పైన అందరూ బాగానే ఉంటారు… ఉన్నారు…!!
Share this Article