ఈనాడులో, సాక్షిలో పెద్ద ఫుల్ పేజీ యాడ్ వచ్చింది… ‘‘హవ్వ, పెట్రో ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొర తగ్గించిన వాళ్లే ధర్నాలు చేస్తారట… చూశారా, జనం నుంచి కేంద్రం ఎంత వసూలు చేసుకుంటున్నదో, కానీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు… తెలుసా..?’’ అంటూ సుదీర్ఘ వివరణలతో సాగిపోయింది… ఏపీ ప్రభుత్వం బాధేమిటయ్యా అంటే… కేంద్రం వసూలు చేసుకుంటున్నది కానీ మాకు వాటా ఇవ్వడం లేదు అని..! సో, అటు కేంద్రానికీ లేదు, ఇటు రాష్ట్రానికీ లేదు, జనంపై మరింత భారం తగ్గించాలనే సోయి… ఎస్, నిజమే, ఏపీ ప్రభుత్వం చెబుతున్నది నిజమే… సెంట్రల్ ఎక్సైజ్ అయితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి… సర్‌ఛార్జి, సెస్ పేరిట కేంద్రం జనం జేబులపై దాడి చేస్తోంది… కరోనా సంక్షోభ ఫలితాలు సమాజంపై వికృతంగా కనిపిస్తున్నవేళ, ఆదుకోవాల్సింది పోయి కేంద్రం దోచుకుంటోంది… గ్యాస్, పెట్రో ధరలే కాదు, మార్కెట్‌లో ధరలు పెరగని సరుకు లేదు… కానీ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకోవాలి, జీఎస్టీలోకి తెస్తే సరి అనే వితండవాదనలతో సగటుమనిషి ధరల అవస్థల్ని కూడా అపహాస్యం చేస్తున్నారు కొందరు…
ధరలు పెంచేదేమో కేంద్రం… తగ్గించుకునే బాధ్యత రాష్ట్రాలదట… వితండ విమర్శ… దాన్నలా వదిలేస్తే, ఏపీ ప్రభుత్వ ప్రకటన విషయానికి వస్తే… గతంలో పెట్రో ధరలపై సెంట్రల్ ఎక్సయిజ్, సర్‌చార్జి, సెస్ ఎంత ఉండేదో… ఎప్పుడెప్పుడు ఎంత పెంచుతూ పోయారో ఓ టేబుల్ ఇస్తే బాగుండు… ప్రజలకు అర్థమయ్యేది అసలు దోషులెవరో… కానీ ఆ ప్రకటన ఎంతసేపూ, కరోనా పీరియడ్‌లో మా ఆదాయం పోయింది, పాత దుర్మార్గ పాలకులు రోడ్లను పట్టించుకోలేదు, కేంద్రం మా వాటాను మాకు ఇవ్వడం లేదు అన్నట్టుగా సాగిపోయింది… అంటే, తన వాటా కోసం ఏడుస్తున్నట్టుగా ఉంది తప్ప సమస్య తీవ్రతను వివరించే ప్రయత్నం ఏమీ లేదు… (ఫాఫం, జగన్‌కు ప్రపంచంలో ఏ పాలకుడికీ లేనంత మంది మీడియా సలహాదార్లు, వ్యవస్థ ఉంది… కానీ ఒక్క ప్రకటన కూడా జనానికి కనెక్ట్ కాదు… అయ్యేలా ఉండదు…) చివరాఖరికి జగన్ ప్రభుత్వ ప్రకటన పరోక్షంగా తేల్చింది ఏమిటయ్యా అంటే… వ్యాట్ తగ్గించేది లేదు…!!
Ads
నిజమే, జగన్ ప్రభుత్వమే నిండా అప్పుల్లో కూరుకుపోయి ఉంది… పెట్రో ఉత్పత్తుల మీద వ్యాట్ తగ్గించే స్థితిలో లేదు… అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ఆల్రెడీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అదుపు తప్పిపోయి ఉంది ఇప్పుడు… ఇది ఏదో ఆంధ్రజ్యోతి వాడు అక్కసుతో రాస్తున్న సంగతి కాదు… నిజంగానే డోల్ డ్రమ్స్… పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే ఏకంగా ఏపీజెన్‌కో బకాయిలు చెల్లించడం లేదు, అది నిరర్థక ఆస్తి అని ముద్ర వేసేశాడు… నిజానికి ఆంధ్రజ్యోతికి సరిగ్గా రాయడం చేతకాలేదు కానీ ప్రజాశక్తిలో ఫస్ట్ లీడ్ స్టోరీ అదే… స్ట్రెయిట్‌గా, అర్థమయ్యేలా ఉంది… (ఏపీలో మిగతా పత్రికలు ఏవీ లేవు కదా…)… ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఏపీ ప్రభుత్వం మీద డిఫాల్టర్ అనే ముద్ర వేస్తుంటే మాత్రం దాని దుష్పరిణామాలు రాష్ట్రంపై దీర్ఘకాలికంగా ప్రతికూలంగా ఉండబోతున్నయ్… (అన్నట్టు, ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక సలహాదారులు కూడా ఉన్నారండోయ్…) ఎవరికి నచ్చినా నచ్చకపోయినా స్థూలంగా బర్డ్ వ్యూలో కనిపిస్తున్నది ఒకటే… ఏపీ వెనక్కి నడుస్తోంది… కాదు, పరుగెడుతోంది…!!
Share this Article