.
గోపాలక్రిష్ణ చెఱుకు, 9885542509… టాలీవుడ్ మొదలు.. బాలీవుడ్ దాకా అగ్రహీరోల పాత్రలను బీట్ చేసిన లేడి విలన్!
ఎనబై, తొంబైల్లో తెలుగు సినిమా విలన్ల పాత్ర చాలా కీలకంగా ఉండేది. ఎంతంటే. ఆ పాత్రలో జీవించిన నటులు బయట కనిపిస్తే.. యమ తిట్లు తిట్టేవారు అప్పటి జనం. ఎందుకంటే, ఆ పాత్రలో అలా జీవించేవారు మరి.
Ads
అలాంటి నటులు కనుమరుగైపోతున్నారని అనుకుంటున్న వేళ… కూలీ సినిమాలో ఓ లేడి క్యారెక్టర్ మొత్తం టాప్ హీరోలను కూడా డ్యామినేట్ చేసేసింది. సగటు ప్రేక్షకుడు ఆమెను చూస్తున్నంత సేపు.. నాయల్ది, కత్తందుకో జానకీ… అన్నంత కోపంతో సినిమా చూస్తున్నాడు. ఆ క్యారెక్టర్‌లో అంతలా జీవించింది రచితా రామ్.
కూలీ సినిమాలో బాలీవుడ్ సహా కన్నడ, తెలుగు, తమిళ, మళయాళం ఇండస్ట్రీల నుండి పేరొందిన అగ్రహీరోలు నటించారు. కానీ అందులో విలన్ పాత్ర పోషించిన నాగార్జున, అమీర్ ఖాన్, షౌబిన్ కంటే కూడా.. రచితా రామ్ నటించిన కళ్యాణి క్యారెక్టర్ చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అందుకే సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో ఆమె పాత్ర గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె పాత్ర చుట్టూ ఉన్న ట్విస్ట్.. ఆమె నటనా ప్రేక్షకులను కట్టేపడేసింది.
80, 90ల నాటి తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించిన చలపతిరావు, కోట, ఆ తర్వాత తనికెళ్ల భరణి లాంటి వాళ్లను బయట చూసినప్పుడు జనం కోపంగా ఉద్రేకంగా చూసేవారట. ఆ సినిమాలో హీరోయిన్‌ను అంతలా ఏడిపించాలా.. హీరోనే చంపేంత ధైర్యమారా అంటూ ప్రశ్నలు ఎదుర్కొన్నామంటూ ఆ పాత విలన్లు ఎన్నోసార్లు చెప్పిన ఘటనలూ ఉన్నాయి.
అదిగో అలాంటి సందర్భమే.. ఇప్పుడు ఈ కన్నడ భామ రచితా రామ్ ఎదుర్కొంటుందట. సినిమా చూస్తున్నంత సేపు ఈ క్యారెక్టర్‌లో ఉండే వేరియేషన్స్‌కి ప్రేక్షకుల్లో ఆమె పట్ల చిర్రెత్తుకొచ్చి.. కనిపిస్తే కొట్టాలన్న కోపం తెప్పించేస్తుందంటున్నారు.
అంతేనా, చివర్లో నాగార్జున ఆమెను చంపేస్తుంటే… ఇంకా ఇంకా అన్నట్టుగా మనసులోని రాక్షసత్వాన్ని బయటకు ప్రదర్శిస్తున్నారు కొందరు ప్రేక్షకులు. అంతలా.. ఆ క్యారెక్టర్‌లో నటించింది రచితా రామ్.
అసలు ఈ సినిమాలో అమాయకత్వంతో సహా రూత్‌లెస్ విలనిజం చూపించిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే.. అది కేవలం రచితా రామ్ నటించిన కళ్యాణి పాత్ర మాత్రమే. అందుకే అగ్రహీరోలు విలన్లుగా నటించినా… సగటు ప్రేక్షకుడి మదిలో మాత్రం ఈ కన్నడ భామ మాత్రమే గుర్తిండిపోయింది..
సోషల్ మీడియా అంతటా చర్చగా మారింది ఈమె ఇప్పుడు… అన్నట్టు.. ఈ లేడి విలన్ 2013 లో తన కెరీర్ మొదలు పెట్టింది. ఇన్నేళ్లు కన్నడ నాట సినిమాలు చేసింది. ఇప్పుడు కూలీ సినిమాతో అన్ని ప్రాంతాల్లోనూ చర్చగా మారింది…
అసలు పేరు బింధ్యా రామ్… భరతనాట్యంలో ట్రెయిన్డ్… మొదట్లో టీవీ షోలు… తరువాత సినిమాలు… ఎక్కువగా కన్నడమే… సోదరి నిత్యా రామ్… ఆమె కూడా టీవీ కమ్ సినిమా నటే… రచిత చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలున్నయ్… కన్నడంలో అధిక పారితోషికాలు తీసుకునే తారల్లో ఈమె కూడా ఉంది…
Share this Article