Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!

April 24, 2026 by M S R

.

అనంత ‘హనీ’ చీకట్లు: వలపు వల.. ఖాకీల అండ.. ఖరీదైన బ్లాక్‌మెయిల్ దందా! అనంతపురం జిల్లాలో అధికారం అండతో సాగుతున్న ఒక భయంకరమైన హనీట్రాప్ మాఫియా గుట్టురట్టయింది… కేవలం మహిళలను ఎరగా వేయడమే కాదు, ఏకంగా పోలీసు అధికారులనే తమ వసూళ్ల దందాకు కాపలాదారులుగా మార్చుకున్న ఈ ముఠా భాగోతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది…

జగన్ పోగానే, చంద్రబాబు రాగానే ఏదో అద్భుతం ఆవిష్కృ‌తం కాదు, పవన్ కల్యాణ్ మొత్తం పాలన ఎపిసోడ్లలో ‘ఆటలో అరటిపండు’ మాత్రమే… కుళ్లిపోయిన వ్యవస్థలో ఇక ఎవడూ ఏమీ చేసేది ఏమీ లేదు… మొత్తం ఏపీ రాజకీయ, పాలన వ్యవస్థ కుళ్లిపోయిన ఓ అరటిపండు… సాక్షిలో కనిపించిన ఓ ‘హానీట్రాప్’ స్టోరీ సూపర్… ఈ కథన బాధ్యులకు అభినందనలు…

Ads

సాక్షి

  • (మెచ్చుకుందాం, షేర్ చేద్దామంటే… అంటే లింకులు సరిగ్గా దొరకి చావవు… అదొక చెత్తా వెబ్‌‌సైట్… సాక్షిని ఇన్నేళ్లూ పాలించిన వాళ్ల సంగతి వదిలేయండి, కొత్తవాళ్లకూ పట్టడం లేదా పాపం..? వందలు, వేల కోట్లు పెడుతున్నా జగన్‌కు సాక్షి ఓ విరిగిన కాలు, వెరసి జగన్ దివ్యాంగుడు…)

 

ఎవరీ రంగమ్మ? ఎవరీ రాజేష్? సాక్షి కథనంలో ప్రధాన నిందితురాలుగా ఉన్న రంగమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ప్రధాన అనుచరురాలని సమాచారం… అలాగే, మరో కీలక నిందితుడు రాజేష్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు… ఈ రాజకీయ నీడనే అస్త్రంగా చేసుకుని వీరు జిల్లాలోని సంపన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, సివిల్ కాంట్రాక్టర్లను వేటాడటం మొదలుపెట్టారు…

దందా సాగిందిలా: వలపు నుంచి వసూళ్ల వరకు…

  1. టార్గెట్….: ముందుగా ఆర్థికంగా బలవంతులైన వారి ఫోన్ నంబర్లు సంపాదించి, యువతులతో వారితో పరిచయం పెంచుతారు….

  2. ఎర….: వారిని ఏకాంతంగా కలవాలని నమ్మించి, పక్కా ప్లాన్‌తో గదికి పిలిపిస్తారు…

  3. వీడియో షూట్…: అక్కడ సిద్ధంగా ఉంచిన కెమెరాల ద్వారా వారి ఏకాంత దృశ్యాలను షూట్ చేస్తారు…

  4. బ్లాక్‌మెయిల్…: వీడియోలు బయటపెడతామని బెదిరించి, కోట్లాది రూపాయల డిమాండ్ చేస్తారు… బాధితులు భయపడితే, వారి నుంచి ప్రామిసరీ నోట్లు, బాండ్లు బలవంతంగా రాయించుకుంటారు…

ఖాకీల ‘కక్కుర్తి’.. విచారణలో షాకింగ్ నిజాలు! ఈ దందాలో పోలీసుల పాత్ర అత్యంత హేయంగా ఉంది… బాధితులు ఎవరైనా పోలీసుల దగ్గరకు వెళ్తే, వారికి న్యాయం చేయాల్సింది పోయి… ఈ ముఠాకే సహకరించారు… సీఐ శ్రీహర్ష వంటి అధికారులు బాధితుల నుంచి వసూలైన సొమ్ములో వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి… ఇప్పటికే ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపడం, మరికొంతమందిపై విచారణ జరపడం ఈ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో చెబుతోంది…

రాజకీయ రక్షణ.. వ్యవస్థల పతనం! ఒకవైపు ఇసుక, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న నేతలు, మరోవైపు ఇలాంటి ‘హనీట్రాప్’ ముఠాలకు అండగా నిలవడం గమనార్హం… అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యుల పరువుతో ఆడుకోవడం, పోలీసులను జేబులో పెట్టుకుని దందాలు చేయడం ఈ ముఠాకు అలవాటుగా మారింది… తాజాగా రూ.13 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ ముఠా ఎంత పెద్ద ఎత్తున నెట్‌వర్క్ నడుపుతోందో అర్థమవుతోంది…

చివరగా… చంద్రబాబు మార్కు ‘మేనేజ్‌మెంట్’ రాజకీయాలు, అడుగున ఉన్న ఇలాంటి చిన్నా చితకా నేతలకు ఎంతటి తెగింపును ఇచ్చాయో ఈ ఘటనే నిదర్శనం… వ్యవస్థలన్నీ తమ గుప్పిట్లోనే ఉన్నాయనే ధీమాతో సాగుతున్న ఈ ‘వలపు’ దందా వెనుక ఇంకా ఎంతమంది పెద్దల జాతకాలు ఉన్నాయో పోలీసులు తేల్చాల్సి ఉంది… పోలీసులు తేల్చరు… వారు లోకేష్ మాట జవదాటరు… ఫాఫం, ఏపీ ప్రజలు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!
  • 24 లక్షల ప్రాణాలు కాపాడాడు… అక్షరాలా ఈయన ఓ అద్భుతం…
  • ముఖ్యమంత్రి కావడం సులభం సుమీ… నమ్మకపోతే ‘సూర్య IPS’ చూడుడు…
  • Ola, Uber, Rapido… ‘చక్కదిద్దడం’ ఈ సర్కారుకు చేతకాదా..?
  • సత్తెన్నా… గిసంటోళ్ల కోసమా నువ్వు జీవితాన్ని ధారబోసింది…
  • ఈ ఐపీఎల్ సీజన్‌కు కెప్టెన్లే సగం దరిద్రం… ఇదుగో వివరాలు…
  • సంభవం… మలయాళీ డైరెక్టర్లూ, ఇలాంటి మూవీస్ మీకే సంభవం…
  • ప్రపంచాన్ని వణికించే ఉగ్రభూతాలు… భయంతో వణికి చస్తున్నాయి…
  • నిన్నటి హీరో, ఈరోజు విలన్? నేపాల్ రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్!
  • లెన్స్‌కార్ట్ ‘బొట్టు’ను గౌరవించలేదు… ఆ పైత్యానికి అసలు కారణాలివీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions